హోం మంత్రిత్వ శాఖ
జమ్ము&కాశ్మీర్‌లో ఖాళీ పోస్టులు
Posted On:
07 FEB 2023 4:37PM by PIB Hyderabad
జమ్ము & కాశ్మీర్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి మంగళవారం లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు శ్రీ నిత్యానంద రాయ్ దిగువ వివరాలను లిఖితపూర్వకంగా ఇచ్చారు.
ప్రభుత్వంలో నియామకాలు సహా, జమ్ము & కాశ్మీర్ ప్రభుత్వం పలు పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చింది. కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడిన తర్వాత పారదర్శక ప్రక్రియలో భారీ ఎత్తున రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను చేపట్టడం జరిగింది.
జమ్మ&కాశ్మీర్ ప్రభుత్వంలో మొత్తం 33,426 గెజిటెడ్/ నాన్ గెజిటెడ్ కేటగిరీలను గుర్తించగా, డిసెంబర్ 2022 నాటికి 25,450 ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. నియామకాల కోసం నియామక ఏజెన్సీలు 7,976 పోస్టులకు ప్రకటనలను ఇచ్చాయి.
ప్రభుత్వంలో ఖాళీలను గుర్తించడం, నియామకం అనేది నినరంతరంగా సాగే ప్రక్రియ. దీనినే వేగవంతమైన నియామక డ్రైవ్ కింద చేపట్టడం జరుగుతోంది.
స్థిరమైన ఆదాయ సృష్టి కోసం యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సబ్సిడీతో కూడిన రుణాలతో వివిధ విభాగాల ద్వారా పలు స్వయం ఉపాధి పధకాలను అమలు చేసేందుకు నిరుద్యోగతను తగ్గించేందుకు జమ్ము& కాశ్మీర్ ప్రభుత్వం వివిధ చొరవలను తీసుకుంది.
ఉపాధి అవకాశాల కోసం మిషన్ యూత్, గ్రామీణ ఉపాధి మిషన్, హిమాయత్, పిఎంఇజిపి, అవసర్, తేజస్విని వంటి అనేక స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21-03-2023 వరకు ఈ పథకాల ద్వారా 2,01,299 ఉపాధులను సృష్టించడం జరిగింది.
నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఒ) నిర్వహించిన నియమితకాల శ్రామిక శక్తి సర్వే (పిఎల్ఎఫ్ఎస్) ఫలితాల ప్రకారం, ఏప్రిల్ - జూన్ 2021 కాలానికి జమ్ము&కాశ్మీర్‌లో నిర్ధిష్టంగా విద్యావంతులైన యువతకు సంబంధించిన నిరుద్యోగత రేటు అంచనాలు అందుబాటులో లేవు.
అయితే, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఒ) నిర్వహించిన పిఎల్ఎఫ్ఎస్ ఆధారంగా, 15-29 ఏళ్ళ వయసున్న యువతలో అంచనా వేసిన నిరుద్యోగత రేటు జమ్ము & కాశ్మీర్‌లో 18,3 శాతంగా ఉంది.
***
(Release ID: 1897141)