వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జన్యుపరంగా మార్పు చెందిన ఆవాల విడుదలకు ఆమోదం

Posted On: 07 FEB 2023 5:11PM by PIB Hyderabad

జన్యుపరంగా మార్పు చేసిన (జీఎం) ఆవాల హైబ్రిడ్ రకం డీఎంహెచ్-11 మరియు దాని పేరెంటల్ లైన్‌ల పర్యావరణ విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) 147వ సమావేశంలో 18 అక్టోబర్ 2022న, ఇప్పటికే ఉన్న ఐసీఏఆర్ మార్గదర్శకాల ప్రకారం దాని విత్తనోత్పత్తి మరియు పరీక్షల కోసం జన్యుపరంగా మార్పు చేసిన (జీఎం) మస్టర్డ్ హైబ్రిడ్ డీఎంహెచ్-11 మరియు దాని పేరెంటల్ లైన్‌లు మరియు వాణిజ్య విడుదలకు ముందు ఉన్న ఇతర నియమ/నిబంధనల మేరకు పర్యావరణ విడుదలకు ఆమోదం తెలిపింది. బయోసేఫ్టీ రీసెర్చ్ లెవల్ ట్రయల్స్ (బీఆర్ఎల్) I మరియు II సమయంలో చెక్ రకాలైన వరుణ మరియు ఆర్ఎల్-1359లతో హైబ్రిడ్ డీఎంహెచ్-11 పరీక్షించబడింది. ఇక్కడ ఇది 2010-11 నుండి 2014-15 వరకు వరుణ అందించిన విలువల కంటే 28.15% మేటిగా ఉందని తేలింది. నిర్దేశించిన మార్గదర్శకాలు మరియు వర్తించే నియమాల ప్రకారం మానవ ఆరోగ్యం మరియు పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయడానికి మూడు సంవత్సరాల పాటు ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించబడ్డాయి. విష పూరితం, అలెర్జీ, కూర్పు విశ్లేషణ, ఫీల్డ్ ట్రయల్స్ మరియు జీఎం మస్టర్డ్ లైన్స్ వర్సెస్ వారి నాన్-ట్రాన్స్జెనిక్ కంపారేటర్స్ యొక్క పర్యావరణ భద్రత అధ్యయనాలపై నిర్వహించిన విస్తృతమైన అధ్యయనాలు జీఈ ఆవాలైన హైబ్రిడ్ డీఎంహెచ్-11 మరియు దాని పేరెంటల్ లైన్లు సాగుకు, ఆహార వినియోగానికి, సేవించేందుకు సురక్షితమైనవని రుజువు చేశాయి. జన్యు మార్పిడిపై సమీక్ష కమిటీ (ఆర్.సి.జి.ఎం) మరియు జీఈఏసీ ఆమోదించిన ప్రోటోకాల్స్ ప్రకారం నిర్వహించబడిన బీఆర్ఎల్-I మరియు బీఆర్ఎల్-II ట్రయల్స్ సమయంలో ట్రాన్స్‌జెనిక్ లైన్‌లకు బీస్ విజిటైజేషన్ నాన్-ట్రాన్స్‌జెనిక్ పోటీ ఉత్పత్తుల  మాదిరిగానే ఉంది. జీఈ మస్టర్డ్ హైబ్రిడ్ డీఎంహెచ్-11 యొక్క పర్యావరణ విడుదలపై కొన్ని రిప్రజెంటేషన్లు

స్వీకరించబడ్డాయి, అయినప్పటికీ, జీఎం ఆవాలు యొక్క పర్యావరణ విడుదల సమస్య గౌరవనీయమైన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ముందు తీర్పుకు వేచి ఉంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందిజేశారు.

*****


(Release ID: 1897227) Visitor Counter : 339


Read this release in: English