ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎఫ్‌పీఐలకు ప్రోత్సాహం
Posted On:
20 DEC 2022 1:59PM by PIB Hyderabad
2021-22 నుంచి 2026-27 వరకు ఆరు సంవత్సరాల కాలానికి రూ.10,900 కోట్లతో “ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐఎస్‌ఎఫ్‌పీఐ)” కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంవోఎఫ్‌పీఐ) అమలు చేస్తోంది. భారతదేశ సహజ వనరులకు అనుగుణంగా అంతర్జాతీయ ఆహార తయారీ విజేతలను రూపొందించడంలో ఈ పథకం సహాయపడుతుంది. అంతర్జాతీయ విఫణుల్లో భారతీయ బ్రాండ్ ఆహార ఉత్పత్తులకు మద్దతు ఇస్తుంది.
వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు (5, 6, 14 మినహా 2-23 ఐటీసీ అధ్యాయాలు) 2015-16లోని $29.67 బిలియన్ల నుంచి 2021-22లో $46.11 బిలియన్లకు పెరిగాయి, ఇది సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 7.62% వృద్ధికి సమానం. విలువ ఆధారిత ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు (16-23 ఐటీసీ అధ్యాయాలు) 2015-16లోని $4.855 బిలియన్ల నుంచి 2021-22లో $10.420 బిలియన్లకు పెరిగాయి, ఇది 13.57% సీఏజీఆర్ వృద్ధికి సమానం.
దేశవ్యాప్తంగా ఆహార ప్రాసెసింగ్ రంగాల మొత్తం అభివృద్ధి కోసం నిర్ధారించడానికి, కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌వై), కేంద్ర ప్రాయోజిత పీఎం ఫార్మలైజేష్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ (పీఎంఎఫ్‌ఎంఈ), సెక్టార్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను (పీఎల్‌ఐఎస్‌ఎఫ్‌పీఐ) మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. పీఎంకేఎస్‌వై సంబంధిత పథకాల కింద, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు/యూనిట్‌లు/ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ రూపంలో, ఎక్కువగా రుణ ఆధారిత ఆర్థిక సహాయాన్ని (మూలధన రాయితీ) మంత్రిత్వ శాఖ అందిస్తోంది. పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థ ఏర్పాటు/ఆధునికీకరణ కోసం మంత్రిత్వ శాఖ ఆర్థిక, సాంకేతిక, వ్యాపార పరంగా సాయాన్ని అందిస్తోంది. అదేవిధంగా, ఆహార ప్రాసెసింగ్ రంగంలో ప్రముఖ బ్రాండ్లను సృష్టించడం ద్వారా ఆహార ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా పీఎల్‌ఐఎస్‌ఎఫ్‌పీఐని అమలు చేస్తోంది.
ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇవాళ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.
*****
(Release ID: 1885253)