జల శక్తి మంత్రిత్వ శాఖ

నీరు, ఇతర మౌలిక సదుపాయాల రంగాల్లోని అగ్ర సంప్రదింపుల సేవల సంస్థల్లో వ్యాప్‌కోస్‌కు మొదటి ర్యాంక్‌ ఇచ్చిన ఏడీబీ

Posted On: 28 DEC 2022 7:04PM by PIB Hyderabad

కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థ అయిన వ్యాప్‌కోస్‌ గొప్ప ఘనత సాధించింది. వార్షిక సేకరణలపై ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) విడుదల చేసిన నివేదికలో, నీరు & ఇతర మౌలిక సదుపాయాల రంగాల్లోని సంప్రదింపుల సేవల సంస్థల్లో అత్యధికంగా మంజూరైన ఆర్థిక మొత్తంతో వ్యాప్‌కోస్‌ అగ్రస్థానంలో నిలిచింది.

ఫాక్ట్ షీట్-2022 పేరిట ఏడీబీ విడుదల చేసిన మరొక నివేదికలో, సంప్రదింపుల సేవల కాంట్రాక్టుల్లో భారతదేశం నుంచి తొలి 3 సంస్థల్లో వ్యాప్‌కోస్‌ ఒకటిగా నిలిచింది. విద్యుత్‌, రవాణా, జలం & ఇతర పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల రంగాల్లో ఏడీబీ రుణం, గ్రాంట్, సాంకేతిక సాయం పొందిన ప్రాజెక్టుల విభాగంలో వ్యాప్‌కోస్‌ ఈ మైలురాయి అందుకుంది. ఈ విభాగాల్లో ఈ ఘనత సాధించిన ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్‌కోస్‌. 

*   వార్షిక సేకరణలపై ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) విడుదల చేసిన నివేదికలో, నీరు & ఇతర మౌలిక సదుపాయాల రంగాల్లోని సంప్రదింపుల సేవల సంస్థల్లో అత్యధికంగా మంజూరైన ఆర్థిక మొత్తంతో వ్యాప్‌కోస్‌ అగ్రస్థానంలో నిలిచింది.

*  సంప్రదింపుల సేవల కాంట్రాక్టుల్లో భారతదేశం నుంచి తొలి 3 సంస్థల్లో వ్యాప్‌కోస్‌ ఒకటిగా నిలిచింది. విద్యుత్‌, రవాణా, జలం & ఇతర పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల రంగాల్లో ఏడీబీ రుణం, గ్రాంట్, సాంకేతిక సాయం పొందిన ప్రాజెక్టుల విభాగంలో వ్యాప్‌కోస్‌ ఈ మైలురాయి అందుకుంది.

*  జల వనరులు, విద్యుత్‌, మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాల్లో సాంకేతికత ఆధారిత సంప్రదింపుల సంస్థ వ్యాప్‌కోస్‌ . ఇంజినీరింగ్, సేకరణ, నిర్మాణ (ఈపీసీ) సంస్థగానూ సేవలు అందిస్తోంది.

*  ఆసియా, ఆఫ్రికా, సీఐఎస్‌, పసిఫిక్ దీవులు, దక్షిణ అమెరికాలోని 51కి పైగా దేశాల్లో ఈ సంస్థ విజయవంతంగా ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదా కొనసాగిస్తోంది.

 

జల వనరులు, విద్యుత్‌, మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాల్లో సాంకేతికత ఆధారిత సంప్రదింపుల సంస్థ వ్యాప్‌కోస్‌ . ఇంజినీరింగ్, సేకరణ, నిర్మాణ (ఈపీసీ) సంస్థగానూ సేవలు అందిస్తోంది.

భారతదేశంతో పాటు ఆసియా, ఆఫ్రికా, సీఐఎస్‌, పసిఫిక్ దీవులు, దక్షిణ అమెరికాలోని 51కి పైగా దేశాల్లో ఈ సంస్థ విజయవంతంగా ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదా కొనసాగిస్తోంది.

 

*****



(Release ID: 1887178) Visitor Counter : 113


Read this release in: English , Urdu