వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మెగా పూసా కృషి విజ్ఞాన మేళాను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తోమర్


"శ్రీ అన్న" కు గౌరవ స్థానం ఇవ్వడం ద్వారా చిన్న రైతులను బలోపేతం చేయడమే ప్రధాన మంత్రి శ్రీ మోదీ లక్ష్యం-శ్రీ తోమర్‌

స్టార్టప్ స్టాల్స్ మరియు టెక్నికల్ ఎగ్జిబిషన్‌ 3 రోజుల అగ్రి ఫెయిర్‌కు వేలాది మంది రైతులు తరలివస్తారు.

Posted On: 02 MAR 2023 5:54PM by PIB Hyderabad

భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI) నిర్వహించిన మూడు రోజుల పూసా కృషి విజ్ఞాన మేళాను కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. వేలాది మంది రైతులతో పాటు శాస్త్రవేత్తలు, స్టార్టప్ పారిశ్రామికవేత్తలు మేళాలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ తోమర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం సంధర్భంగా శ్రీ అన్నను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, దీనితో దేశంలో 86 శాతం మంది రైతులు చిన్న రైతులకు సాధికారత సాధించడమే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యమన్నారు. తాను ప్రధానమంత్రిగా అనునిత్యం బిజీ గా ఉన్నా , గ్రామాల్లో నివసిస్తున్న  చిన్న రైతుల సంక్షేమం గురించి శ్రీ మోదీ శ్రద్ధ వహిస్తున్నారు. ఈ  చిన్న సన్నకారు రైతులు తృణధాన్యాలను పండిస్తారు. వారు అభివృద్ధి చెందడానికి, ప్రధాన మంత్రి తృణధాన్యాలకు “శ్రీ అన్న” అని పేరు పెట్టడం ద్వారా వారికి  ఉన్నత గౌరవ స్థాయి ని కల్పించి అనేక కార్యక్రమాలకు కూడా ప్రణాళిక రూపకల్పన చేశారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీ తోమర్ మాట్లాడుతూ చిన్న రైతుల సర్వతోముఖ ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రి శ్రీ మోదీ చేస్తున్న కృషి ఫలితమే అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరమని, ఆయన స్వయంగా భారత ప్రభుత్వం తరపున ఐక్యరాజ్యసమితికి 2023ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించండి అనే ప్రతిపాదన పంపారని గుర్తు చేశారు. మార్చి 18, 2023న ఢిల్లీలో జరిగే ఒక గొప్ప కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ మోదీ అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు, ఇందులో అనేక దేశాల శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధులు మరియు మంత్రులు పాల్గొంటారు. పూసా కృషి విజ్ఞాన మేళా - ‘శ్రీ అన్న’ ఇతివృత్తాన్ని కొనియాడుతూ, ఈ మేళా ద్వారా కూడా రైతులకు చాలా ప్రయోజనాలు లభిస్తాయని శ్రీ తోమర్ అన్నారు. ఈసారి జి-20కి ప్రధాన మంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో భారతదేశం అధ్యక్షత వహిస్తుందని,  “ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు” అని దాని థీమ్ గా ఆయన ఉంచారని శ్రీ తోమర్ చెప్పారు. ప్ర‌ధాన మంత్రి దూరదృష్టి వల్ల భార‌త‌దేశం ప్ర‌పంచానికి నాయ‌క‌త్వం అందించే దిశ‌గా పయనిస్తోంది. భారతదేశం వ్యవసాయాధారితమని, రైతు ఎంత అభివృద్ధి చెందుతాడో, దేశం అంత సుభిక్షంగా ఉంటుందన్నారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే రైతులకు సాధికారత కల్పించాలి.

 

రైతుల కృషి, శాస్త్రవేత్తల సమర్థత, ప్రభుత్వ రైతు అనుకూల విధానాల వల్ల మన వ్యవసాయం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని శ్రీ తోమర్ అన్నారు. దేశంలో ఆహార ధాన్యాలు మరియు తోటల పెంపకం మరియు అనుబంధ రంగాలలో సమృద్ధిగా ఉత్పత్తి ఉంది మరియు భారతదేశం ప్రతి రంగంలో అగ్రస్థానంలో ఎదుగుతోంది. మన దేశ వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భవిష్యత్తులో అందరూ కలిసికట్టుగా కృషి చేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొని పరిష్కరించడం ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత. వ్యవసాయ రంగం పురోగతికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR), దాని సంస్థలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల (KVK) శాస్త్రవేత్తల సహకారాన్ని అభినందిస్తూ, రైతులు తమ పరిశోధనలను వ్యవసాయంలో స్వీకరించారని, దాని వల్ల వ్యవసాయంలో నాణ్యత పెరిగిందని అన్నారు. ఉత్పత్తులు మెరుగుపడతాయి మరియు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దాని ప్రయోజనాన్ని పొందుతోంది. ప్రపంచ రాజకీయ వేదికపై భారతదేశం యొక్క విశ్వసనీయత పెరుగుతోంది, మన పై అంచనాలను పెంచుతుంది, అటువంటి పరిస్థితిలో మనందరి బాధ్యత మరింత పెరుగుతుంది. నేడు భారతదేశ దృశ్యం మారిపోయింది, ఇప్పుడు భారతదేశం దిగుమతి చేసుకునే దేశం కాదు, ప్రపంచం మన నుండి సహకారాన్ని ఆశిస్తోంది.

 

వ్యవసాయాన్ని ఉన్నతీకరించడం మరియు రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, 10,000 కొత్త రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), లక్ష కోట్ల విలువైన వ్యవసాయ మౌలిక సదుపాయాలు కల్పన వంటి అనేక ముఖ్యమైన పథకాలను ప్రారంభించిందని కేంద్ర మంత్రి శ్రీ తోమర్ అన్నారు.  వాతావరణ మార్పుల సవాళ్లను కలిసి ఎదుర్కోవాలని మరియు పరిష్కరించుకోవాలని కూడా ఆయన నొక్కి చెప్పారు.

 

శ్రీ తోమర్ ప్రగతిశీల రైతులకు అవార్డులు అందజేసి ప్రచురణలను విడుదల చేశారు. ఈ ఫెయిర్‌లో ప్రధాన సాంకేతికతలకు సంబంధించిన థీమాటిక్ ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయగా,  స్టార్టప్‌లు మరియు వ్యవస్థాపకుల స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. పూసా ఇన్‌స్టిట్యూట్‌లోని క్షేత్రాలతో పాటు పరిశోధనా సంస్థలను  శ్రీ తోమర్ సందర్శించారు. ప్రదర్శన లో  గోధుమలు, ఆవాలు, శనగలు, కూరగాయలు, పూలు, పండ్లు వంటి ముఖ్యమైన ఆహార ఉత్పత్తుల ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రైతులు, పారిశ్రామికవేత్తలు, ఇన్‌పుట్ ఏజెన్సీల స్టాల్స్ కూడా ఉన్నాయి, రైతు కౌన్సెలింగ్ స్టాల్స్ రైతుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. ఐ సీ ఏ ఆర్ డైరెక్టర్ జనరల్ మరియు డీ ఏ ఆర్ ఈ సెక్రటరీ, డాక్టర్ హిమాన్షు పాఠక్, ఐ ఏ ఏ ఐ  డైరెక్టర్, డాక్టర్ ఏ. కే . సింగ్, డాక్టర్ రవీంద్ర పడారియాతో పాటు ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

 

***



(Release ID: 1903796) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Tamil