రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ ఎస్ డబ్ల్యూఎస్) ద్వారా ఆటోమేటెడ్టెస్టింగ్ స్టేషన్లు, రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీల ఏర్పాటు కోసం రిజిస్ట్రేషన్సర్టిఫికేట్ మంజూరుకు దరఖాస్తు

Posted On: 23 MAR 2023 3:09PM by PIB Hyderabad

ప్రైవేట్ పెట్టుబడిదారులకు సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ ఎస్ డబ్ల్యూఎస్ ) ద్వారా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు , రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు కోసం దరఖాస్తును సులభతరం చేసింది.

 

ప్రస్తుతం 18 రాష్ట్రాలు వీ-వీఎంపీ కోసం దరఖాస్తుల ఆమోదానికి ఎన్ ఎస్ డబ్ల్యూఎస్ లో నమోదై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఎన్ ఎస్ డబ్ల్యూఎస్ లో ఉన్నాయి.

 

17 రాష్ట్రాల్లో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ కోసం 79 మంది ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వానికి దరఖాస్తులు రాగా, వాటిలో 48 దరఖాస్తులను రాష్ట్రాలు ఆమోదించాయి.

 

రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీల వివరాలు , వాటి ద్వారా స్క్రాప్ చేయబడ్డ వాహనాల సంఖ్య అనుబంధంలో ఇవ్వబడ్డాయి.

 

వాలంటరీ వెహికల్-ఫ్లీట్ ఆధునీకరణ కార్యక్రమం (వి-విఎంపి) లేదా వెహికల్ స్క్రాపింగ్ పాలసీని అమలు చేయడానికి, ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తీసుకుంది:

 

(1) రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్ వి ఎస్ ఎఫ్ ) ఏర్పాటు కోసం 23.09.2021 నాటి జిఎస్ఆర్ నోటిఫికేషన్ 653 (ఇ) మోటారు వాహనాల (వాహన స్క్రాపింగ్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ , విధులు) నిబంధనలు, 2021 ను అందిస్తుంది.

ఈ నోటిఫికేషన్ 2021 సెప్టెంబర్ 25 నుంచి అమలు లోకి వచ్చింది.

 

(2) 23.09.2021 నాటి జిఎస్ఆర్ నోటిఫికేషన్ 652 (ఇ) ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ల గుర్తింపు, నిబంధన, నియంత్రణను అందిస్తుంది. ఈ నోటిఫికేషన్ 2021 సెప్టెంబర్ 25 నుంచి అమలు లోకి వచ్చింది.

 

(3) 04.10.2021 నాటి జిఎస్ఆర్ నోటిఫికేషన్ 714 (ఇ) ను రిజిస్ట్రేషన్ ఫీజు, ఫిట్నెస్ టెస్టింగ్ ఫీజు , వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికేషన్ ఫీజును పెంచడానికి ఉద్దేశించారు. ఈ నోటిఫికేషన్ 2022 ఏప్రిల్ 1 నుంచి అమలు లోకి వచ్చింది.

 

05.10.2021 నాటి జిఎస్ఆర్ నోటిఫికేషన్ 720 (ఇ) "సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్" సమర్పించకుండా రిజిస్టర్ చేసిన వాహనానికి మోటారు వాహన పన్నులో రాయితీని అందిస్తుంది. ఈ నోటిఫికేషన్ 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

 

05.04.2022 నాటి జిఎస్ఆర్ నోటిఫికేషన్ 272(ఇ) ప్రకారం, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 లోని రూల్ 175 ప్రకారం రిజిస్టర్ చేయబడిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా మాత్రమే కింది విధంగా మోటారు వాహనాలను తప్పనిసరిగా ఫిట్ చేయాలి.

 

(i) 01 ఏప్రిల్ 2023 నుండి అమలులోకి వచ్చే హెవీ గూడ్స్ వెహికల్స్/హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్స్ కొరకు, మరియు

 

(ii) మీడియం గూడ్స్ వెహికల్స్/ మీడియం ప్యాసింజర్ మోటార్ వెహికల్స్ ,లైట్ మోటార్ వెహికల్స్ (ట్రాన్స్ పోర్ట్ ) కోసం 01 జూన్ 2024 నుండి.

 

(6) 13.09.2022 నాటి జిఎస్ఆర్ నోటిఫికేషన్ 695 (ఇ) ను 23.09.2021 నాటి జిఎస్ఆర్ 653 (ఇ) లో ప్రచురించిన మోటారు వాహనాల (వాహన స్క్రాపింగ్ ఫెసిలిటీ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ,విధులు) నిబంధనల సవరణకు ఉద్దేశించారు.

 

(7) 31.10.2022 నాటి జిఎస్ఆర్ నోటిఫికేషన్ 797 (ఇ) 23.09.2021 నాటి జిఎస్ఆర్ 652 (ఇ) ద్వారా ప్రచురించిన "ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల గుర్తింపు,

రెగ్యూలేషన్ , నియంత్రణ" నిబంధనలలో సవరణలు చేస్తుంది.

 

(8) జిఎస్ఆర్ నోటిఫికేషన్ 29(ఇ) 16.01.2023 ప్రకారం కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, వాటి శాఖలు, స్థానిక ప్రభుత్వం (మునిసిపల్ కార్పొరేషన్లు లేదా మున్సిపాలిటీలు లేదా పంచాయతీలు), పిఎస్ యు లు, కేంద్ర, ప్రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న ఇతర స్వయంప్రతిపత్తి సంస్థలకు చెందిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను పదిహేనేళ్లు దాటిన తర్వాత పునరుద్ధరించకూడదు.

 

వెహికల్-ఫ్లీట్ ఆధునీకరణ కార్యక్రమం అమలును వేగవంతం చేయడానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ కు చెందిన వ్యయ విభాగం 'మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం 2022-23' కోసం కొనసాగుతున్న పథకంలో రాష్ట్రాలకు రూ .2000 కోట్ల ప్రోత్సాహకాన్ని చేర్చింది. 'స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 2023-24' పేరుతో 2023-24లోనూ ఇదే పథకాన్ని కొనసాగించారు. 15 ఏళ్లు పైబడిన పాత ప్రభుత్వ వాహనాలను స్క్రాపింగ్ చేయడం, పాత వాహనాలపై అప్పుల మాఫీ, పాత వాహనాలను స్క్రాపింగ్ చేయడానికి వ్యక్తులకు పన్ను రాయితీలు కల్పించడం, ఆటోమేటెడ్ వెహికల్ టెస్టింగ్ సౌకర్యాల ఏర్పాటుకు ఈ పథకంలో రూ.3000 కోట్లు కేటాయించారు.

 

జాతీయ సింగిల్ విండో సిస్టమ్ కు సంబంధించిన అనుబంధం

 

రాష్ట్రాల వారీగా రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ,స్క్రాప్ చేయబడ్డ వాహనాల సంఖ్య (జనవరి 2022 నుంచి 20 మార్చి 2023 వరకు)

 

 

రాష్ట్రం

ఆపరేషనల్ ఆర్ వి ఎస్ ఎఫ్ ల సంఖ్య

స్క్రాప్ చేయబడ్డ వాహనాల సంఖ్య

ఉత్తరప్రదేశ్

4

6,247

గుజరాత్

3

1,244

అస్సాం

1

357

మధ్యప్రదేశ్

1

220

హర్యానా

2

134

చండీఘర్

1

18

గ్రాండ్ టోటల్

12

8,220

 

కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.

 

******



(Release ID: 1910054) Visitor Counter : 142


Read this release in: English