సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
లంచం కేసులో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారిని, మరో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను అరెస్టు చేసిన సిబిఐ, శోధనల సమయంలో రూ.1.86 కోట్ల (సుమారు.) స్వాధీనం.
Posted On:
16 JUL 2022 10:15PM by PIB Hyderabad
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ & స్టోరేజ్ డిపార్ట్‌మెంట్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం), విశాఖపట్నం తో పాటు విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ రీజినల్ మేనేజర్‌తో సహా ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను లంచం తీసుకుంటుండగా కేంద్ర నేర పరిశోధన సంస్థ సిబిఐ అరెస్టు చేసింది.
విశాఖపట్నం లోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ & స్టోరేజ్ డిపార్ట్‌మెంట్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం), తో పాటు విశాఖపట్నంకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ రీజినల్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, విశాఖపట్నం, డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ & స్టోరేజ్ డిపార్ట్‌మెంట్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం) ఫైటోసానిటరీ సర్టిఫికేట్‌ల జారీ కోసం CHAలు, ఫ్యూమిగేటర్లు, షిప్పింగ్ ఏజెంట్ల నుండి వస్తువులను ఎగుమతి చేయడం, దిగుమతి చేసుకున్న సరుకుల కోసం సరుకుల విడుదల ఆర్డర్‌ల విషయంలో భారీ మొత్తంలో లంచాలు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తును క్లియర్ చేసినందుకు, వ్యవసాయ వస్తువుల దిగుమతి/ఎగుమతి సరుకులను విడుదల చేయడానికి కస్టమ్స్ కు అనుకూలమైన ధృవీకరణ పత్రాన్ని జారీ చేసినందుకు విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కంపెనీ ప్రాంతీయ మేనేజర్ నుండి ప్రభుత్వోద్యోగి అక్రమ ఆదాయాన్ని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి.
విశాఖపట్నంలోని ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ కంపెనీ రీజనల్ మేనేజర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుని, లంచంగా తీసుకున్న రూ. 6000/-.ను స్వాధీనం చేసుకున్నారు
విశాఖపట్నం, కాకినాడ, రూర్కీ (ఉత్తరాఖండ్)లో నిందితులు, వారి సహచరుల, ఇతరుల ఇళ్లలో సోదాలు జరిగాయి. రూ.1,29,63,450/- (సుమారు.) కు పైబడిన నగదు ప్రభుత్వాధికారి నివాస ప్రాంగణంలో రూ. 56,86,000/- (సుమారు.) సదరు అధికారికి చెందినట్లుగా ఆరోపిస్తూ ఇతర ప్రాంగణాల నుండి మరికొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని నేరారోపణ పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులందరినీ ఈరోజు విశాఖపట్నంలోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
****
(Release ID: 1842084)
Visitor Counter : 125