పర్యటక మంత్రిత్వ శాఖ
ఎర్రకోట ముందు భారత్ పర్వ్ 2023 ప్రారంభం
ఆరు రోజుల “భారత్ పర్వ్” 2023 జనవరి 31 వరకు
భారత్ పర్వ్.. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కలిగిస్తుంది:శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
26 JAN 2023 8:15PM by PIB Hyderabad
- కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- జోనల్ కల్చరల్ సెంటర్‌ల సాంస్కృతిక ప్రదర్శనలు, అలాగే రాష్ట్రాలు/యుటిల నుండి సాంస్కృతిక బృందాలు, పాన్-ఇండియా ఫుడ్ కోర్ట్, 65 హస్తకళల స్టాల్స్‌తో పాన్-ఇండియా క్రాఫ్ట్స్ బజార్ ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయి.
ఆరు రోజుల మెగా ఈవెంట్ “భారత్ పర్వ్” ని నిన్న ఎర్ర కోట వద్ద కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన పర్యాటక మంత్రిత్వ శాఖ ఇన్‌క్రెడిబుల్ ఇండియా డిజిటల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 2023 క్యాలెండర్ ఇతివృత్తం “ది ఇన్‌క్రెడిబుల్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా”. ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రిపబ్లిక్ డే దేశాభివృద్ధికి పాటుపడే యువకులకు కొత్త శక్తిని ఇస్తుందని అన్నారు. భారతదేశం నలుమూలల నుండి కళాకారులు, హస్తకళలు, ఫుడ్ స్టాల్స్ ఇక్కడ ఉన్నందున ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని 'భారత్ పర్వ్' నెరవేరుస్తుందని ఆయన తెలిపారు. భారత్ పర్వ్ ద్వారా మినీ ఇండియాను చూడవచ్చని ఆయన అన్నారు. ఈ ఏడాది భారత్ పర్వ్ మిల్లెట్‌లను ప్రోత్సహిస్తోందని, వివిధ మంత్రిత్వ శాఖల విజయాలను కూడా ప్రదర్శిస్తోందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం భారత్ పర్వ్ ఈ చారిత్రాత్మక ప్రదేశంలో 30కి పైగా రాష్ట్రాలు/యూటీలు, 20 కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో భారతదేశం శక్తివంతమైన గొప్ప సంస్కృతిని ఒకచోట చేర్చిందని తెలిపారు.
ఆరు రోజుల మెగా ఈవెంట్ “భారత్ పర్వ్” కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం జనవరి 26 నుండి 31వ తేదీ వరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తోంది. వేదిక వద్ద ఉత్తమ రిపబ్లిక్ డే పరేడ్ శకటాల ప్రదర్శన, జోనల్ సాంస్కృతిక కేంద్రాల సాంస్కృతిక ప్రదర్శనలు, అలాగే రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుండి సాంస్కృతిక బృందాలు, పాన్-ఇండియా ఫుడ్ కోర్ట్ , 65 హస్తకళా స్టాల్స్‌తో పాన్-ఇండియా క్రాఫ్ట్స్ బజార్ వంటివి ఇందులోని ముఖ్యాంశాలు. ఈ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది.
భారత్ పర్వ్ గతంలో 2016, 2017, 2018, 2019, 2020 ( 2021 సంవత్సరంలో వర్చువల్) ఎర్రకోట ముందు ఉన్న లాన్స్, జ్ఞాన్ పథ్ లో జరిగింది. ఎర్రకోట ఎదురుగా ఉన్న లాన్స్, జ్ఞాన్ పథ్ వద్ద 2 సంవత్సరాల విరామం తర్వాత భౌతికంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఫెస్టివల్, హస్తకళ మేళా, జానపద, గిరిజన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు, రిపబ్లిక్ డే శకటాల ప్రదర్శన, మొదలైనవి ఉంటాయి. దేఖో అప్నా దేశ్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, జి20, మిషన్ లైఫ్ బ్రాండింగ్ ఈ సందర్బంగా చేపట్టారు.
ఆరు రోజుల ఈవెంట్ కింది విధంగా ఉంటాయి:
ప్రాంతీయ వంటకాల ప్రదర్శన, విక్రయం
ఫుడ్ కోర్ట్
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్టాల్స్.
ఐహెచ్ఎం స్టాల్స్
ఆహార విక్రేతల స్టాల్స్
ఆహార ప్రదర్శనలు (మిల్లెట్స్ సంవత్సరంగ జరుగుతోంది)
హస్తకళ, చేనేత
చేనేత స్టాల్స్
రాష్ట్ర ప్రభుత్వాల స్టాల్స్
కెవిఐసి, ట్రైఫైడ్ స్టాల్స్
సంస్కృతి, వారసత్వం
జోనల్ కల్చరల్ సెంటర్ (సాంస్కృతిక మంత్రిత్వ శాఖ)చే నృత్య ప్రదర్శనలు
ప్రత్యేక ప్రదర్శనలు
శకటాల ప్రదర్శన
కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థల విజయాలు & ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్
కార్యాచరణ జోన్
నుక్కడ్ నాటకం
క్విజ్‌లు
పెయింటింగ్ పోటీలు
టూరిజం యువ క్లబ్, పాఠశాల/కళాశాల భాగస్వామ్యం
ప్రయోగాత్మక జోన్
*******
(Release ID: 1894072)
Visitor Counter : 236