జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్ (ఎన్‌టిటిఎం) కింద స్పెషాలిటీ ఫైబర్స్, ఆగ్రో టెక్స్‌టైల్, ప్రొటెక్, స్పోర్టెక్ మరియు జియోటెక్ విభాగాల్లో 20 వ్యూహాత్మక ప్రాజెక్టులకు టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ఆమోదం


స్పెషాలిటీ ఫైబర్స్‌కు చెందిన 5 ప్రాజెక్ట్‌లు, ఆగ్రో టెక్స్‌టైల్స్‌కు చెందిన 6 ప్రాజెక్ట్‌లు, స్మార్ట్ టెక్స్‌టైల్స్ నుండి 2 ప్రాజెక్ట్‌లు, ప్రొటెక్టివ్ గేర్ మరియు అపెరల్ నుండి 2 , జియోటెక్స్‌టైల్స్ నుండి 2, యాక్టివ్‌వేర్ అపెరల్స్ నుండి 1 , స్ట్రాటజిక్ అప్లికేషన్ ఏరియా నుండి 1 , స్పోర్ట్స్ టెక్స్‌టైల్స్ నుండి 1 ప్రాజెక్టులకు ఆమోదం

ఆవిష్కరణలు మరియు స్వదేశీకరణలో దేశంలోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు చేసిన కృషి, సహకారాన్ని ప్రశంసించిన మంత్రి

దేశంలోని టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగాలలో పరిశోధన మరియు అభివృద్ధికి పరిశ్రమ, అకాడెమియాల అనుసంధానం చాలా అవసరమన్న శ్రీ పీయూష్ గోయల్

ఎన్‌టిటిఎం కింద రూ.1కోటి వరకు ఐడియేషన్ మరియు ప్రోటోటైపింగ్ ఆర్‌&డి ప్రాజెక్ట్‌లకు మద్దతు

Posted On: 02 NOV 2022 11:06AM by PIB Hyderabad

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ, వస్త్రాలు, వాణిజ్య, జౌళిశాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షతన  1 నవంబర్ 2022న అగ్రోటెక్స్‌టైల్, స్పెషాలిటీ ఫైబర్, స్మార్ట్ టెక్స్‌టైల్స్, యాక్టివ్‌వేర్ టెక్స్‌టైల్స్, స్ట్రాటజిక్ అప్లికేషన్ ఏరియాల్లో ప్రొటెక్టివ్ గేర్ మరియు అపెరల్ స్పోర్ట్స్ టెక్స్‌టైల్స్ రంగాలలో దాదాపు రూ.74 కోట్ల విలువైన 20 వ్యూహాత్మక పరిశోధన ప్రాజెక్ట్‌లను టెక్స్‌టైల్‌ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఈ వ్యూహాత్మక పరిశోధన ప్రాజెక్టులు ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ అయిన 'నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్' కిందకు వస్తాయి.

ఈ 20 రీసెర్చ్ ప్రాజెక్ట్‌లలో స్పెషాలిటీ ఫైబర్స్‌కు చెందిన 5 ప్రాజెక్ట్‌లు, 6 అగ్రో-టెక్స్‌టైల్స్ ప్రాజెక్ట్‌లు, 2 స్మార్ట్ టెక్స్‌టైల్స్ ప్రాజెక్ట్‌లు, ప్రొటెక్టివ్ గేర్ మరియు అపెరల్ నుండి 2  ప్రాజెక్టులు, జియోటెక్స్టైల్స్ నుండి  2 ప్రాజెక్టులు,  యాక్టివ్‌వేర్ అప్రెల్స్ నుండి 1, స్ట్రాటజిక్ అప్లికేషన్ ఏరియా నుండి 1 ,  స్పోర్ట్స్ టైక్క్‌టైల్‌ నుండి 1 ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.

వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమావేశానికి సాంకేతిక టెక్స్‌టైల్స్‌కు సంబంధించిన తన ఇన్‌పుట్‌లను మంత్రి అందించారు. ఐఐటీలు, ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సహా ప్రముఖ భారతీయ సంస్థలు ఈ సెషన్‌లో పాల్గొన్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి వ్యూహాత్మక ప్రాజెక్టులు ముఖ్యంగా జియోటెక్, పారిశ్రామిక మరియు రక్షణ, వ్యవసాయం మరియు మౌలిక సదుపాయాల కల్పనలో ఆత్మనిర్భర్ భారత్ దిశలో మరో ముఖ్యమైన అడుగు.

గౌరవనీయులైన శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణుల సమూహాన్ని ఉద్దేశించి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ “భారతదేశంలో సాంకేతిక వస్త్రాల  అప్లికేషన్ రంగాలలో పరిశోధన మరియు అభివృద్ధికి పరిశ్రమ మరియు అకాడెమియా అనుసంధానాలు చాలా అవసరం. విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులతో కలయికను నిర్మించడానికి చర్చ అవసరం" అని తెలిపారు.

భారతదేశ సాంకేతిక వస్త్రాల భవిష్యత్తు వృద్ధికి సాంకేతికత మరియు సెగ్మెంట్ నిపుణులు, శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తల సహకారం యొక్క ప్రాముఖ్యతపై శ్రీ పీయూష్ గోయల్ ఉద్ఘాటించారు.

భారతదేశంలో స్పెషాలిటీ ఫైబర్‌లను ప్రముఖంగా ఉపయోగిస్తున్నప్పటికీ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగా ఉంది. దీనికి పరిశ్రమ మరియు విద్యాసంస్థలు రెండింటి నుండి సహకారం అవసరం అని మంత్రి చెప్పారు.

గ్లోబల్ ల్యాండ్‌స్కేప్‌లో స్థిరమైన మరియు బలమైన స్థావరాన్ని నెలకొల్పడానికి సాంకేతిక టెక్స్‌టైల్ రంగానికి యంత్రాలు మరియు పరికరాల బలమైన దేశీయీకరణపై మంత్రి మరింత ఉద్ఘాటించారు.

ఆర్&డి మార్గదర్శకాల పునర్విమర్శ మరియు ఎన్‌టిటిఎం క్రింద స్వదేశీ యంత్రాలు మరియు పరికరాల అభివృద్ధికి మార్గదర్శకాలను రూపొందించడంపై కమిటీ సమావేశంలో చర్చించబడింది మరియు సిఫార్సు చేయబడింది.

టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ ఎకోసిస్టమ్‌ను పెంపొందించడానికి ఎన్‌టిటిఎం రూ.50 లక్షలు మరియు 100 లక్షల వరకు విలువైన ఆర్&డి ప్రాజెక్ట్‌లకు ఆలోచన మరియు ప్రోటోటైపింగ్ మద్దతునిస్తుంది. ఇవి వాణిజ్య ఉత్పత్తులు మరియు సాంకేతికతలలోకి అనువదించగల స్పష్టమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.


 

*****


(Release ID: 1872960) Visitor Counter : 188


Read this release in: English , Urdu , Hindi , Marathi