సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజనతో బిజెఆర్ వైసి విలీనం


అన్ని బాలికల, బాలుర హాస్టళ్లకు నూరుశాతం నిధులు సమకూర్చిన డిపార్టమెంట్

నాడు పోస్టు చేయడమైనది: 20 DEC 2022 4:31PM by PIB Hyderabad

 బాబు జగజ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన (బిజెఆర్సివై) పథకాన్ని మరో రెండు పథకాలతో విలీనం చేయడం జరిగింది.  ఇలా విలీనం చేసిన పథకంలో షెడ్యూలు కులాల (ఎస్ సి) విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించినది
పథకం  ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన (పిఎం–ఎజెఎవై) ఉంది.హాస్టళ్లతోపాటు ఇందులోని అన్ని అంశాలకు ఒకేబడ్జెట్ పద్దు పిఎం–ఎజెఎవై కింద నిధులను సమకూర్చడం జరుగుతుంది.
వెనుకటి బిజెఆర్సివై కింద ఈ విభాగం అన్ని బాలికల హాస్టళ్లకు, కేంద్ర పాలిత ప్రాంత పాలనా యంత్రాంగం ప్రతిపాదించే అన్ని బాలుర హాస్టళ్లకు నూరుశాతం ఫండింగ్ సమకూరుస్తుంది.
50 శాతం బాలుర హాస్టళ్లను రాష్ట్రప్రభుత్వాలు ప్రతిపాదించనుండగా, 90 శాతం కేంద్ర సంస్థలు ప్రతిపాదిస్తాయి.  విద్యార్థులకు తగిన రెసిడెన్షియల్ సదుపాయాలు కల్పించడం ద్వారా, పాఠశాలల్లో
, ఉన్నత విద్యా సంస్థలలో ఎస్.సిల ప్రవేశాలను పెంచేందుకు,పిఎం–ఎజెఎవై కింద అన్ని ఎస్సి హాస్టళ్ల నిర్మాణానికి నూరుశాతం కేంద్ర సహాయాన్ని అందించనున్నారు. ఆయా హాస్టళ్లు బాలురకు సంబంధించినవా లేక బాలికలకు సంబంధించినవా  అన్న దానితో సంబంధం లేకుండా ఈ సహాయం అందించనున్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ ఎ.నారాయణస్వామి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

***


(రిలీజ్ ఐడి: 1885309) సందర్శకుల సూచీ సంఖ్య : : 139
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu