మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశం ఎకనామిక్ సూపర్ పవర్ మరియు నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా మారడానికి ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహాయపడతాయి: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


మన జ్ఞాన ఆధారిత సమాజ ప్రధాన కేంద్రాలలో యూఓహెచ్‌ ఒకటి: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

ముత్యాల నగరంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం మేధో ముత్యం: గౌరవనీయ విద్యా మంత్రి

Posted On: 01 OCT 2022 6:30PM by PIB Hyderabad

2020, 2021 మరియు 2022 సంవత్సరాల్లో వివిధ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న 4800 మంది విద్యార్థులకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం డిగ్రీలను అందించింది. వీరిలో 1631 మంది వ్యక్తిగతంగా డిగ్రీలు పొందారు. మిగిలిన వారు హాజరుకాలేదు. ఈ 4800లో 573 మంది పిహెచ్‌డి పొందారు. అలాగే అసాధారణ ప్రతిభ చూపిన 484 మంది విద్యార్ధులను అవార్డులు మరియు పతకాలతో సత్కరించారు.
 
మహమ్మారి కారణంగా మూడేళ్ల తర్వాత ఈ వేడుకను నిర్వహించారు. యూనివర్శిటీ గౌరవ ఛాన్సలర్ జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి ఉత్సవాలను ప్రారంభించి గ్రహీతలతో ప్రమాణం చేయించారు.

వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.జె.రావు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు యూనివర్సిటీ చీఫ్ రెక్టార్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌, గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి మరియు భారత ప్రభుత్వంలోని నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, న్యాయమూర్తి ఎల్ నరసింహా రెడ్డిలకు సాదర స్వాగతం పలికారు.
 
పరిశోధన, బోధన, విద్యార్థుల మార్గదర్శకత్వం మరియు క్యాంపస్‌లోని కార్పొరేట్ జీవితంతో సహా వివిధ రంగాలలో విశ్వవిద్యాలయానికి వారి సహకారానికి గుర్తింపుగా యువ అధ్యాపక సభ్యులను ఛాన్సలర్ అవార్డుతో సత్కరించడంతో వేడుక ప్రారంభమైంది.

ప్రొఫెసర్ బి జె రావు తన వార్షిక నివేదికలో హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని మహోన్నత సంస్థగా మార్చడంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అందించిన కృషిని అభినందించారు. అంతర్జాతీయీకరణ ప్రయత్నాలను పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలతో అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు మరియు అధ్యాపకులు సాధించిన విజయాల పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
 
"విశ్వవిద్యాలయం 1977 నుండి 2022 వరకు ప్రదానం చేసిన డిగ్రీలకు సంబంధించిన మొత్తం 36270 రికార్డులను డిజిలాకర్ సిస్టమ్‌కు అప్‌లోడ్ చేసింది, ఇది స్వయంగా ఒక రికార్డు" అని ఆయన తెలిపారు.
 
ప్రతి సంవత్సరం ఉన్నత స్థాయికి చేరుకుంటున్న హైదరాబాద్ విశ్వవిద్యాలయం మొత్తం సోదర వర్గాన్ని జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి అభినందించారు.
 
ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రసంగంలో..కాన్వకేషన్ అనేది నేర్చుకోవడం నుండి అభ్యాసం వరకు ట్రాక్‌ను మార్చే ఒక ప్రధాన మైలురాయి అని అన్నారు. భారతదేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో విశ్వవిద్యాలయం అత్యుత్తమ కేంద్రంగా ఆవిర్భవించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. “భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్నప్పుడు యూఓహెచ్‌(యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్) మన విజ్ఞాన ఆధారిత సమాజంలో ప్రధాన కేంద్రాలలో ఒకటిగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. మన విద్యార్థులు తమ విద్యను మరింత అర్థవంతంగా మరియు ఉద్దేశపూర్వకంగా చేయడానికి సమాజానికి తిరిగి ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను" అని ఆయన చెప్పారు.

శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ భారతదేశం ఆర్థిక సూపర్ పవర్ మరియు విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకత సహాయపడుతుందని అన్నారు. విద్యను మరింత అర్థవంతం చేయడానికి మరియు సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు.

ఆయన ఓ సారూప్యతను వివరిస్తూ "హైదరాబాద్‌ను అలంకార ముత్యాల నగరంగా పిలుస్తారు, మరియు హైదరాబాద్ విశ్వవిద్యాలయం మేధో ముత్యం" అని వ్యాఖ్యానించారు.
 
"జీవితంలో విజయం సాధించాలంటే మూడు మంత్రాలు మాత్రమే ఉన్నాయి - హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ మరియు హార్డ్ వర్క్" అని డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నొక్కి చెప్పారు. స్వామి వివేకానంద సూచించిన విధంగా పరిశోధనలను వారి జీవితంలో ఒక భాగం చేసుకోవాలని మరియు వారి అంతర్గత బలాలపై దృష్టి పెట్టాలని ఆమె విద్యార్థులకు తెలిపారు.
 
ఛాన్సలర్ డిగ్రీ రికార్డుపై సంతకం చేసి కాన్వొకేషన్ పూర్తయినట్టు ప్రకటించారు.

***


(Release ID: 1864197) Visitor Counter : 105
Read this release in: English