రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కొచి పర్యటనలో ఫ్రెంచ్ నౌకాదళం

Posted On: 08 MAR 2023 9:24AM by PIB Hyderabad

నౌకాదళాల పరస్పర సహకారంలో భాగంగా, ఫ్రెంచ్  నౌకదళ నౌకలు FS డిక్స్‌మ్యూడ్, లా ఫాయెట్ 2023 మార్చి 06 నుంచి 10 వరకు కొచి సందర్శనకు వచ్చాయి. రియర్ అడ్మిరల్‌ జీన్ డి ఆర్క్, కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మోకార్డ్, లెఫ్టినెంట్ కమాండర్‌ ఘిస్లైన్ డెలెప్లాంక్ 2023 మార్చి 06న సదరన్ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, రియర్ అడ్మిరల్ జె.సింగ్‌తో సమావేశం అయ్యారు. రెండు నౌకాదళాల సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు.

పర్యటనలో భాగంగా, ఫ్రెంచ్ బృందం సదరన్ నేవల్ కమాండ్ శిక్షణ పాఠశాలలు, నౌకలను సందర్శించింది. శిక్షణ కార్యక్రమాల పరస్పర సందర్శనలు, క్రీడలు సహా వృత్తిపరమైన & సామాజిక ఉమ్మడి కార్యక్రమాలు ఈ పర్యటనలోని కొన్ని ముఖ్యాంశాలు. భారత సైన్యంతో కలిసి ఫ్రెంచ్ సైన్యం సంయుక్త సైనిక విన్యాసాలను కూడా నిర్వహిస్తుంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ సముద్ర భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలో ఇండో-ఫ్రెంచ్ నౌకాదళాల మధ్య సహకారం ఒక కీలకాంశం. రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఫ్రెంచ్ నౌకల పర్యటన దోహదం చేస్తుంది.

______



(Release ID: 1905127) Visitor Counter : 128