ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ టీకాల లభ్యతపై తాజా సమాచారం
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 193.53 కోట్లకు పైగా డోసులు పంపిణీ
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో 14.93 కోట్లకు పైగా నిల్వలు
Posted On:
04 JUN 2022 9:24AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా కొవిడ్-19 టీకాల కార్యక్రమం వేగాన్ని మరింత పెంచి దేశవ్యాప్తంగా కార్యక్రమం పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమం గత ఏడాది జనవరి 16న ప్రారంభమైంది. కోవిడ్ టీకాల సార్వత్రికీకరణ నూతన దశ 2021 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాలను అందుబాటులోకి తెచ్చి, టీకాల అవసరాన్ని ముందుగానే ఊహించి తగిన ఏర్పాట్లు చేయడంతో టీకా కార్యక్రమం వేగవంతమైంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సరైన ప్రణాళికతో కార్యక్రమాన్ని అమలు చేయడానికి , టీకా సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించడం జరిగింది.
సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా కోవిడ్ టీకాలను అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. టీకా సార్వత్రికరణ నూతన దశలో దేశంలో తయారవుతున్న టీకాల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించి వాటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది.
టీకా డోసులు
|
(జూన్ 04, 2022 నాటికి)
|
పంపిణీ చేసిన డోసులు
|
1,93,53,58,865
|
అందుబాటులోని నిల్వలు
|
14,93,35,105
|
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా (ఉచితంగా) ప్రత్యక్ష సేకరణ పద్ధతి లో 193.53 కోట్లకు పైగా ( 1,93,53,58,865 ) టీకా డోసులు అందాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 14.93 కోట్లకు పైగా ( 14,93,35,105 ) నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
***
(Release ID: 1831207)
Visitor Counter : 129