మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చిత్తూరులోని శ్రీ సిటీని సందర్శించిన కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్


ఆంధ్రప్రదేశ్,తెలంగాణల్లోని ఉన్నతవిద్యాసంస్థల ఉపకులపతులు, సీనియర్ అధికారులతో నూతన జాతీయ విద్యావిధానం - 2020పై సమీక్ష

శనివారం ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న కేంద్ర సహాయ మంత్రి

Posted On: 26 AUG 2022 6:52PM by PIB Hyderabad

శ్రీ సిటీ, ఆగస్టు 26, 2022

రెండ్రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తం కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ శ్రీ సిటీకి విచ్చేశారు.  సందర్భంగా ఆయన శుక్రవారం నాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్ సహా వివిధ ఉన్నత విద్యాసంస్థల ఉపకులపతులు, సంచాలకులతో నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020) పై సమీక్ష నిర్వహించారు

శనివారం శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొననున్నారు సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

 అంతకుముందుకు, శుక్రవారం ఉదయం శ్రీ సిటీ చేరుకున్న కేంద్ర మంత్రి డాక్టర్ సుభాష్ కు శ్రీ సిటీ ప్రెసిడెంట్ శ్రీ సతీశ్ కామత్ స్వాగతం పలికారు.  సందర్భంగా శ్రీ సిటీ పారిశ్రామిక ప్రగతిని ఆయనకు వివరించారు

శ్రీ సిటీలోని మౌలికవసతులుపారిశ్రామిక అనుకూల వాతావరణం తదితర అంశాలను పరిశీలించిన మంత్రిఅంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ముందుకెళ్తున్నారంటూ శ్రీ సిటీ ఉన్నతాధికారులను అభినందించారు

వివిధ పెట్టుబడి అవకాశాలకు పరిపూర్ణమైన పరిష్కాలతో సమగ్రమైన వ్యాపార వ్యవస్థ ఏర్పాటుచేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.  పారిశ్రామిక కేంద్రంలో రెండు ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటుచేయడాన్ని ఆయన  ప్రశంసించారు.  

పారిశ్రామిక పార్కును సందర్శన సందర్భంగా ఫోక్సోన్ గ్రూప్ వారి భారత్ ఎఫ్ఐహెచ్ యూనిట్ల ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం క్రియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో సంభాషించారు.

 







***


(Release ID: 1854721) Visitor Counter : 173


Read this release in: English