విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ)
నాడు పోస్టు చేయడమైనది:
26 SEP 2022 6:00PM by PIB Hyderabad
1. పాస్‌పోర్ట్ సంబంధిత సేవలు పొందడంలో పౌరుల అనుభవం మెరుగు దిశగా మరొక సానుకూల చర్య చేపట్టినట్లు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) కోసం డిమాండ్ అనూహ్యంగా పెరిగిన దృష్ట్యా 2022 సెప్టెంబర్ 28 నుంచి దేశవ్యాప్తంగాగల ఆన్‌లైన్ పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (పీఓపీఎస్‌కె)లో ఇందుకోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది. ఈ చర్యతో ‘పీసీసీ’ కోసం అపాయింట్‌మెంట్ స్లాట్ల లభ్యత పెరిగి, మరింత త్వరగా పని పూర్తయ్యే అవకాశం లభిస్తుందని పేర్కొంది.
2. పీసీసీ దరఖాస్తు సదుపాయాన్ని ‘పీఓపీఎస్‌కె’లకు విస్తరించడంవల్ల విదేశాలలో ఉపాధిని కోరుకునే భారత పౌరులకు తోడ్పాటు లభిస్తుంది. అంతేకాకుండా విద్య, దీర్ఘకాలిక వీసా, వలస వగైరాల కోసం ‘పీసీసీ’లకుగల డిమాండ్ కూడా తీరుతుంది.
***
(రిలీజ్ ఐడి: 1862316)
సందర్శకుల సూచీ సంఖ్య : : 170