రక్షణ మంత్రిత్వ శాఖ
గుజరాత్ లోని గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్ పో -2022 నేపథ్యంలో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించిన రక్షణ శాఖ కార్యదర్శి
Posted On:
17 OCT 2022 8:27PM by PIB Hyderabad
డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ గుజరాత్ లోని గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్ పో 2022 సందర్భంగా స్నేహపూర్వక విదేశాల నుండి వచ్చిన ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. శ్రీలంక రక్షణ శాఖ మంత్రి శ్రీ ప్రీమితా బండారే టెన్నకూన్ తో ఆయన ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. Rendu దేశాల మధ్య ప్రస్తుత, భవిష్యత్తు రక్షణ సహకార అంశాల గురించి వారు చర్చించారు.
మారిషస్ శాశ్వత కార్యదర్శి శ్రీ దేవేంద్ర గోపాల్ తో కూడా రక్షణ కార్యదర్శి
సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక ద్వైపాక్షిక, రక్షణ, సముద్ర భద్రతా అంశాలపై చర్చించారు.
యుఎఇ రక్షణ కార్యదర్శి శ్రీ మతార్ సలేం అలీ మర్రాన్ అల్ధహేరి నేతృత్వంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధి బృందంతో మరొక ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ప్రస్తుతం ఉన్న రక్షణ సహకార యంత్రాంగాలను వారు సమీక్షించారు భారత్- యుఎఇ మధ్య రక్షణ రంగ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలను వారు అన్వేషించారు.
రియర్ అడ్మిరల్ వాగ్నర్ బెలార్మినో డి ఒలివేరా నేతృత్వంలోని బ్రెజిల్ ప్రతినిధి బృందాన్ని డాక్టర్ అజయ్ కుమార్ కలిశారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారానికి సంబంధించిన అంశాలపై వారు చర్చించారు.
అక్టోబర్ 18-22, 2022 మధ్య జరిగే డిఫెన్స్ ఎక్స్ పో లో పాల్గొనేందుకు ఈ ప్రతినిధులు గాంధీనగర్ లో ఉన్నారు.
***
(Release ID: 1868659)