గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మిష‌న్ అంత్యోద‌య స‌ర్వే ల‌క్ష్యాలు

నాడు పోస్టు చేయడమైనది: 15 MAR 2023 5:43PM by PIB Hyderabad

కేంద్ర‌ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ కార్య‌క్ర‌మాల కింద గ్రామీణ ప్రాంతాల‌ను అభివృద్ధి చేయ‌డానికి 27 మంత్రిత్వ‌శాఖ‌లు/  విభాగాలు అంద‌జేస్తున్న వ‌న‌రుల‌ను సంపూర్ణంగా నిర్వ‌హించ‌డానికిగాను మిష‌న్ అంత్యోద‌య స‌ర్వేను రూపొందించారు. ఇది వివిధ అంశాలతో కూడిన బాధ్య‌తాయుత‌మైన విధివిధానాల వ్య‌వ‌స్థ‌. ఇది గ్రామ పంచాయితీల అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారు చేయ‌డానికి చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతోంది. దేశంలోని 2 ల‌క్ష‌లా 69 వేల 253 గ్రామ‌పంచాయ‌తీల‌కు సంబంధించి  ఏర్ప‌డే అంత‌రాల‌ను విశ్లేషించ‌డానికి దీన్ని ఉప‌యోగిస్తారు. దేశంలోని ఆరున్న‌ర ల‌క్ష‌ల గ్రామాల‌కు సంబంధించిన మౌలిక స‌దుపాయాలు, సేవ‌ల స‌మాచార సేక‌ర‌ణ‌, స‌ర్వే చేయ‌డమ‌నేది అంత్యోద‌య ప‌థ‌కం ప్రాధ‌మిక ల‌క్ష్యం. మిష‌న్ అంత్యోద‌య స‌ర్వే అనేది అంత‌రాల విశ్లేష‌ణ చేయ‌డానికిగాను ద్వితీయ స్థాయి స‌మాచారాన్ని అందిస్తుంది. గ్రామ పంచాయ‌తీ, బ్లాక్‌, జిల్లా స్థాయిల్లో అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారు చేయ‌డానికిగాను ఈ స‌మాచారం కీల‌కమైన ఇన్ పుట్ గా ఉప‌యోగ‌ప‌డుతుంది. 
ఇది క‌న్వ‌ర్జెన్స్ ఫ్రేమ్ వ‌ర్క్ కావ‌డంతో మిష‌న్ అంత్యోద‌య స‌ర్వేకు నిధుల కేటాయింపు జ‌ర‌గ‌లేదు. మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద ఆయా రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలకు అందుబాటులో వున్న నిధుల‌తో ఈ స‌ర్వేను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది. మిష‌న్ అంత్యోద‌య స‌ర్వే 2022-23 ను ఏప్రిల్ 15, 2023నాటికి పూర్తి చేయాల‌ని సంక‌ల్పించారు. గుర్తించిన అన్ని ర‌కాల ప్రాధ‌మిక అవ‌స‌రాల‌ను నిర్దిష్ట స‌మ‌యంలో తీర్చ‌గ‌లిగేలా మిష‌న్ అంత్యోద‌య ప్రో్త్స‌హిస్తుంది. వ్య‌క్తులకుగానీ, కుటుంబాలకుగానీ, క‌మ్యూనిటీ స్థాయిలోగానీ ఏర్ప‌డే ప్రాధ‌మిక అవ‌స‌రాల‌ను సంతృప్త‌స్థాయిలో తీర్చ‌డానికిగాను ప్ర‌బుత్వ ప‌థ‌కాల అమ‌లును బ‌లంగా, వేగంగా చేస్తారు. గ్రామ పంచాయ‌తీ అభివృద్ధి ప‌థ‌క ప్ర‌ణాళిక భాగ‌స్వామ్య విధానానికి ఇది మ‌ద్ద‌తు ఇస్తుంది. తద్వారా సేవ‌ల అందుబాటు పెరుగుతుంది. ప్రజా సంఘాల, సంస్థ‌ల ఐక్య వేదిక త‌యారీకి అవ‌కాశం ల‌భిస్తుంది. స్థానిక స్థాయిలో పాల‌న మెరుగ‌వుతుంది.  ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంతో స‌హా దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు ఈ స‌ర్వే స‌మాచారం ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ఈ స‌మాచారం ఈ రోజు రాజ్య‌స‌భ‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సాధ్వి నిరంజ‌న జ్యోతి రాత‌పూర్వ‌కంగా అంద‌జేశారు. 

***


(రిలీజ్ ఐడి: 1907438) సందర్శకుల సూచీ సంఖ్య : : 162
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English