నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

అధికప్రభావశీలత కలిగిన సౌర ఫోటోవోల్టాయిక్  మాడ్యూల్స్ లో గీగా వాట్ (జిడబ్ల్యు) స్థాయి తయారీసామర్థ్యాన్ని సాధించడం కోసం ‘నేశనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిశన్సి సోలర్ పివిమాడ్యూల్స్’ లో ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపినమంత్రిమండలి 

Posted On: 21 SEP 2022 3:46PM by PIB Hyderabad

అధిక ప్రభావశీలత కలిగిన సౌర ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ లో గీగా వాట్ (జిడబ్ల్యు) స్థాయి తయారీ సామర్థ్యాన్ని సాధించడం కోసం ‘నేశనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిశన్సి సోలర్ పివి మాడ్యూల్స్’ లో ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకం (2వ విడత) ను 19,500 కోట్ల రూపాయల ఖర్చు తో అమలు చేసేందుకు నూతన మరియు నవీకరణయోగ్య శక్తి మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

భారతదేశం లో అధిక ప్రభావశీలత్వం కలిగిన సౌర ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీ కి అనువైనటువంటి ఒక ఇకోసిస్టమ్ ను నిర్మించడం, దీని ద్వారా నవీకరణ యోగ్య శక్తి రంగం లో దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం ‘నేశనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిశన్సి సోలర్ పివి మాడ్యూల్స్’ లక్ష్యం గా ఉంది. ఇది ఆత్మనిర్భర్ భఆరత్ కార్యక్రమాన్ని బలపరచడం తో పాటు గా ఉపాధి అవకాశాల ను కల్పిస్తుంది.

ఒక పారదర్శక ఎంపిక ప్రక్రియ మాధ్యమం ద్వారా సౌర ఫొటోవోల్టాయిక్ తయారీదారు సంస్థల ను ఎంపిక చేయడం జరుగుతుంది. ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ) ని సోలర్ పివి తయారీ ప్లాంటు లు పనిచేయించడం ప్రారంభం అయిన తరువాత 5 సంవత్సరాల కాలానికి గాను వితరణ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రోత్సాహకాన్ని దేశీయ బజారు లో అధిక ప్రభావశీలత్వం కలిగిన సౌర ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ అమ్మకాల ను బట్టి ఇవ్వడం జరుగుతుంది.

ఈ పథకం నుండి ఆశిస్తున్నటువంటి ఫలితాలు/లాభాలు ఈ కింది విధం గా ఉండగలవు:

  1. పూర్తి గా మరియు పాక్షికం గా ఏకీకరించిన, సౌర ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తాలూకు ఇంచుమించు 65,000 మెగావాట్ వార్షిక ఉత్పాదన సామర్థ్యం యొక్క స్థాపన కు అవకాశం ఉంటుందని అంచనా వేయడమైంది.
  2. ఈ పథకం దాదాపు గా 94,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పెట్టుబడి ని తీసుకువస్తుంది.
  3. ఇవిఎ, సోలర్ గ్లాస్, బ్యాక్ శీట్ వగైరా శేష సామగ్రి కోసం తయారీ సామర్థ్యాన్ని ఏర్పరచడం.
  4. సుమారు 1,95,000 మందికి ప్రత్యక్ష ఉపాధికల్పన మరియు 7,80,000 మంది కి పరోక్ష ఉపాధికల్పన.
  5. దాదాపు గా 1.37 లక్షల కోట్ల రూపాయల మేరకు దిగుమతుల కు ప్రత్యామ్నాయం లభించడం.
  6. సౌర ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ లో అధికతమ ప్రభావశీలత ను సాధించడం కోసం పరిశోధన కు మరియు అభివృద్ధికి ఊతం లభించడం.

 

***



(Release ID: 1861245) Visitor Counter : 112