కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఘనంగా సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ మొదటి బ్యాచ్ వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం


ఈఎస్ఐసీ ఆసుపత్రుల ఆధునికీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

రాష్ట్రంలో రామచంద్రపురం మరియు నాచారంలో మరో రెండు ఈఎస్ఐసీ ఆసుపత్రులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి : కేంద్ర కార్మిక,ఉపాధి మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్

మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఈఎస్ఐ ఆస్పత్రి, కళాశాల అందించిన నిస్వార్థ సేవను ప్రశంసించిన కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి

Posted On: 18 JUN 2022 4:38PM by PIB Hyderabad

సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల మొదటి  స్నాతకోత్సవం ఈరోజు నగరంలో జరిగింది. కేంద్ర  కార్మికఉపాధిపర్యావరణంఅటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ కేంద్ర  ఈశాన్య ప్రాంత సంస్కృతిపర్యాటకం మరియు అభివృద్ధి శాఖ మంత్రి   శ్రీ జి. కిషన్ రెడ్డి కేంద్ర కార్మిక ఉపాధి మరియు పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి   శ్రీ రామేశ్వర్ తెలీ కార్యక్రమంలో  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.   ఎంబీబీస్  వైద్యులుగా పట్టభద్రులైన దాదాపు 100 మంది విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్‌ విద్యార్థులను మంత్రులు అభినందించారు.

కళాశాలలోని  ఎంబీబీస్   గ్రాడ్యుయేట్ల మొదటి బ్యాచ్ (2016-2017) విద్యార్థులకు  మెరిట్ అవార్డులు  ప్రదానం చేశారు. కళాశాల  డాక్టర్ ఎన్. కృష్ణ శ్రీ (బంగారు పతకాలు)డాక్టర్ ఎం. లక్ష్మీ లాస్య (బంగారు పతకాలు)డాక్టర్ అన్నపూర్ణ. కె (బంగారు పతకాలు), డాక్టర్ పివిఎస్ లలిత సాయి శ్రీ (బంగారు పతకాలు)అత్యధిక అవార్డులు పొందారు.  సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ శ్రీనివాస్.ఎం పట్టభద్రులైన విద్యార్థుల తో ప్రమాణం చేయించారు.

పట్టభద్రులైన యువ వైద్యులను  శ్రీ భూపేందర్‌ యాదవ్‌ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వైద్య సేవల  ద్వారా  సమాజానికి ఉత్తమమైన సేవ  అందించవచ్చునని అన్నారు.  'శ్రమ యోగులశ్రేయస్సును అందించే అవకాశం తమకు లభించిందని  గుర్తుంచుకొని  వారి అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అన్ని  ఈఎస్ఐసీ   ఆసుపత్రుల ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. దీనిలో భాగంగా  హైదరాబాద్‌లోని  ఈఎస్ఐసీ లో   కొత్త క్యాథ్‌లాబ్,  న్యూక్లియర్ మెడిసిన్ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామని   కేంద్ర కార్మికఉపాధి మంత్రి శాఖ తెలిపారు. రామగుండంశంషాబాద్సంగారెడ్డి లో 100 పడకల ఆసుపత్రులు నిర్మించేందుకు స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని మంత్రి తెలిపారు.

పారామెడికల్  వంటి రంగాల  కోసం నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందించేందుకు  ఈఎస్ఐసీలో ప్రత్యేక  కోర్సులను తొలిసారి  ప్రారంభిస్తున్నట్లు కేంద్ర కార్మిక  ఉపాధి మంత్రి వెల్లడించారు. దీర్ఘకాలిక ఉన్న సిబ్బంది  కొరతను అధిగమించేందుకు 8 నెలల స్వల్ప వ్యవధిలో 6400 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. దీనిలో  2000 మందికి పైగా వైద్యులు మరియు బోధన అధ్యాపకుల పోస్టులను కూడా భర్తీ చేస్తామని  ఆయన తెలిపారు. ఇ-శ్రమ్ పోర్టల్‌లో 28 కోట్ల మంది కార్మికులను నమోదు అయినట్లు  మంత్రి తెలిపారు.  నిర్మాణ ప్రాజెక్టులు మరియు ఖాళీల పర్యవేక్షణ కోసం మరిన్ని పోర్టల్‌లను ప్రారంభించామని  మంత్రి తెలిపారు. 

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ ఆసుపత్రి సిబ్బంది అంకితభావం,అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవల పట్ల స్థానిక ఎంపీ కూడా అయిన కేంద్రమంత్రి శ్రీ కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గతంలో తాను ఆసుపత్రిని సందర్శించిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు.  కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇఎస్‌ఐసి లబ్ధిదారులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఇఎస్‌ఐసి ఆసుపత్రి నిస్వార్థ సేవలను అందించిందని అన్నారు.

 

అంతకుముందుకేంద్ర పెట్రోలియం , సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి ఎమ్‌బిబిఎస్ గ్రాడ్యుయేట్  విద్యార్థులకు తన శుభాకాంక్షలు తెలిపారు.  స్వస్త్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం సాగుతున్న ప్రయత్నాలకు వైద్యులు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు.  

స్నాతకోత్సవంలో ఈఎస్‌ఐసీ డైరెక్టర్ జనరల్ శ్రీ ముఖ్మీత్ ఎస్ భాటియా, మెడికల్ కమిషనర్ (మెడికల్ ఎడ్యుకేషన్) డాక్టర్ అన్షు ఛబ్రా మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 ***



(Release ID: 1835081) Visitor Counter : 102


Read this release in: English