భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

ఇంజినీరింగ్, సైన్స్ & టెక్నాలజీలో మహిళలు (వెస్ట్): నూతన I-STEM చొరవ ప్రారంభం

Posted On: 06 SEP 2022 6:19PM by PIB Hyderabad

 

ఉమెన్ ఇన్ ఇంజినీరింగ్సైన్స్ &టెక్నాలజీ (WEST), నూతన I-STEM (ఇండియన్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ సౌకర్యాల మ్యాప్) "ఉమెన్ ఇన్ ఇంజినీరింగ్సైన్స్ మరియు టెక్నాలజీ (వెస్ట్)" అనే కార్యక్రమాన్ని డా. పర్వీందర్ మైనిసైంటిఫిక్ సెక్రటరీ, భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం 5 సెప్టెంబర్ 2022న ప్రారంభించారు. ఈ వెస్ట్ కార్యక్రమం స్టెమ్ నేపథ్యం ఉన్న మహిళలను సైన్స్టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు సహకరించడానికి వారికి అధికారం ఇస్తుంది. I-STEM అనేది పరిశోధనా పరికరాలు/సదుపాయాలను పంచుకోవడానికి ఒక జాతీయ వెబ్ పోర్టల్. దీని కింద పరిశోధనాభివృద్ధిలో సహకారాన్ని ప్రోత్సహించడానికి, విద్యారంగం మరియు పరిశ్రమల మధ్య మరియు ముఖ్యంగా అంకుర సంస్థల మధ్య సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ వెస్ట్ చొరవ ద్వారా, I-STEM సైన్స్ & ఇంజనీరింగ్ యొక్క సరిహద్దు ప్రాంతాలలో ప్రాథమిక లేదా అనువర్తిత శాస్త్రాలలో పరిశోధనను కొనసాగించడానికి శాస్త్రీయత వైపు మొగ్గు చూపే మహిళా పరిశోధకులుశాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులకు ప్రత్యేక వేదికను అందిస్తుంది. మహిళలు WEST ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. వివిధ డొమైన్‌లలో వాటాదారులుగా మారడానికి మరియు వివిధ స్థాయిలలో పరిశోధనాభివృద్ధిలో తమ వృత్తిని కొనసాగించడానికి సాంకేతిక నిపుణులుశాస్త్రవేత్తలు మరియు వ్యవస్థాపకులుగా అవకాశాలను అన్వేషించవచ్చు. శాస్త్రీయ పరికరాలను వాడటం, నిర్వహించడంరూపకల్పన మరియు తయారీ వరకు అవకాశాలు ఉంటాయి.

వెస్ట్ కార్యక్రమం కింద స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు సైన్స్ & టెక్నాలజీ నేపథ్యం ఉన్న మహిళలకు వారి సామర్థ్యాలను పెంచుకోవడానికి, ల్యాబ్ టెక్నీషియన్‌లు మరియు మెయింటెనెన్స్ ఇంజనీర్లుగా "ఫీల్డ్‌లో" నిమగ్నమైదేశంలోని పరిశోధనాభివృద్ధి, మౌలిక సదుపాయాలలో కీలకమైన ఖాళీలను పూరించడానికి శిక్షణను అందిస్తాయి. కెరీర్ విరామం తర్వాత మహిళలను తిరిగి సైన్స్ & టెక్నాలజీ డొమైన్‌లలోకి తీసుకురావడానికి కూడా ఈ చొరవ సహాయపడుతుంది.

ఈ అనుభవంతోమహిళలు I-STEM ప్లాట్‌ఫారమ్ ద్వారా అధునాతన పరికరాలు/పరికరాల నిర్వహణ కోసం కన్సల్టెంట్‌లుగా పనిచేయడానికి వ్యవస్థాపకులుగా మారవచ్చు. ఇది "నైపుణ్యాల అంతరాన్ని" పూరించడానికి మరియు పబ్లిక్‌గా నిధులు సమకూర్చే పరికరాలను సద్వినియోగం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.

వెస్ట్ చొరవ కింద, I-STEM ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు సైన్స్ & టెక్నాలజీ స్టార్టప్‌లకు అందిస్తున్న ప్రస్తుత మద్దతు మెరుగుపరచబడుతుంది. I-STEM పోర్టల్ ద్వారా లభించే పరిశోధనాభివృద్ధి సౌకర్యాలు మరియు ఆర్&డీ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌ల (COMSOL, MATLAB, LABVIEW, AUTOCAD) యాక్సెస్ చేయడం, సైన్స్ & టెక్నాలజీ లో మహిళా పారిశ్రామికవేత్తలకు బలమైన మద్దతు నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తుంది.

I-STEM మహిళా పరిశోధకులకు సైన్స్టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌లలో పురోగతి ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంపై విజయాలనుసమస్యలను, ఆలోచనల మార్పిడి కోసం ఒక వేదికను అందిస్తుంది. అదనంగా, I-STEM వాట్సప్, టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్ చర్చ మరియు తక్షణ మద్దతు కోసం క్విక్‌లీ కనెక్ట్” అనే డిజిటల్ కన్సార్టియం కూడా స్థాపించబడింది.

వెస్ట్ చొరవను విజయవంతంగా అమలు చేసేందుకు అంకితమైన మహిళల బృందం పని చేస్తుంది.

ప్రారంభోత్సవం సందర్భంగా, I-STEM చేపడుతున్న వెస్ట్ చొరవను డాక్టర్ మైనీ ప్రశంసించారు. సైన్స్ & టెక్నాలజీ లో మహిళలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. WEST మరియు I-STEMలలో మహిళల విస్తృత భాగస్వామ్యాన్ని పెంచడానికి అభిప్రాయాన్ని పొందడం, వివిధ దశల ఏర్పాటు ద్వారా ఈ కార్యక్రమ ప్రభావాన్ని పర్యవేక్షించాలని ఆమె I-STEMకి సలహా ఇచ్చారు.

డాక్టర్ వర్తికా శుక్లాసీఎండీఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్డాక్టర్ సునీతా మిశ్రాసీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (CSIO, CSIR); మరియు Dr. సంగీతా సెమ్వాల్శాస్త్రవేత్తఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), భారత ప్రభుత్వం ఈ వేదికను ప్రారంభించినందుకు బృందాన్ని అభినందించారు. I-STEMలో మహిళలు ఎక్కువగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ఇక్కడ చూడండి: https://www.istem.gov.in/latest-info/videos.

*******

 


(Release ID: 1857372) Visitor Counter : 214


Read this release in: English , Urdu , Hindi