జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్ లక్ష్యాలు
Posted On:
22 DEC 2022 3:27PM by PIB Hyderabad
ఆగష్టు, 2019 నుండి 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి ద్వారా తాగు నీటి సరఫరాను అందించడానికి భారత ప్రభుత్వం.. ఆయా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ (జేజేఎం)ని అమలు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ ప్రకటన సమయంలో 3.23 కోట్ల (17%) కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదించబడింది. ఇప్పటివరకు దాదాపు 7.52 కోట్ల (38%) అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించబడ్డాయి. ఈ విధంగా 19.12.2022 నాటికి, దేశంలోని 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలలో 10.75 కోట్ల (55.54%) కంటే ఎక్కువ కుటుంబాలకు తమ ఇళ్లకు కుళాయి ద్వారా మంచి నీటి సరఫరా అందిచడం జరిగిన్నట్లు నివేదించబడింది. "నీరు" అనేది రాష్ట్ర ప్రభుత్వపు పరిధిలోని అంశం అయినందున, నీటి సరఫరా పథకాలను ప్లాన్ చేయడం, ఆమోదించడం, అమలు చేయడం, నిర్వహించడం, పథకాల నిర్వహణ వంటి అధికారాలు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయిఅందువల్ల ఫిర్యాదులు, అవినీతి, గ్రీవియెన్స్ మొదలైనవి సంబంధిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ సంస్థల పరిధిలో పరిష్కరించబడతాయి. జేజేఎం యొక్క వివిధ పనులు మరియు విభాగాల అమలు నాణ్యతను అంచనా వేయడానికి కాలానుగుణ ప్రాతిపదికన క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేపట్టబడతాయి. జేజేఎం డ్యాష్‌బోర్డ్ కూడా అభివృద్ధి చేయబడింది. ఇక్కడ మిషన్‌పై రాష్ట్ర, జిల్లా మరియు పంచాయతీ స్థాయిలలో పురోగతికి సంబంధించిన సమాచారం పబ్లిక్ డొమైన్‌లో అందించబడుతుంది. సీపీజీఆర్ఏఎంఎస్ పోర్టల్ ద్వారా స్వీకరించబడిన ఫిర్యాదులు కూడా సంబంధిత రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతాల స్థానికి సంస్థల ద్వారా పరిష్కారం కోసం తీసుకోబడతాయి. 2017-18 & 2018-19 సంవత్సరాల్లో ఎన్ఆర్డీడబ్ల్యుపీ కింద మరియు 2019-20, 2020-21, 2021-22 & 2020లో జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు కేటాయించిన, డ్రా మరియు వినియోగానికి సంబంధించిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతాల నివేదించబడిన కేంద్ర నిధుల వివరాలు -23 (18.12.2022 నాటికి) ఈ వార్తతో అనుబంధంగా అందించబడింది. ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా అందించిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1885993)
Visitor Counter : 126