ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సికిల్ సెల్ వ్యాధి కోసం 9,93,114 మందికి ప‌రీక్ష‌లు


మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని 22 గిరిజ‌న జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ సెంట‌ర్ ఫ‌ర్ హిమోఫీలియా, హిమోగ్లోబినోప‌తీస్ ఏర్పాటు

Posted On: 03 FEB 2023 5:09PM by PIB Hyderabad

సిక్క‌ల్ సెల్ డిసీజ్ (ఎస్‌సిడి) వ్యాధి అనేది దీర్ఘ‌కాలిక ర‌క్త‌హీన‌త‌, తీవ్ర‌మైన బాధాక‌ర ఘ‌ట‌న‌లు, అవ‌య‌వ అవ‌స్థాప‌న (ఇన్ఫ్రాక్ష‌న్‌), దీర్ఘ‌కాలిక అవ‌య‌వ న‌ష్టం, ఆయుర్దాయం గ‌ణనీయంగా త‌గ్గ‌డం వంటి ల‌క్ష‌ణాల ద్వారా శ‌రీరాన్ని బ‌ల‌హీన‌ప‌రిచే ఇది ఒక జ‌న్యు రుగ్మ‌త‌.


జాతీయ ఆరోగ్య మిష‌న్ కింద భార‌త ప్ర‌భుత్వం వార్షిక పిఐపి ప్ర‌తిపాద‌న‌ల‌కు అనుగుణంగా ఈ సికిల్ సెల్ వ్యాధిని నివారించి, నిర్వ‌హించేందుకు రాష్ట్రాల‌కు తోడ్పాటునందిస్తుంది. సికిల్ సెల్ ర‌క్త అనీమియా స‌హా హెమోగ్లోబినోపాథీస్ నివార‌ణ, నియంత్ర‌ణ‌కు 2016లో మంత్రిత్వ శాఖ సాంకేతిక కార్యాచ‌ర‌ణ మార్గ‌ద‌ర్శ‌నాల‌ను విడుద‌ల చేసింది. ఇక చికిత్స విష‌యంలో, ఎన్‌హెచ్ఎం కింద హైడ్రోక్సూరియా కాప్సూల్స్‌ను ఇవ్వ‌డ‌మే కాక , రాష్ట్రాల ప్ర‌తిపాద‌న‌ల‌కు అనుగుణంగా అంద‌రు సికిల్ సెల్ రోగులు (పురుషులు & మ‌హిళ‌లు) కు ఉచిత ర‌క్త మార్పిడిని చేసేందుకు తోడ్పాటు ఇస్తోంది.


కేంద్ర బ‌డ్జెట్ 2023-24లో, సికిల్ సెల్ అనీమియాను 2047 నాటికి పూర్తిగా నిర్మూలించేందుకు ఒక మిష‌న్‌ను ప్రారంభించ‌నున్నట్టు ప్ర‌క‌టించారు. ఈ మిష‌న్ వ్యాధిప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, ప్ర‌భావిత గిరిజ‌న ప్రాంతాల్లో 0-40 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌స్సున్న సుమారు ఏడు కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను ప‌రీక్షించ‌డం, కేంద్ర మంత్రిత్వ శాఖ‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌మ‌న్వ‌య ప్ర‌య‌త్నాల ద్వారా  కౌన్సిలింగ్ ఇవ్వ‌డంపై దృష్టి సారించింది.


సికిల్ సెల్ డిసీజ్‌ను గుర్తించి, ప‌రీక్షించి, నిర్వ‌హించ‌డంలోని స‌వాళ్ళ‌ను నిర్వ‌హించేందుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర హిమోగ్లోబినోప‌తీ మిష‌న్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. గౌర‌వ‌నీయ ప్ర‌ధాన‌మంత్రి 15 న‌వంబ‌ర్ 2021న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అలిరాజ్‌పూర్ జిల్లాలోని ఝ‌బువాలో వ్యాధిని గుర్తించేందు ఒక పైల‌ట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు రెండ‌వ ద‌శ‌లో 89 గిరిజ‌న బ్లాకుల‌ను జోడించారు. రాష్ట్ర నివేదిక‌ల ప్ర‌కారం మొత్తం 993114 వ్య‌క్తుల‌ను గుర్తించి ప‌రీక్షించారు. వారిలో 18866కు హెచ్‌బిఎఎస్ (సికిల్ ల‌క్ష‌ణం), 1506 (హెచ్‌బిఎస్ఎస్ సికిల్ వ్యాధి సోకినట్టు) గుర్తించారు. రోగుల వ్యాధిని నిర్ధారించి, చికిత్స చేసేందుకు 22 గిరిజన జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ సెంట‌ర్ ఫ‌ర్ హీమోఫీలియా, హిమోగ్లోబినోప‌తీస్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.


ఈ స‌మాచారాన్ని శుక్ర‌వారం లోక్‌స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌కు లిఖితపూర్వ‌క స‌మాధానంలో కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ భార‌తీ ప్ర‌వీణ్ ప‌వార్ వెల్ల‌డించారు. 

 

****
 


(Release ID: 1896202) Visitor Counter : 319


Read this release in: English