ఆర్థిక మంత్రిత్వ శాఖ

పీపీపీ ప్రాజెక్టుల అభివృద్ధి వ్యయానికి ఆర్థిక సహకారం అందించేందుకు రూపొందిన 'ఐఇపిడిఎఫ్ పథకం (ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్) 03.11.2022న నోటిఫై చేయబడింది

Posted On: 04 NOV 2022 1:36PM by PIB Hyderabad

 పీపీపీ ప్రాజెక్టుల అభివృద్ధి వ్యయానికి ఆర్థిక సహకారం అందించేందుకు రూపొందిన 'ఐఇపిడిఎఫ్ పథకం (ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్) 03.11.2022న ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రకటించింది. 

ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం అందిస్తూ దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేసే అంశానికి  ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రాధాన్యత ఇస్తున్నది. మౌలిక సౌకర్యాల కల్పన రంగంలో ప్రైవేటు రంగం ఎక్కువగా పాల్గొనేలా చూసేందుకు విధాన రూపకల్పన చేయడానికి  ఆర్థిక వ్యవహారాల విభాగం  కృషి చేస్తున్నది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టుల్లో  ప్రైవేటు పెట్టుబడులు వచ్చేలా చూసేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ప్రోత్సహించాలని   ఆర్థిక వ్యవహారాల విభాగం నిర్ణయించింది. పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టుల  నిర్మాణం వేగంగా నాణ్యతతో పూర్తి చేయడానికి అవకాశం కలుగుతుంది. అవసరమైన ప్రాంతాల్లో ప్రైవేటు రంగానికి ఆర్థిక, సాంకేతిక సహకారం అందించేందుకు కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 

పీపీపీ విధానాన్ని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా పీపీపీ ప్రాజెక్టుల అభివృద్ధికి అవసరమయ్యే నిధులు సమకూర్చడానికి  'ఐఇపిడిఎఫ్ పథకం (ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్)కి    ఆర్థిక వ్యవహారాల విభాగం రూపకల్పన చేసింది.పీపీపీ ప్రాజెక్టులను గుర్తించేందుకు నియమించే సలహాదారులు,కన్సల్టెంట్‌లకు అయ్యే ఖర్చును భరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పీఎస్ఏ లకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని ఆర్థిక వ్యవహారాల విభాగం నిర్ణయించింది. 

కేంద్ర ప్రాయోజిత పథకంగా ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్ ( ఐఇపిడిఎఫ్  ) అమలు జరుగుతుంది.  నాణ్యమైన పిపిపి ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన  ప్రాజెక్ట్ స్పాన్సర్ చేసిన సంస్థలు ఐఇపిడిఎఫ్ ద్వారా  అవసరమైన నిధులు పొందుతాయి. దేశానికి అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ఐఇపిడిఎఫ్  సహాయపడుతుంది. ఇప్పటికే పీపీపీ లకు 07.12.2020న ప్రకటించిన  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (వీజీఎఫ్  స్కీమ్)కింద  ఆర్థిక సహకారం అందుతోంది. దీనితో పాటు ఐఇపిడిఎఫ్  కింద పీపీపీ లకు ఆర్థిక సహకారం అందుతుంది. ఆర్థికంగా వెసులుబాటుగా  ఉన్నప్పటికీ వాణిజ్యపరంగా వెసులుబాటు కాని పీపీపీ లకు ఆర్థిక సహకారం అందించబడుతుంది. పథకం వివరాలు, మార్గదర్శకాలు   www.pppinindia.gov.in . లో  అందుబాటులో ఉన్నాయి. 

దేశంలో పీపీపీ అభివృద్ధికి దోహదపడే  వ్యవస్థను అభివృద్ధి చేయడానికి  ఆర్థిక వ్యవహారాల విభాగం కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ అనేక కార్యక్రమాలను చేపట్టింది. పీపీపీ అమలులో ఉండే వ్యవధికి అనుగుణంగా కార్యక్రమాలు రూపొందాయి. పీపీపీ విజయం సాధించే అంశంలో సలహా/కన్సల్టెన్సీ సేవలు కీలకంగా ఉంటాయి  సలహా/కన్సల్టెన్సీ సేవలు గుర్తించి ఖరారు చేసే అంశం .పీపీపీ లను స్పాన్సరింగ్ అథారిటీలకు క్లిష్టంగా మారింది. దీనివల్ల ప్రాజెక్టులను అమలు చేయడంలో జాప్యం జరుగుతోంది. 

దీనిని దృష్టిలో ఉంచుకుని  ఆర్థిక వ్యవహారాల విభాగం విభాగం 01.07.2022న ప్రీ-క్వాలిఫైడ్ టిఎ ల ప్యానెల్‌ నోటిఫై చేసింది.  ఈ ప్యానెల్‌ని ఉపయోగించడం కోసం మార్గదర్శకాలను రూపొందించింది. 

***



(Release ID: 1873781) Visitor Counter : 194


Read this release in: Gujarati , English , Urdu , Hindi