ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జాతీయ అవసర ఔషధాల జాబితా
(నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్) కింద యాంటీబయాటిక్స్ గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు
ఎన్ ఎల్ ఈ ఎం 2022లో, 34 మందులు జోడించబడ్డాయి మరియు ఎన్ ఎల్ ఈ ఎం, 2015 నుండి 26 మందులు తొలగించబడ్డాయి
प्रविष्टि तिथि:
03 FEB 2023 5:04PM by PIB Hyderabad
సాధారణ ప్రజల ఆరోగ్యం పరిశుభ్రతలో ఔషధ ఉత్పత్తుల వినియోగం గురించి సమకాలీన పరిజ్ఞానం నేపథ్యంలో ప్రస్తుత ఎన్ ఎల్ ఈ ఎంలో చేర్పులు మరియు తొలగింపుల ద్వారా జాతీయ అవసర ఔషధాల జాబితాను సమీక్షించడానికి మరియు సవరించడానికి ఔషధాలపై జాతీయ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఎస్ ఎన్ సీ ఎం తన తుది నివేదికను 10.09.2022న సమర్పించింది. భారత ప్రభుత్వం కమిటీ సిఫార్సులను ఆమోదించింది. జాతీయ అవసర ఔషధాల జాబితా (ఎన్ ఎల్ ఈ ఎం), 2022 13.09.2022 నాటి నోటిఫికేషన్ అమలులోకి వచ్చింది. ప్రస్తుతం జాతీయ అవసర ఔషధాల జాబితా (ఎన్ ఎల్ ఈ ఎం, 2022) 384 ఔషధాలను కలిగి ఉంది. ఎన్ ఎల్ ఈ ఎం 2022లో, 34 మందులు జోడించబడ్డాయి మరియు ఎన్ ఎల్ ఈ ఎం, 2015 నుండి 26 మందులు తొలగించబడ్డాయి.
వివరాలు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి. https://main.mohfw.gov.in/newshighlights-104
యాంటీబయాటిక్స్ గురించి అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వం ఈ క్రింది కార్యక్రమాలను చేపట్టింది:
హాస్పిటల్ వార్డులు మరియు ఐ సీ యూలలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగం మరియు మితిమీరిన వినియోగాన్ని నియంత్రించడానికి ఐ సీ ఎం ఆర్ భారతదేశంలోని 20 తృతీయ సంరక్షణ ఆసుపత్రులలో పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన యాంటీబయాటిక్ స్టీవార్డ్‌షిప్ ప్రోగ్రామ్ (AMSP)ని ప్రారంభించింది.
డీ సీ జీ ఐ తగనిదిగా గుర్తించిన 40 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌లను నిషేధించింది.
పౌల్ట్రీలో పశుగ్రాసంలో కోలిస్టిన్‌ను వృద్ధి ప్రమోటర్‌గా ఉపయోగించడాన్ని నిషేధించడానికి ఐ సీ ఎం ఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, పశుసంవర్ధక శాఖ, డెయిరీ మరియు ఫిషరీస్ మరియు డీ సీ జీ ఐ సహకారంతో పనిచేసింది.
ఏ ఎం ఆర్, దాని నియంత్రణ నివారణ మరియు యాంటీబయాటిక్స్ యొక్క జాగ్రత్త తో కూడిన వినియోగం గురించి సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించడానికి పాఠశాలలు, కళాశాలలు మరియు ఆరోగ్య మేళాలలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీ డీ సీ) సదస్సులు, పోస్టర్ మరియు క్విజ్ పోటీలు వంటి వివిధ ప్రచార ప్రసార కార్యకలాపాలు ద్వారా నిర్వహించబడ్డాయి.
వైరల్ అనారోగ్య సమయంలో యాంటీబయాటిక్స్ యొక్క అహేతుక వినియోగాన్ని నివారించడం మరియు అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి చేతి పరిశుభ్రత ద్వారా సంక్రమణ నివారణపై
కమ్యూనిటీ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రదాతలలో అవగాహన పెంచడానికి, వివిధ ప్రచార పోస్టర్లు, వీడియోలు మరియు రేడియో జింగిల్స్ ప్రసార మాధ్యమాలు రూపొందించారు.
యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ నియంత్రణ కోసం నేషనల్ ప్రోగ్రామ్ కింద, ఎన్ సీ డీ సీ సంస్థలు తమ సంబంధిత ఆసుపత్రులలో వినియోగించే యాంటీబయాటిక్స్‌పై నిఘాను నిర్వహించడానికి మద్దతు ఇస్తుంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.
(रिलीज़ आईडी: 1896205)
आगंतुक पटल : 250
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English