గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి ఆవాస యోజన - గ్రామీణ పథకాన్ని ప్రోత్సహించడానికి చర్యలు
Posted On:
15 MAR 2023 5:46PM by PIB Hyderabad
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలందరికీ సొంత గృహాలను కల్పించానే లక్ష్యంతో ఏప్రిల్ 1, 2016న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆవాస యోజన -గ్రామీణ ( పిఎంఏవై-జి) పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మార్చి, 2024 నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల 95 లక్షల పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో రెండు కోట్లా 94 లక్షల గృహాలను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించడం జరిగంది. ఈ 2. 94 కోట్ల గృహాలలో 2.85 కోట్ల గృహాలను ఆయా రాష్ట్రాలు, కేందపాలిత ప్రాంతాలలోని లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగింది. వీటిలో 2.18 కోట్ల ఇళ్లను మార్చి 11, 2023 నాటికి నిర్మించడం పూర్తయింది. పిఎంఏవై-జిని ప్రోత్సహించడానికిగాను మంత్రిత్వశాఖ కింది చర్యలను తీసుకోవడం జరిగింది.
మంత్రిత్వ స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి పథకం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడం జరుగుతోంది. పథకం అమలు పర్యవేక్షణ చేయడానికిగా పిఎంఏవై-జి డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా రాష్ట్రప్రభుత్వాలకే, కేంద్రపాలిత ప్రాంతాలకు లక్ష్యాలను నిర్దేశించి, తగిన నిధులను విడుదల చేయడం జరుగుతోంది. రాష్ట్రాలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు చేస్తూ కేంద్ర రాష్ట్ర వాటా నిధులు విడుదలయ్యేలా చూడడం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం లేని పేదలకు ఇంటి స్థలాలను ఇవ్వడం జరుగుతోంది. గృహనిర్మాణంలో ఉత్తమస్థాయి కృషి చేసిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు, ఆయా జిల్లాలు, బ్లాక్ స్థాయిలకు అవార్డులను ఇవ్వడం జరుగుతోంది. డ్యాష్ బోర్డ్ సూచిక ఆధారంగా అవార్డులను ఇవ్వడం జరుగుతోంది. తద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్యన ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఏర్పడుతుంది. దాంతో లక్ష్యసాధన సులువవుతోంది.
పిఎంఏవై-జి కింద ఒక పక్కా గృహం సైజు 25 చదరపు మీటర్లు. ఇందులోనే వంట చేసుకోవడానికిగాను పరిశుభ్రమైన ప్రాంతంకూడా వుంటుంది. పిఎంఏవై - జి కింద కేటాయించిన మినిమమ్ యూనిట్ ఏరియాకంటే ఎక్కువ స్థలంలో ఇళ్లను నిర్మించుకోవడానికిగాను లబ్ధిదారులకు స్వేచ్ఛ వుంది. ప్రభుత్వం పేర్కొన్న మినిమమ్ యూనిట్ ఏరియాను పెంచాలనే ప్రతిపాదన ఏదీ మంత్రిత్వశాఖ వద్ద లేదు.
......
ఈ సమాచారం ఈ రోజు రాజ్యసభలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సాధ్వి నిరంజన జ్యోతి రాతపూర్వకంగా అందజేశారు.
***
(Release ID: 1907449)
Visitor Counter : 99