రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

టీసీఎల్‌ ద్వారా ఆయుధ కర్మాగారానికి మద్దతు

प्रविष्टि तिथि: 06 FEB 2023 3:11PM by PIB Hyderabad

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్‌బీ) కార్పొరేటీకరణ తర్వాత, 2021-22 ఆర్థిక సంవత్సరం, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్‌కు (టీసీఎల్‌) కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం రూ.550.64 కోట్లు. కొత్తగా రూపొందించిన డిజిటల్ యుద్ధ యూనిఫారాల తయారీ ప్రక్రియలో శుద్ధి (వస్త్రానికి రసాయన శుద్ధి), అద్దకం (రంగులు అద్దకం), ప్రింటింగ్ (ఆకృతి) ఉంటాయి. కుట్టిన దుస్తులను ఉత్పత్తి చేసే చివరి దశ గార్మెంటింగ్‌.

శుద్ధి ప్రక్రియ నుంచి మొదలుకుని ఈ మొత్తం ఈ వస్త్ర నమూనా కోసం మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్‌) పొందడం జరిగింది. అందువల్ల, తయారీదార్ల జవాబుదారీతనాన్ని పెంచడానికి, దుర్వినియోగాన్ని తగ్గించడానికి ఈ ప్రత్యేక అర్హత ప్రక్రియను 'రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌'లో (ఆర్‌ఎఫ్‌పీ)లో చేర్చడం జరిగింది. 'ఓపెన్ టెండర్ ఎంక్వైరీ' (ఓటీఈ) ద్వారా వస్త్ర సేకరణ జరుగుతుంది. షరతులకు అనుగుణంగా టెండర్ దాఖలు చేసేందుకు టీసీఎల్‌ సహా అన్ని బిడ్డర్లకు తగిన సమయం ఇవ్వడం జరిగింది.

రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

****


(रिलीज़ आईडी: 1896812) आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu