గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బ్యాంకులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ చెల్లింపు రేటు 97.71 శాతం


గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వయం సహాయక బృందాలకు నిధుల మొత్తం ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి అనేక ప్రభావ మూల్యాంకన అధ్యయనాలను నిర్వహించింది

Posted On: 07 DEC 2022 6:08PM by PIB Hyderabad

ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ, స్వయం సహాయక బృందాల (ఎస్‌.హెచ్‌.జి) పేరుతో బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయని తెలియజేశారు.  వ్యక్తిగత ఎస్‌.హెచ్‌.జి. సభ్యులకు రుణాల పంపిణీ ఎస్‌.హెచ్‌.జి. ద్వారా జరుగుతుందనీ,  దీనిని వారు వివిధ కార్యకలాపాలకు ఉపయోగిస్తారని, ఆమె తెలియజేశారు. 2022 నవంబర్, 30వ తేదీ నాటికి స్వయం సహాయక బృందాలకు (ఎస్‌.హెచ్‌.జి.లకు) బకాయి ఉన్న రుణాలు 1,68,920.11 కోట్ల రూపాయలు.  2022 నవంబర్, 30వ తేదీ నాటికి,  బ్యాంకులకు ఎస్.హెచ్.జి. ల ద్వారా రుణ చెల్లింపు రేటు 97.71 శాతంగా ఉంది. 

 

 

దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం) మొత్తం ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మంత్రిత్వ శాఖ అనేక ప్రభావ మూల్యాంకన అధ్యయనాలను నిర్వహించినట్లు, కేంద్ర సహాయ మంత్రి తెలియజేశారు.  ప్రపంచ బ్యాంక్ మద్దతు తో ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ఇంపాక్ట్ ఎవాల్యుయేషన్ (3ఐ.ఈ) ద్వారా డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం. ప్రభావ మూల్యాంకన అధ్యయనం 2019-20 లో నిర్వహించబడింది.  బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ లోని దాదాపు 27,000 మంది ప్రతివాదులు, 5,000 మంది స్వయం సహాయక సంఘాలతో 9 రాష్ట్రాలను ఈ అధ్యయన పరిధిలోకి తీసుకోవడం జరిగింది. 

 

 

ఈ మిషన్‌ గురించి, గత రెండున్నర సంవత్సరాలుగా జరిగిన అదనపు ప్రచారం కారణంగా ఈ కింది సత్పలితాలు సాధించినట్లు, ఈ అధ్యయనం సూచిస్తోంది:

 

 

i.     ప్రాథమిక మొత్తం పై 19 శాతానికి పైగా ఆదాయంలో పెరుగుదల.

 

ii.     అనధికారిక రుణాల వాటాలో 20 శాతం మేర క్షీణత

 

iii.    పొదుపులో 28 శాతం మేర పెరుగుదల    

 

iv.    మెరుగైన శ్రామిక శక్తి భాగస్వామ్యం - చికిత్సా రంగాలలో ద్వితీయ వృత్తిని నివేదించే స్త్రీల నిష్పత్తి ఎక్కువగా ఉంది (4శాతం).     

 

v.     ఇతర పథకాలకు మెరుగైన యాక్సెస్ - ట్రీట్‌మెంట్ కుటుంబాలు (2.8 పధకాల బేస్ విలువ కంటే 6.5 శాతం ఎక్కువ) పొందే సామాజిక పథకాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల.

 

 

దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం) కి చెందిన బ్యాంక్ లింకేజ్ పోర్టల్‌ లో పొందుపరిచిన సమాచారం ప్రకారం, 2022 నవంబర్, 30వ తేదీ నాటికి, రాష్ట్రాల వారీగా ఎస్.హెచ్.జి. లకు బకాయిపడిన రుణాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:-

 

 

 (మొత్తం కోట్ల రూపాయల్లో)

క్రమ సంఖ్య 

 

రాష్ట్రం / 

కేంద్ర పాలిత ప్రాంతం 

రుణ బకాయి మొత్తం

(2022 నవంబర్, 30 తేదీ నాటికి)

1

అండమాన్, నికోబార్ దీవులు

0.83

2

ఆంధ్రప్రదేశ్

55,897.82

3

అరుణాచల్ ప్రదేశ్

12.46

4

అస్సాం 

2,393.04

5

బీహార్ 

12,275.30

6

ఛత్తీస్ గఢ్

1,249.59

7

గోవా 

49.22

8

గుజరాత్ 

448.18

9

హర్యానా 

288.31

10

హిమాచల్ ప్రదేశ్

173.55

11

జమ్మూ-కశ్మీర్

414.19

12

జార్ఖండ్

2,502.91

13

కర్ణాటక 

19,851.27

14

కేరళ 

7,062.52

15

లడఖ్ 

0.81

16

లక్షద్వీప్

1.31

17

మధ్యప్రదేశ్

1,958.14

18

మహారాష్ట్ర

5,408.98

19

మణిపూర్

24.22

20

మేఘాలయ

81.43

21

మిజోరం

48.64

22

నాగాలాండ్

69.99

23

ఒడిశా

7,067.64

24

పుదుచ్చేరి

159.01

25

పంజాబ్

84.07

26

రాజస్థాన్

1,147.76

27

సిక్కిం

26.99

28

తమిళనాడు

13,025.00

29

తెలంగాణ

20,224.75

30

దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ

0.87

31

త్రిపుర

255.97

32

ఉత్తరాఖండ్

106.11

33

ఉత్తర ప్రదేశ్

632.16

34

పశ్చిమ బెంగాల్

15,977.07

 

Total

1,68,920.11

 

 

****


(Release ID: 1881705) Visitor Counter : 146
Read this release in: English