కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

నేటితో ముగిసిన తిరుపతి- రెండు రోజుల జాతీయ కార్మిక సదస్సు


ESIC మెరుగైన సేవల విస్తరణ, మెరుగుదల కోసం కేంద్రం చొరవ తీసుకుంటుంది: శ్రీ భూపేందర్ యాదవ్

'స్వస్త్య సే సమృద్ధి' అనే ప్రధానమంత్రి దార్శనికతని నెరవేర్చడంలో సహాయం చేస్తుంది: కేంద్ర మంత్రి

Posted On: 26 AUG 2022 6:44PM by PIB Hyderabad

 తిరుపతి, ఆగస్టు 26, 2022

వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసంతో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో గురువారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ కార్మిక సదస్సు ఈరోజు ముగిసింది.

కార్మికులకు సామాజిక రక్షణను సార్వత్రికీకరించడానికి  అందరికీ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకాలను అందుబాటులో ఉంచడానికి -శ్రమ్ పోర్టల్ను ఏకీకృతం చేయడంపై  సదస్సు నాలుగు నేపథ్య సెషన్లలో విస్తరించింది. 

శ్రీ భూపేందర్ యాదవ్, తన ముగింపు ప్రసంగంలో ఉద్యోగుల రాష్ర భీమా   సర్వీస్ డెలివరీ మెకానిజంలో విస్తరణ  మెరుగుదల కోసం కేంద్రం కార్యక్రమాలను తెలియజేశారుశ్రమ యోగులు  వారిపై ఆధారపడిన వారందరికీ ప్రయోజనం చేకూర్చే విధానం  అమలు మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా 'స్వస్త్య సే సమృద్ధి' ప్రధానమంత్రి ఆలోచనని నెరవేర్చడంలో ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) సమ్మతి, అమలు కోసం ESI హాస్పిటల్స్ సమయానుకూలంగా పని చేయవలసిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

మీడియాతో అనధికారిక మాటామంతీ సందర్భంగా, కేంద్ర మంత్రి మాట్లాడుతూ, తాజా సాంకేతిక పురోగతులు  భవిష్యత్ లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకొని కొత్త డిస్పెన్సరీలు  ఆసుపత్రుల మంజూరు కోసం నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉంది అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈఎస్ ఆసుపత్రుల ద్వారా వైద్య సంరక్షణ  సేవలను మెరుగుపరచడం  ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY)తో అనుసంధానం చేయడం కోసం స్వాస్థ్య సే సమృద్ధి లక్ష్యమని ఆయన అన్నారు.

అనుమతులు, రిజిస్ట్రేషన్, రిటర్న్స్, తనిఖీలు మొదలైన వాటి కోసం పోర్టల్ అభివృద్ధితో పాటు నాలుగు లేబర్ కోడ్లు  అమలు కోసం విధివిధానాల రూపకల్పన కోసం విజన్ శ్రమేవ్ జయతే@2047పై ప్రత్యేక సెషన్ జరిగిందని ఆయన అన్నారు.

దేశంలోని మొత్తం 744 జిల్లాల్లో ESI తన సేవలను విస్తరించేందుకు కృషి చేస్తుందని,  విస్తరణ సామాజిక భద్రతా కోడ్ అమలు తర్వాత పెరిగిన లబ్ధిదారుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.

దేశంలోని అన్ని జిల్లాల్లో (PMJAY అమలు చేసిన) PMJAYతో కలయిక వల్ల పాన్-ఇండియా పోర్టబిలిటీకి దారితీసే లబ్దిదారులకు మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చని ఆయన తెలిపారు.

రెండు రోజుల సదస్సులో వివిధ రాష్ట్రాలు  కేంద్రపాలిత ప్రాంతాల కార్యక్రమాలను అనుసరించి ప్రదర్శనలు జరిగాయి.

కేంద్ర కార్మిక, ఉపాధి  పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అధ్యక్షతన, కేంద్ర కార్మిక ఉపాధి, పెట్రోలియం, సహజ వాయువు  సహ-అధ్యక్షుడు శ్రీ రామేశ్వర్ తేలి ఉపాధ్యక్షుడు శ్రీ సునీల్ బర్త్వాల్, సెక్రటరీ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్  సభ్య కార్యదర్శి శ్రీమతి నీలం షామీరావు తో పాటు 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రులు  కార్యదర్శులతో సెంట్రల్ భవిష్య నిధి  కమిషనర్ విస్తృతమైన చర్చలు జరిపారు,

  కార్యక్రమంలో విజన్ డాక్యుమెంట్ 2047”తో కార్మిక వర్గానికి ప్రయోజనం చేకూర్చే కార్మిక చట్టాలు,  చట్టాల స్పెక్ట్రమ్ను విలీనం చేయడం,  ఉపసంహరించుకోవడం కోసం ఆరోగ్యకరమైన ఏకాభిప్రాయం కలిగింది.



https://twitter.com/i/events/1562675763127926784?s=20

***



(Release ID: 1854771) Visitor Counter : 122


Read this release in: English