నీతి ఆయోగ్
హైదరాబాద్‌లో ఏ సీ ఐ సీ - సీ బీ ఐ టీ రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫౌండేషన్ ను అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభించింది
Posted On:
31 JAN 2023 7:03PM by PIB Hyderabad
అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైషన్వ్, మంగళవారం, జనవరి 31, 2023న హైదరాబాద్‌లో ఏ సీ ఐ సీ - సీ బీ ఐ టీ కేంద్రాన్ని ప్రారంభించారు. వర్ధమాన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం నెలకొల్పిన వివిధ ల్యాబ్ సెటప్‌లు, సాంకేతికత మరియు మౌలిక సదుపాయాలను అర్థం చేసుకోవడానికి ఏ ఐ ఎం బృందం కేంద్రాన్ని సందర్శించింది. కేంద్రం ప్రారంభోత్సవంతో పాటు, ఏ సీ ఐ సీ - సీ బీ ఐ టీ మొదటి స్టార్టప్ 20 ఎక్స్ ఈవెంట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, చిరు ధాన్యాల తయారీ, మానసిక ఆరోగ్యం మరియు వివిధ రంగాలలో పనిచేస్తున్న నలుగురు గ్రామీణ ఆవిష్కర్తల స్టార్టప్ వ్యవస్థాపకులతో చర్చల రూపంలో ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ స్టార్టప్‌లు సమాజ దేశ అభివృద్ధి కోసం మార్పును తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి.
కార్యక్రమంలో డాక్టర్ చింతన్ మాట్లాడుతూ "కమ్యూనిటీలు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మరియు అట్టడుగు స్థాయి నుండి ఆవిష్కర్తలను ప్రేరేపించడం అనేది దేశవ్యాప్తంగా సమ్మిళిత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ముఖ్యమైన భాగం, ఇది ఒక ఆలోచనను కార్య రూపం దాల్చడానికి పనిచేస్తున్న ఏ సీ ఐ సీల వంటి సంస్థల మద్దతు ద్వారా సాధ్యమవుతుంది" .
మొట్టమొదటి స్టార్టప్ 20 ఎక్స్ ఈవెంట్‌లో మాట్లాడుతూ “గ్లోబల్ స్టార్టప్ విధాన నిర్ణయాలపరంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లు మరియు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థల ప్రాతిపదికను ప్రజాస్వామ్యీకరించడానికి స్టార్టప్ 20 ఎక్స్ అనే స్టార్టప్ పాలసీ ఫోరమ్ ఆవిర్భవించింది. ఈ ఫోరమ్ స్టార్టప్‌లకు తమ ఆవిష్కరణ ను వినిపించడానికి మరియు వారు క్షేత్ర స్థాయిలో చేసే పని గురించి మాట్లాడటానికి ఒక వేదికను అందిస్తుంది" అని ఆయన అన్నారు.
ప్రిన్సిపల్ సీ బీ ఐ టీ మరియు ఏ సీ ఐ సీ - సీ బీ ఐ టీ డైరెక్టర్, ప్రొ. పీ. రవీందర్ రెడ్డి కూడా మాట్లాడుతూ సీ బీ ఐ టీ చుట్టూ ఉన్న స్టార్టప్ ఎకోసిస్టమ్ గురించి మరియు వారి మద్దతు ద్వారా స్టార్టప్ ఎలా పెంపొందించుకోవచ్చు అనే దాని గురించి తన దృష్టికోణాన్ని పంచుకున్నారు. ఈవెంట్ సందర్భంగా ఈ ప్రాంతంలో సహకార స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి భాగస్వాములతో అవగాహన ఒప్పందాలు కూడా మార్పిడి చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఉత్సాహభరితమైన పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడం మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని పని చేయడం జరిగింది. యువ వర్ధమాన వ్యాపారవేత్తలు తమ సమాజం కోసం మంచి చేయడానికి శక్తిని మరియు ప్రేరణను ప్రదర్శించడం ప్రోత్సాహకరంగా ఉంది.
ఏ సీ ఐ సీ - సీ బీ ఐ టీ గురించి
లక్ష్యాలు:
ఏ సీ ఐ సీ - సీ బీ ఐ టీ ఒక సామాజిక ఆవిష్కరణల మరియు యువ వర్ధమాన వ్యాపారవేత్తల ఆవరణం ను నిర్మించే లక్ష్యంతో స్థాపించబడింది, ఇది ఆవిష్కర్తలను మరియు నిర్లక్ష్యం చేయబడిన మరియు సేవలందని ప్రాంతాల స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి. నిపుణులైన సలహాదారులను చేర్చడానికి బలమైన సామాజిక ఆవిష్కరణల వర్ధమాన వ్యాపారవేత్తల ఆవరణంను రూపొందించాలని ఏ సీ ఐ సీ విశ్వసిస్తుంది మరియు తప్పనిసరి చేస్తుంది; మేకర్ స్పేస్ వంటి మౌలిక సదుపాయాలకు ప్రాప్యత; నిధుల సౌలభ్యం; శిక్షణ మరియు మార్గదర్శకత్వం ద్వారా సామర్థ్యాలను నిర్మించడం ద్వారా సేవలందిస్తోంది.
ఏ సీ ఐ సీ - సీ బీ ఐ టీ ఫౌండేషన్ సెక్టోరల్ ప్రాంతాలు మరియు లక్షిత ఎస్ డీ జీ లు:
ప్రత్యేక దృష్టి రంగాలు:
- ఆరోగ్య సాంకేతికత
- ఏ ఐ/ఎం ఎల్ /ఐ ఓ టీ ఆధారిత స్మార్ట్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు
- పునరుత్పాదక శక్తి & పర్యావరణ సుస్థిరత
లక్షిత ఎస్ డీ జీ లు:
మంచి ఆరోగ్యం & శ్రేయస్సు (యూ ఎన్ ఎస్ డీ జీ లలో లక్ష్యం 03)
ఇండస్ట్రీ ఇన్నోవేషన్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (యూ ఎన్ ఎస్ డీ జీ లలో లక్ష్యం 09)
స్థిరమైన నగరాలు మరియు సంఘాలు (యూ ఎన్ ఎస్ డీ జీ లలో లక్ష్యం 11)
స్టార్టప్‌లు మరియు ఇన్నోవేటర్‌లకు ఇప్పటి వరకు 37 మంది ఆవిష్కర్తలకు మద్దతు ఇచ్చారు, ఏ సీ ఐ సీ - సీ బీ ఐ టీ మద్దతు ఉన్న 37 స్టార్టప్‌లలో 12 మహిళలు నాయకత్వం వహిస్తున్నారుర్.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM) గురించి:
ఏ ఐ ఎం అనేది ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత యొక్క సంస్కృతిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం యొక్క ప్రయత్నం. ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కేంద్రాలు, గొప్ప సవాళ్లు, ప్రారంభ వ్యాపారాలు మరియు ఇతర స్వయం-ఉపాధి కార్యకలాపాలు, ముఖ్యంగా సాంకేతికతతో నడిచే ప్రాంతాల్లో ప్రోత్సాహం కోసం ఒక వేదికగా పనిచేయడం దీని లక్ష్యం.
***
(Release ID: 1895222)
Visitor Counter : 254