ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నియంత్రణపై జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళిక
ఏఎంఆర్‌పై కచ్చితమైన సమాచారం రూపొందించడానికి 'ఏఎంఆర్ సర్వైలన్స్ నెట్‌వర్క్ ఆఫ్ స్టేట్ మెడికల్ కాలేజీ ల్యాబ్స్' (నార్స్-నెట్) ఏర్పాటు
Posted On:
03 FEB 2023 4:58PM by PIB Hyderabad
యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నియంత్రణ కోసం జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళికను (నార్స్-నెట్) 2017 ఏప్రిల్ 19న ప్రారంభించారు. ప్రజారోగ్య ప్రాముఖ్యత దృష్ట్యా, ప్రధాన బ్యాక్టీరియా వ్యాప్తి కారకాలకు సంబంధించిన ఏఎంఆర్‌పై కచ్చితమైన సమాచారం రూపొందించడానికి జాతీయ 'ఏఎంఆర్ సర్వైలన్స్ నెట్‌వర్క్ ఆఫ్ స్టేట్ మెడికల్ కాలేజీ ల్యాబ్స్' (నార్స్-నెట్) ఏర్పాటైంది.
ఔషధాలు & సౌందర్య సాధనాల నిబంధనల షెడ్యూల్ హెచ్1లో యాంటీబయాటిక్స్‌ను చేర్చారు. నమోదిత వైద్యుల ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే వాటిని విడిగా విక్రయించాలి.
ఔషధాలు & సౌందర్య సాధనాల నిబంధనలను ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సవరించింది. ఆహారానికి ఉపయోగించే జంతువుల చికిత్సలకు ఉపయోగించే ఔషధ కంటైనర్ మీద కచ్చితంగా సంబంధింత వివరాలను ముదించాలన్న నిబంధన చేర్చింది. ఏయే జంతువుల కోసం ఆ ఔషధాన్ని ఉపయోగించాలి, ఔషధం కాల పరిమితి సహా అన్ని వివరాలు ముద్రించాలంటూ నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పశు సంవర్థక శాఖ డైరెక్టర్లు/కమిషనకర్లకు కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య విభాగం ఒక ఆదేశం జారీ చేసింది. ఆహారం కోసం ఉపయోగించే జంతువులు అనారోగ్యంతో ఉన్నప్పుడు చికిత్స కోసం యాంటీబయాటిక్స్, హార్మోన్లను న్యాయబద్ధంగా ఉపయోగించాలని నిర్దేశించింది. పశుగ్రాసంలో కలిపి ఇచ్చే యాంటీబయాటిక్స్, హార్మోన్ల వినియోగాన్ని నిలిపివేయాలని కూడా డీసీజీ (ఐ) రాష్ట్రాలు/యూటీలకు సలహా జారీ చేసింది.
నమోదిత వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విడిగా మందుల విక్రయాలకు సంబంధించిన ఆందోళనలను కూడా రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు/సంబంధిత వర్గాల దృష్టికి తీసుకువెళ్లింది.
ఔషధాలు & సౌందర్య సాధనాల చట్టం 1940 & నిబంధనల ప్రకారం ఔషధాల విక్రయాలు, పంపిణీని రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన రాష్ట్ర లైసెన్సింగ్ అధికారులు (ఎస్‌ఎల్‌ఏలు) నియంత్రిస్తారు. ఏ నిబంధన పాటించకపోయినా చర్య తీసుకునేందుకు ఎస్‌ఎల్‌ఏలకు అధికారం ఉంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఇవాళ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు.
****
(Release ID: 1896500)
Visitor Counter : 129