గనుల మంత్రిత్వ శాఖ
జియో సైంటిస్టుల 46వ ఓరియంటేషన్ కోర్సు
प्रविष्टि तिथि:
09 DEC 2022 6:34PM by PIB Hyderabad
ఈ రోజు శుక్రవారం 09-12-2022 జి.యస్.ఐ శిక్షణా సంస్థ, బండ్లగూడ (నాగోల్) కార్యాలయం, M.S. కృష్ణన్ ఆడిటోరియంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేయబడిన 46వ బ్యాచ్ జియో సైంటిస్టుల కోసం ఓరియంటేషన్ కోర్సు ముగింపు కార్యక్రమము నిర్వహించారు. 46వ బ్యాచ్ కు చెందినా మొత్తం 64 మంది జియో సైంటిస్టులు ప్రొఫెషనల్ జియాలజిస్టులుగా మారడానికి దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాలలో సుమారు 11 నెలల సుదీర్ఘ కాలం పాటు శిక్షణా సంస్థ ద్వారా విస్తృతంగా శిక్షణ పొందారు. డాక్టర్ ఎస్. రాజు, డైరెక్టర్ జనరల్ జీఎస్ఐ అధ్యక్షతన ముగింపు సభ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సి.హెచ్. వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, సదరన్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్ మరియు డైరెక్టర్లు, శిక్షణా సంస్థల డైరెక్టర్లు మరియు అధ్యాపకులు కూడా పాల్గొన్నారు.

కోర్సు యొక్క ముగింపు సెషన్ శ్రీ శ్యామ ప్రసాద్ భూటియా, డైరెక్టర్ హైదరాబాద్ ద్వారా కోర్సు వివరాలు అందించారు
శ్రీ సి.హెచ్. వెంకటేశ్వరరావు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు హెడ్ మిషన్-V, మాటాడుతూ 11 నెలల పాటు సాగిన ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అధికారులందరినీ అభినందించారు. క్రమశిక్షణ, అలంకారం మరియు అంకితభావం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు మరియు కెరీర్ అభివృద్ధిలో దాని ప్రాముఖ్యతను చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో శిక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు శిక్షణ సమయంలో వారు నేర్చుకున్న సాంకేతికతలను ఉపయోగించాలని జియాలజిస్టులకు సూచించారు.

డా. రాజు, డైరెక్టర్ జనరల్, తన ప్రసంగంలో జి.యస్.ఐ అత్యుత్తమ జియోసైన్స్ ఆర్గనైజేషన్ అని, వివిధ జియోసైన్స్ డొమైన్లలో అద్భుతమైన అధికారుల బృందం ఉందని పేర్కొన్నారు. ఆత్మగౌరవాన్ని, సంపూర్ణ వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకోవాలని, దేశాభివృద్ధికి దోహదపడే ఖనిజ నిక్షేపాల అన్వేషణకు తమ వంతు కృషి చేయాలని ఆయన
అధికారులకు సూచించారు. ఈ భౌగోళిక శాస్త్రవేత్తలు సంస్థ యొక్క భవిష్యత్తు అని డాక్టర్ S. రాజు వ్యక్తం చేశారు..

శ్రీ ఆర్.విజయ్ కుమార్, డైరెక్టర్, జిఎస్ఐటిఐ, హైదరాబాద్ ప్రతిపాదించిన కృతజ్ఞతా ప్రసంగంతో కార్యక్రమం ముగిసింది
***
.
(रिलीज़ आईडी: 1882296)
आगंतुक पटल : 120
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English