యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆజాద్ కా అమృత మహోత్సవం భాగంగా తిరుపతిలో నిర్వహిస్తున్న చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, క్రీడ, యువజన సర్వీసుల శాఖ మాత్యులు శ్రీమతి ఆర్కే రోజా


తిరుప‌తి జిల్లాకు ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే రావడం గర్వకారణం

చెస్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది

Posted On: 23 JUL 2022 1:07PM by PIB Hyderabad

తిరుపతి, తేది.23.07.2022

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మన దేశంలోని 75 ప్రదేశాలలో చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే నిర్వహిస్తు కార్యక్రమం లో భాగంగా ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేని తిరుపతి నగరంలో నిర్వహించారు. కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీమతి ఆర్. కె. రోజా పాల్గొన్నారు. సందర్భంగా చెస్ టార్చ్ ని ప్రదర్శించి చెస్ ప్లేయర్స్ కి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ తిరుపతి జిల్లాకు చెందిన తాను క్రీడా శాఖ మంత్రిగా ఉన్న యంలో తిరుపతి జిల్లాకు ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ రిలే రావడం గర్వకారణని, ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

చదరంగంలో మన రాష్ట్రం నుంచి గొప్ప గొప్ప క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారని మంత్రి అన్నారు. విజయవాడకు చెందిన గ్రాండ్ మాష్టర్, అర్జున అవార్డు గ్రహీత...కోనేరు హంపి రాష్ట్రం పునే కాకుండా, దేశం తరపున ప్రాతినిథ్యం హించి ఎన్నో టోర్నమెంట్ లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో గెలిచి తెలుగువాళ్ల సత్తా చాటిచెప్పారన్నారు. అదేవిధంగా రాష్ట్రానికే చెందినగ్రాండ్ మాష్టర్ ముసునూరి రోహిత్ లలిత్ బాబు, గ్రాండ్ మాష్టర్ పెంటేల హరిక్రిష్ణ, గ్రాండ్ మాష్టర్ అర్జున అవార్డ్ గ్రహీత ద్రోణవల్లి హారిక, గ్రాండ్ మాష్టర్ కార్తీక్ వెంకట్ రామణ్ సైతం దేశం పున దేశ విదేశాల్లో విశేషమైన ప్రతిభను కనబరిచారన్నారు. రాష్ట్రంలోని చెస్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. మహాబలిపురంలో నిర్వహించబోతున్న చెస్ ఒలింపియాడ్ లో మన దేశానికి చెందిన క్రీడాకారులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన గ్రాండ్ మాష్టర్ లు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ కు మొట్ట మొదటిసారిగా భార దేశం ఆతిథ్యం ఇస్తోంది. ఈనెల 29 తేదీ నుంచి ఆగష్టు 9 వరకు తమిళనాడులోని మహాబలిపురంలో నిర్వహిస్తున్నఈ చెస్ ఒలింపియాడ్ లో భాగంగా ఒలింపిక్ జ్యోతిని ఈరోజు తిరుపతికి తీసుకురావడం రిగింది. గౌర ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 19 దీనిని ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 40 జిల్లాల్లో జ్యోతిని ప్రదర్శిస్తున్నారు. మహాబలిపురంలో జరిగే చెస్ ఒలింపియాడ్ లో సుమారు 187 దేశాలకు సంబంధించిన చెస్ క్రీడాకారులు పాల్గొంటున్నారు

కార్యక్రమం లో గ్రాండ్ మాస్టర్ శ్రీ అకాష్, టీటీడీ చైర్మన్ శ్రీ. వై వీ సుబ్బా రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీమతి వాణీ మోహన్ IAS, శాప్ MD శ్రీ. ప్రభాకర్ రెడ్డి IAS , బాలాజీ జిల్లా కలెక్టర్ శ్రీ. వెంకట్రామ్ రెడ్డి IAS, తిరుపతి మునిసిపల్ కమీషనర్ శ్రీ. అనుపమ, చెస్ ఓలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు దితరులు పాల్గొన్నారు.






***


(Release ID: 1844147) Visitor Counter : 191