వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆశావహ, అధిక భారం ఉన్న జిల్లాల కోసం టీపీడీఎస్‌ కింద దశ-IIలో 92.77 ఎల్‌.ఎం.టి.ల బలవర్థక బియ్యం పంపిణీ

నాడు పోస్టు చేయడమైనది: 15 MAR 2023 5:26PM by PIB Hyderabad

2024 నాటికి దశల వారీగా అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ), భారత ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాల కింద లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టీపీడీఎస్‌) మొత్తానికీ బలవర్థక బియ్యం సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారం అందించారు. దశల వారీగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు ప్రణాళిక ఈ కింది విధంగా ఉంటుంది:

  1. దశ-I: మార్చి 2022 నాటికి భారతదేశం మొత్తానికి ఐసీడీఎస్‌, పీఎం-పోషణ్‌ వర్తింపు
  2. దశ-II: దశ-Iతో పాటు, కుంగుబాటు సమాచారంపై (మొత్తం 291 జిల్లాలు) అన్ని ఆశావహ, అధిక భారం ఉన్న జిల్లాల్లో మార్చి 2023 నాటికి టీపీడీఎస్‌, ఓడబ్ల్యూఎస్‌
  3. దశ-III:  దశ-IIతో పాటు, మార్చి 2024 నాటికి దేశంలోని మిగిలిన జిల్లాలకు వర్తింపు

దశ-Iలో, ఐసీడీఎస్‌, పీఎం-పోషణ్‌ కింద దాదాపు 17.51 ఎల్‌.ఎం.టి. బలవర్ధక బియ్యం రాష్ట్రాలు/యూటీలకు అందించడం జరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న దశ IIలో ఫిబ్రవరి 2023 వరకు, 92.77 ఎల్‌.ఎం.టి. బలవర్ధక బియ్యం టీపీడీఎస్‌ కింద ఆశావహ, అధిక భారం ఉన్న జిల్లాల కోసం పంపిణీ చేయడం జరిగింది. దీంతోపాటు,ఐసీడీఎస్‌, పీఎం-పోషణ్‌ కింద దాదాపు 27.46 ఎల్‌.ఎం.టి. బలవర్ధక బియ్యాన్ని రాష్ట్రాలు/యూటీలు తీసుకున్నాయి.

 

*****


(రిలీజ్ ఐడి: 1907381) సందర్శకుల సూచీ సంఖ్య : : 148
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English