మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్త్రీ శిశు సంక్షేమానికి, అభివృద్ధికి గత 8 సంవత్సరాలుగా కేంద్రం అవిరళ కృషి చేస్తోంది -కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. మహేంద్రభాయ్ ముంజపరా


5 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు దాదాపు 12 లక్షల గ్రోత్ మానిటరింగ్ పరికరాలను, 11 లక్షలకు పైగా స్మార్ట్ఫోన్లను కేంద్రం పంపిణీ చేసింది దేశవ్యాప్తంగా అందుబాటులో 708 ‘వన్ స్టాప్ సెంటర్లు’

దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి - కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఇందేవర్ పాండే

విశాఖలో జరిగిన “ఆశావాహ జిల్లాలపై సౌత్ జోనల్ సమావేశం”

Posted On: 09 JUN 2022 6:55PM by PIB Hyderabad

విజయవాడ,

తేది. 09.06.2022

దేశంలోని మహిళలు మరియు పిల్లలను ప్రోత్సహించడం, రక్షించడంసాధికారత కల్పించడం కోసం 8 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా నిబద్ధతతో కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని కేంద్రమహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ హాయమంత్రి డా. మహేంద్రభాయ్ ముంజపరా అన్నారు.

ఈరోజు విశాఖపట్నంలో   ఆశావాహజిల్లాలపై సౌత్ జోనల్ మావేశం రిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర హాయమంత్రి  డాక్టర్ మహేంద్రభాయ్ ముంజపరా హాజయ్యారు. సందర్భంగా   ఆయ మాట్లాడుతూ కేంద్రమహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మహిళలు మరియు బాలికలను హింస మరియు వేధింపుల నుండి రక్షించడానికి అంకితభావంతో పని చేస్తోందన్నారుఅదే విధంగా నేరాలను నివేదించేందుకు అడ్డంకిగా ఉన్నఇబ్బందులను  సవాలు చేస్తూ  సురక్షితమైన సమాజాన్ని నిర్మించేందుకు కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు అధికారులు  సదస్సులో పాల్గొన్నారు.

2015 సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 708 ‘వన్ స్టాప్ సెంటర్లుఅందుబాటులోకి చ్చాయనిలింగ ఆధారిత హింస నుంచి బయటపడిన వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా 5.2 లక్షల మంది మహిళలకు వన్ స్టాప్ సెంటర్ ద్వారా మద్దతు లభించిందని ఆయన తెలిపారు.

కేంద్రం ఏర్పాటు చేసిన నిర్భయ నిధి 34 కొత్త ప్రాజెక్ట్లు/స్కీమ్ ఏర్పాటుకు మద్దతిచ్చిందని, మొత్తం  దాదాపు రూ. 10 వేల కోట్లకు చేరిందని మంత్రి అన్నారుహిళకు రక్షణ  భద్రతను పెంపొందించడంతో పాటుబహిరంగ ప్రదేశాలను సైతం వారికి సురక్షితమైనదిగా చేయడం నిధి ముఖ్యోద్దేశని ఆయ తెలిపారు.

ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు పోషకాహారం కేంద్ర బిందువుగా ఉంటుదన్న మంత్రి మానవ వనరుల అభివృద్ధి, ఉత్పాదకత పెరుగుదకు తోడ్పడుతుందని, ద్వారా  అంతిమంగా జాతీయ వృద్ధికి నేరుగా అనుసంధానం చెందుతుందనే వాస్తవాన్ని గ్రహించాలన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో  కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు దాదాపు 12 లక్షల గ్రోత్ మానిటరింగ్ పరికరాలను మరియు 11 లక్షలకు పైగా స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన‌ POSHAN ట్రాకర్ ద్వారా పాలనను మెరుగుపరచడంతో పాటు పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించడానికిమరియు చికిత్స చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగ డతాయని ఆయ అన్నారు.

 దేశవ్యాప్తంగా 12 లక్షలకుపైగా పక్కా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు ఉన్నాయని, 11 లక్షలకు పైగా కేంద్రాల్లో ఫంక్షనల్ టాయిలెట్లు ఉన్నాయని, మిగిలిన అన్ని అంగన్వాడీల్లో మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తో పాటు  ‘ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా  ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా మరియు ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన వంటి కాల ద్వారా మహిళల నేతృత్వంలోని కుటుంబాల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు.

ఒకే  గొడుగు కిందకు ప్రభుత్వ  లక్ష్యాలైన‌  పోషణ, శక్తి మరియు వాత్సల్య ను తీసుకురావడం ద్వారా  మహిళలు మరియు పిల్లల సాధికారత, భద్రత మరియు రక్షణకు భరోసా, సంపూర్ణ మరియు సమతుల్య పోషకాహారాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ కృషిని మంత్రి వివరించారు

కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ  కార్యర్శి  శ్రీ ఇందేవర్ పాండే మాట్లాడుతూ  దేశంలోని అన్ని ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధి జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు.

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశాలలో ఒకటైనందువల్ల, దేశం సుభిక్షంగా, ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందేందుకు అవమైన పోషకాహార అవరాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారుదేశంలోని పోషకాహార అవసరాలపై కేంద్రం ఎక్కువ దృష్టి పెట్టిందని అన్నారు. ' శిశువు దేశం యొక్క ఆస్తి' అని ఆయ వ్యాఖ్యానించారు. పోషన్ ట్రాకర్ను సరిగ్గా ఉపయోగించడం ద్వారా  పిల్లల ఆరోగ్య స్థితిని సులభంగా అంచనా వేయవచ్చన్నారుదేశవ్యాప్తంగా జిల్లాల వారీగా సరైన ఫీడ్ బ్యాక్ ను పొందేందుకు పోషన్ ట్రాకర్ ఎంతగానో ఉపయోగడుతుందని, ద్వారా  అంగన్వాడీ మరియు పంచాయతీ స్థాయిలలో అవసరాలు మరియు ఆకాంక్షలపై దృష్టి సారించేందుకు దోహ డుతుందని వివరించారు. పోషణ్అభియాన్అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి అంశాలపై మరింత దృష్టి సారించాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా విస్తరించిన అంగన్వాడీ నెట్వర్క్ద్వారా 0-6 ఏళ్లలోపు 54% మంది పిల్లలు కవర్ అవుతున్నారని ఆయన సూచించారు.

పట్టణ ప్రాంతాలలో, ప్రత్యేకించి, మురికివాడలు మరియు వెనుకబడిన ప్రాంతాలలో, 3-6 సంవత్సరాల మధ్య పిల్లల పౌష్టికాహారం మరియు విద్యా అవసరాలు సరిగ్గా పరిష్కరించబడాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని శ్రీ పాండే అన్నారు. విద్యతో పాటు పోషణ్ను విజయవంతంగా అమలు చేయడానికి మరింత అర్హత మరియు శిక్షణ పొందిన అంగన్వాడీలను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

కేంద్రం అమలు చేస్తున్నమిషన్ వాత్సల్య గురించి మాట్లాడుతూ  దత్తత విధానాలు మరియు జువెనైల్ జస్టిస్ నియమాల సవరణలను వివరించారు. మిషన్ శక్తి గురించి  మాట్లాడుతూ దేశం యొక్క ఉత్పాదకత మరియు వృద్ధి రేటును పెంపొందించేందుకు అధిక సంఖ్యలో మహిళల భాగస్వామ్య అవరాన్ని   వివరించారు.

విశాఖపట్నం గురించి మాట్లాడుతూ  పట్టణ రిసప్రాంతాలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ, జిల్లాలో అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అవి వెనుకబడి ఉన్న ప్రాంతాలు కావడం ల్ల రంలో ఆశావాహ జిల్లాల సదస్సు నిర్వహించాల్సిన అవసరం ఎంతైన ఉందని శ్రీ పాండే అన్నారు.

ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆశావాహజిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా మేజిస్ట్రేట్లు, వారి వారి జిల్లాల్లో  స్త్రీ మరియు శిశు సంక్షేమానికి, అభివృద్ధికి అమలు చేస్తున్న చర్యలను వివరించారు.

సమావేశంలో  నీతి ఆయోగ్  ఆశావాహజిల్లాల కార్యక్రమాల మిషన్ డైరెక్టర్శ్రీ రాకేష్ రంజన్, ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రస్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  శ్రీమతి. ఉషా శ్రీచరణ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి  శ్రీమతి. AR అనురాధ,  (WCD)  అదనపు కార్యదర్శి శ్రీమతి అదితి దాస్ రౌత్ , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దితరులు పాల్గొన్నారు.

***


(Release ID: 1832698) Visitor Counter : 228


Read this release in: English