జల శక్తి మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన ద్వారా నీటిపారుదల వ్యవస్థ సృష్టించబడింది
Posted On:
20 MAR 2023 5:53PM by PIB Hyderabad
ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన (పిఎంకెఎస్‌వై) 2015-16 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది పొలంలో నీటి పారుదలను మెరుగుపరచడం మరియు హామీ ఇవ్వబడిన నీటిపారుదల కింద సాగు యోగ్యమైన ప్రాంతాన్ని విస్తరించడం, వ్యవసాయ నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన నీటి సంరక్షణ పద్ధతులను పరిచయం చేయడం వంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.
పిఎంకెఎస్‌వై అనేది గొడుగు పథకం. మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న రెండు ప్రధాన భాగాలు ఈ పథకంలో ఉన్నాయి. అవి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ (ఏఐబిపి), మరియు హర్ ఖేత్ కో పానీ (హెచ్‌కెకెపి).కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ & వాటర్ మేనేజ్‌మెంట్ (కాడ్&డబ్ల్యూఎం), సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్ (ఎస్‌ఎంఐ), రిపేర్, రినోవేషన్ అండ్ రిస్టోరేషన్ (ఆర్‌ఆర్‌ఆర్) వాటర్ బాడీస్ మరియు గ్రౌండ్ వాటర్ (జీడబ్ల్యూ) డెవలప్‌మెంట్ కాంపోనెంట్ అనే నాలుగు ఉప భాగాలు వీటిలో ఉన్నాయి. అయినప్పటికీ హెచ్‌కెకెపికి చెందిన సిఏడి&డబ్ల్యూఎం సబ్-కాంపోనెంట్ ఏఐబిపితో పరి-పాసు అమలు చేయబడుతోంది.
వీటికి తోడు అదనంగా గుర్తించబడిన ప్రత్యేక మరియు జాతీయ ప్రాజెక్టులకు నీటిపారుదల సంభావ్యత సృష్టి/స్థిరీకరణ కోసం ఈ మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర సహాయం కూడా అందించబడుతుంది. వీటిలో లఖ్వార్ బహుళార్ధసాధక ప్రాజెక్ట్, షాపూర్ కంది ఆనకట్ట ప్రాజెక్ట్, పోలవరం (జాతీయ) నీటిపారుదల ప్రాజెక్ట్, రాజస్థాన్ ఫీడర్ రిలైనింగ్ మరియు పంజాబ్‌కు చెందిన సిర్హింద్ ఫీడర్ మరియు నార్త్ కోయెల్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఉన్నాయి.
పైన పేర్కొన్నవి కాకుండా జూలై, 2018లో భారత ప్రభుత్వం మహారాష్ట్రకు ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించింది. దీని ద్వారా విదర్భ మరియు మరఠ్వాడతో పాటు మిగిలిన మహారాష్ట్రలో కరువు జిల్లాల్లోని 83 ఉపరితల చిన్న నీటిపారుదల (ఎస్‌ఎంఐ) ప్రాజెక్టులు మరియు 8 ప్రధాన / మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టులకు 2022-23 వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.
సిఏడి&డబ్ల్యూఎం పరి పాసు అమలుతో పిఎంకెఎస్‌వై-ఏఐబిపి క్రింద సృష్టించబడిన మొత్తం నీటిపారుదల వ్యవస్థ ఉంటుంది;పిఎంకెఎస్‌వై-హెచ్‌కెకెపికు చెందిన ఎస్‌ఎంఐ, ఆర్‌ఆర్‌ఆర్& జీడబ్ల్యూ భాగాలు; లఖ్వార్, షాపూర్ కంది, మరియు పోలవరం జాతీయ ప్రాజెక్టులు; రిలైనింగ్ ఆఫ్ రాజస్థాన్ ఫీడర్ & సిర్హింద్ ఫీడర్ ఆఫ్ పంజాబ్ మరియు నార్త్ కోయెల్ రిజర్వాయర్ ప్రాజెక్ట్; మరియు మహారాష్ట్ర ప్రత్యేక ప్యాకేజీ 2017-18 నుండి 2021-2022 వరకు, రాష్ట్రాల వారీగా మరియు సంవత్సరం వారీగా అనుబంధం-Iలో ఉంది.
2017-18 ఆర్థిక సంవత్సరం నుండి ప్రస్తుత తేదీ వరకు భారత ప్రభుత్వం అందించిన కేంద్ర సహాయం మరియు పైన పేర్కొన్న పథకాలు/ప్రాజెక్ట్‌ల కింద 2017-18 నుండి 2021-22 వరకు చేసిన ఖర్చులు, రాష్ట్రాల వారీగా మరియు సంవత్సరం వారీగా, అనుబంధం-II మరియు అనుబంధం- III ఉన్నాయి.
ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1908995)
Visitor Counter : 143