రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

గల్వాన్ ,తవాంగ్ ఘటనల సమయంలో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలను న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్ఐసిసిఐ ఈవెంట్ లో ప్రశంసించిన రక్షణమంత్రి .


ఇతర భూ భాగాలను స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని, అయితే ఎవరి దుష్టదృష్టినైనా
తిప్పికొట్టేందుకు తాము సిద్ధమని స్పష్టం చేసిన మంత్రి.

‘‘భారతదేశంపై ప్రపంచానికి ఎన్నో ఆశలు ఉన్నాయి.రక్షణ రంగ ఎగుమతులు గత 6 సంవత్సరాలలో ఏడురెట్టు పెరిగాయి’’

అంతర్జాతీయ డిమాండ్ను తట్టుకునేందుకు వీలుగా భారతదేశ రక్షణ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిందిగా దేశీయ పరిశ్రమ, విదేశీ ఒయిఎంలను కోరిన రాజ్ నాథ్ సింగ్

“భారత ఆర్థిక వ్యవస్థకు రక్షణరంగం ఒక భానూదయ పరిశ్రమ కానుంది’’

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ వేదికపై ఇండియా అజెండా రూపకర్తగా మారింది: రక్షణమంత్రి

Posted On: 17 DEC 2022 5:06PM by PIB Hyderabad

గల్వాన్, తవాంగ్ ఘటనలలో భారత సైన్యం అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యాన్ని  రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసిసిఐ)95 వ వార్షిక సదస్సులో మాట్లాడుతూ ఆయన, ఏ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశం ఇండియాకు లేదని, అయితే ఎవరైనా దుష్టచూపుతో చూస్తే దానిని ఎదుర్కొనేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. ఇండియా సూపర్ పవర్ గా ఎదిగే లక్ష్యం నిర్ణయించుకుందని, ఇది ప్రపంచ శ్రేయస్సుకోసం పనిచేస్తుందని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇండియా విజయాలు సాధించడంలో నూతన శిఖరాలను అధిరోహిస్తున్నదని, బలహీన ఐదు దేశాల స్థాయి నుంచి
అద్భుత ఐదు దేశాల స్థాయికి ఎదిగిందని, ఆయన అన్నారు. బలహీన ఐదు దేశాలు అన్న పదాన్ని 2014లో ఇన్వెస్ట్మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ రూపొందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోని ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉన్న   ఐదు దేశాల సరసన నిలబడి ఉన్నదని ఆయన అన్నారు. 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి మనకు 1990 నుంచి 31 సంవత్సరాలు పట్టిందని ఆయన అన్నారు.‘‘ రాగల ఏడు సంవత్సరాలలో మరో మూడు ట్రిలియన్ డాలర్లు వచ్చి చేరుతాయన్న నమ్మకం నాకు ఉంది ”అని ఆయన అన్నారు.

ప్రధానమంత్రికి గల విశ్వసనీయత, వారు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రపంచ వేదికపై ఇండియా , అజెండా నిర్ణాయక సంస్థగా ఎదిగిందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇండియా స్థాయి నానాటికి పెరుగుతోందనడానికి , ఇండియా  .జి–20 అధ్యక్షత చేపట్టడమేనని అన్నారు. జి–20 థీమ్ ఒక ధరిత్రి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అని , దీని ద్వారా సమ్మిళిత, నిర్ణయాత్మక అభివృద్ధి మార్గసూచీని నిర్ణయించడం జరుగుతుందన్నారు. వసుదైవ కుటుంబకం, ప్రపంచ సంక్షేమం స్ఫూర్తితో మన ప్రధానమంత్రి , కోవిడ్ –19  నుంచి  ఇంకా కోలుకోని దేశాల ఆర్థిక, మానవ అభివృద్ధికి కృత నిశ్చయంతో ఉన్నట్టు ప్రకటించారు.
ప్రభుత్వం తీసుకువచ్చిన నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రక్రియా పరమైన మార్పులు, బలమైన, సుసంపన్నమైన, స్వావలంబిత భారత దేశం దిశగా ఇండియా గొప్ప ముందడుగు వేసేందుకు ఒక ప్రాతిపదికను రూపొందించిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు.  డిజిటల్ ఆర్థిక మౌలికసదుపాయాల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రత్యక్ష నగదు బదిలీ, ప్రధానమంత్రి ముద్రా యోజన,వంటివి ప్రజలకు ప్రత్యేకించి పేదలకు ఇవి ఎంతో మేలు చేస్తున్నాయని ఆయన అన్నారు.
భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు  రక్షణ మంత్రిత్వశాఖఖ తీసుకున్న పలు సంస్కరణలను రక్షణ మంత్రి ప్రస్తావించారు.
ఎఫ్.డి.ఐ నిబంధనలను సులభతరం చేయడం, ఎఫ్డిఐ పరిమితిని 74 శాతానికి ఆటోమేటిక్ రూట్ కింద పెంచడం, ప్రభుత్వ రూట్ కింద 100 శాతానికి పెంచడం వంటి వి ఇందులో ఉన్నాయని అన్నారు.
దేశీయ పరిశ్రమకు పెట్టుబడి సేకరణ బడ్జెట్కు 68 శాతం కేటాయింపుల 2022‌‌–23లో నిర్ణయించినట్టు  తెలిపారు. దేశీయ పరిశ్రమలు, విదేశీ ఒఇఎంల ఇందులో పాల్గొనేందుకు ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దేశీయ పరిశ్రమ, విదేశీ ఒఇఎంల అధిపతులు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టి , అంతర్జాతీయ సరఫరా చెయిన్లో సమ్మిళితం కావలసిందిగా పిలుపునిచ్చారు.  
ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణల మంచి ఫలితాలు ఇచ్చాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇవి రక్షణరంగ ఎగుమతులు
గత ఆరు సంవత్సరాలలో ఏడు రెట్లు పెరగడానికి దోహదపడ్డాయని తెలిపారు. రక్షణ ఉత్పత్తిని  2025 నాటికి 12 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 22 బిలియన్ అమెరికన్
 డాలర్లకు చేర్చేందుకు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. “రక్షణ రంగానికి ఇది స్వర్ణయుగం. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్ కారియర్, ప్రధాన యుద్ధ ట్యాంకులు, పోరాట హెలికాప్టర్లు వంటి వాటిని మన దేశం ప్రదర్శించింది. భారత రక్షణ పరిశ్రమ అద్భుతంగా వృద్ధి సాధస్తోంది. ఇది అంతర్జాతీయ వేదికపై
తన ఉనికిని చాటుకుంటోంది .ఇది భారీ కార్పొరేట్ సంస్‌థలను ఆకర్షించడమే కాక, స్టార్టప్లు, ఎంఎస్ఎంఇలను కూడా ఆకర్షిస్తోంది. ఇటీవలి కాలంలో పలు స్టార్టప్లు ఎదిగాయి, 2014లో దేశంలో పట్టుమని 400 నుంచి 500 స్టార్టప్లు ఉండగా ఇవాళ వాటి సంఖ్య 80 ,000 కు చేరింది. రక్షణ పరిశ్రమ వృద్ధికి గట్టి అవకాశాలు ఉన్నాయి. ఇది భారత ఆర్ధిక వ్యవస్థకు భానూదయ రంగం ” అని ఆయన అన్నారు.

***



(Release ID: 1884713) Visitor Counter : 123