పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

'నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ' సహకారంతో "ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం" జరుపుకున్న జాతీయ జంతు ప్రదర్శనశాల

Posted On: 04 MAR 2023 7:34PM by PIB Hyderabad

'నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ' సహకారంతో న్యూదిల్లీలోని జాతీయ జంతు ప్రదర్శనశాల (దిల్లీ జూ) 3 మార్చి 2023న "ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని" జరుపుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన అదనపు డైరెక్టర్ జనరల్ (వన్యప్రాణి) శ్రీ బివాన్ష్ రంజన్, వృక్షజాలం & జంతుజాలం వాటి రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ముప్పు గురించి "ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం" అవగాహన కల్పిస్తుందని అన్నారు. "వన్యప్రాణుల సంరక్షణ కోసం భాగస్వామ్యాలు" అన్నది ఈ సంవత్సరం అంశంగా చెప్పారు. ఇది, ప్రభుత్వాల నుంచి క్షేత్ర స్థాయి వరకు అన్ని రకాల పరిరక్షణ ప్రయత్నాలు చేయడానికి అనుమతిస్తుందని వివరించారు. స్థిరత్వం, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణకు గణనీయమైన సహకారం అందించడం ద్వారా భాగస్వామ్యాలు ఏర్పడటానికి కృషి చేస్తున్న, మార్పు చూపుతున్న వ్యక్తుల గురించి వివరించడానికి ఈ అంశం ఒక అవకాశాన్ని అందిస్తుందని బివాన్ష్ రంజన్ వెల్లడించారు.

ఈ సంవత్సరం సైట్స్‌ (అంతరించిపోతున్న జంతుజాలం & వృక్షజాలం విషయంలో అంతర్జాతీయ చొరవపై చర్చలు) 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం జరుపుకున్నాం.

వన్యప్రాణులపై ఘోరాలు, ప్రజల భాగస్వామ్యం, జంతుజాల పరిరక్షణలో జూ పాత్ర, మిషన్‌ లైఫ్‌పై జాతీయ జంతు ప్రదర్శనశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అవగాహన సదస్సు అనంతరం జూలో నడక, లోగో తయారీ  పోటీలు నిర్వహించారు.

****



(Release ID: 1904341) Visitor Counter : 182


Read this release in: English , Urdu , Hindi