కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికాం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల్లో పీఎల్‌ఐ పథకం
Posted On:
21 DEC 2022 2:48PM by PIB Hyderabad
టెలికాం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి 01.04.2021 నుంచి అమల్లోకి వచ్చేలా, 24.02.2021న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగం ప్రకటించింది. ఈ పథకం కింద 04.06.2021 నుంచి 03.07.2021 వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హత గల 31 దరఖాస్తులను 14 అక్టోబర్ 2021న ఆమోదించారు. డిజైన్ కేంద్రీకృత తయారీని చేర్చడానికి, 01.04.2022 నుంచి అమలులోకి వచ్చేలా ఈ పథకం మార్గదర్శకాలను 20.06.2022న సవరించారు. 21.06.2022 నుంచి 25.08.2022 వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రస్తుతం ఉన్న 14 సంస్థలు ఇప్పటికే అందుకుంటున్న ప్రోత్సాహకాలతో కొనసాగాయి. 32 దరఖాస్తులు, 28 అర్హత గల దరఖాస్తులకు 31 అక్టోబర్ 2022న ఆమోదం లభించింది. అర్హత ఆధారంగా, ప్రస్తుతం, పీఎల్‌ఐ పథకం కింద ఆమోదించిన 42 సంస్థలు ఉన్నాయి. ఈ 42 సంస్థల్లో 17 సంస్థలు డిజైన్ కేంద్రీకృత ఉత్పత్తులు చేస్తున్నాయి.
ఈ 42 కంపెనీలు రూ.4,115 కోట్ల పెట్టుబడులకు అంగీకరించాయి. దీనివల్ల పథకం అమలు సమయంలో రూ.2.45 లక్షల కోట్ల అదనపు విక్రయాలు, 44,000 మందికి పైగా ఉద్యోగ సృష్టి సాధ్యమవుతుంది. టెలికాం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల విషయంలో భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడానికి పరిశ్రమ నుండి వచ్చిన ప్రతిస్పందనను ఈ దరఖాస్తుల సంఖ్య సూచిస్తుంది.
టెలికాం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల కోసం, 01.04.2021 నుంచే అమలులోకి వచ్చేలా పీఎల్‌ఐ పథకాన్ని 24.02.2021న ప్రకటించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.420 కోట్ల అదనపు పెట్టుబడి, రూ.9,019 కోట్ల విక్రయాలు, 4,938 మందికి ఉపాధి లభించింది. రాష్ట్రాలు & యూటీల వారీగా కంపెనీల జాబితా అనుబంధంలో ఉంది.
***
(Release ID: 1885464)
Visitor Counter : 161