ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశ జాతీయ ఆరోగ్య బీమా పథకంలో (ఏబీ-పీఎంజేఏవై) మోసాల నియంత్రణకు వ్యవస్థ
- నేషనల్ యాంటీ-ఫ్రాడ్ యూనిట్ (ఎన్ఏఎఫ్‌యు) రాష్ట్ర స్థాయిలో స్టేట్ యాంటీ-ఫ్రాడ్ యూనిట్ల (ఎస్‌ఏఏఫ్‌యులు) ద్వారా మద్దతు పొందిన మోసాల నియంత్రణ వ్యవస్థ (యాంటీ-ఫ్రాడ్ ఫ్రేమ్‌వర్క్) పర్యవేక్షణ మరియు అమలు కోసం ఎన్‌హెచ్ఏ సృష్టించబడింది.
- కృత్రిమ మేథస్సు మరియు మెషిన్ లెర్నింగ్ యొక్క ఉపయోగంతో మోసాన్ని ప్రో-యాక్టివ్‌గా గుర్తించడానికి, దానిక తగిన విధంగా అల్గారిథమ్‌ల అభివృద్ధికి సమగ్ర మోసం విశ్లేషణల పరిష్కార వ్యవస్థ తయారు చేయబడింది.
Posted On:
02 AUG 2022 4:55PM by PIB Hyderabad
ఆయుష్మాన్ భారత్ -ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) పథకంలో ఏ విధమైన మోసం జరిగకుండా జీరో-టాలరెన్స్ విధానంలో నిర్వహించబడుతుంది. ఇందులో అనుమానితుడు/ నిజమైన వైద్య చికిత్స క్లెయిమ్‌లు, వేషధారణ, చికిత్స ప్యాకేజీలు/విధానాల అప్-కోడింగ్ మొదలైనవి ఏర్పాటు చేయడమైనది. మోసం మరియు దుర్వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండేలా భారత ప్రభుత్వం అనుకూలమైన విధానాన్ని అవలంబిస్తుంది. వివిధ రకాల మోసాలను గుర్తించి పరిష్కరించడానికి పీఎం-జేఏవై కింద అనేక కౌంటర్‌వైలింగ్ వ్యూహాలు ఉపయోగించబడ్డాయి. ఈ పథకం కింద అమలు చేయబడిన ఏఐ- ఆధారిత సాంకేతికతలతో మోసాలను ఇది గుర్తిస్తుంది. నేషనల్ హెల్త్ అథారిటీ -ఏబీ-పీఎంజేఏవై అమలు చేసే ఏజెన్సీ, మోసాల నిరోధక మార్గదర్శకాల సమగ్ర సెట్‌ను విడుదల చేసింది. రాష్ట్రాలు/ యూటీలకు యాంటీ-ఫ్రాడ్ అడ్వైజరీలు జారీ చేయబడినాయి. నేషనల్ యాంటీ-ఫ్రాడ్ యూనిట్ (ఎన్ఏఎఫ్‌యు) రాష్ట్ర స్థాయిలో స్టేట్ యాంటీ-ఫ్రాడ్ యూనిట్ల (ఎస్‌ఏఏఫ్‌యుల) మద్దతుతో యాంటీ-ఫ్రాడ్ ఫ్రేమ్‌వర్క్ యొక్క మొత్తం పర్యవేక్షణ మరియు అమలు కోసం ఎన్‌హెచ్ఏ ఏర్పాటు చేయబడింది. ఇందులో అన్ని రకాల క్లెయిమ్‌లకు ఆమోదం, చెల్లింపుకు ముందు బెడ్‌పై ఉన్న రోగి ఫోటోతో పాటు తప్పనిసరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్‌లు అవసరం. అడ్మిషన్ మరియు డిశ్చార్జ్ సమయంలో లబ్ధిదారుని ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానాన్ని అన్ని రకాల ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రారంభించబడింది. కృత్రిమ మేథస్సు మరియు మెషిన్ లెర్నింగ్ యొక్క ఉపయోగించి మోసాన్ని ప్రో-యాక్టివ్‌గా గుర్తించడానికి సమగ్ర మోసాలకు విశ్లేషణాత్మకంగా పరిష్కారం కోసం రూపొందించబడింది, అనుమానిత లావాదేవీలు మరియు ఎంటీటీలను గుర్తించడానికి మరియు ఆసుపత్రులు మరియు క్లెయిమ్‌ల రిస్క్ స్కోరింగ్‌ని గుర్తించడానికి పెద్ద మొత్తంలో డేటాను ఉపయోగించే అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయబడింది. పథకం కింద మొత్తం అధీకృత ఆసుపత్రిలో చేరిన వారిలో దాదాపు 0.18% ప్రారంభంలో నుండి మోసపూరితమైనవిగా నిర్ధారించబడింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు.
***
(Release ID: 1847616)