ఆర్థిక మంత్రిత్వ శాఖ
అమెరికా ప్రభుత్వం- భారత ప్రభుత్వం మధ్య పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం
Posted On:
23 MAY 2022 5:00PM by PIB Hyderabad
జపాన్‌లోని టోక్యోలో భారత్-అమెరికా ఈరోజు పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం -ఐఐఏపై సంతకం చేశాయి. భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్- డీఎఫ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్కాట్ నాథన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
ఈ ఐఐఏ 1997లో భారత అమెరికా ప్రభుత్వాల మధ్య సంతకం జరిగిన పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందాన్ని అధిగమించింది. అమెరికా ప్రభుత్వం డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఏజెన్సీ- డీఎఫ్‌సీ అనే కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. డెట్, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ గ్యారెంటీ, ఇన్వెస్ట్‌మెంట్ ఇన్సూరెన్స్ లేదా రీఇన్స్యూరెన్స్, సంభావ్య ప్రాజెక్ట్‌లు, గ్రాంట్‌ల కోసం సాధ్యత అధ్యయనాలు ఈ ఒప్పందం ప్రకారం జరుగుతాయి.
భారతదేశంలో పెట్టుబడి మద్దతును అందించడం కొనసాగించడానికి డీఎఫ్‌సీకి ఈ ఒప్పందం చట్టపరమైన అవసరం. డీఎఫ్‌సీ, సంబంధిత ఏజెన్సీలు 1974 నుండి భారతదేశంలో చురుకుగా ఉన్నాయి. ఇప్పటివరకు5.8 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడి సహాయాన్ని అందించాయి, వీటిలో 2.9 బిలియన్ డాలర్లు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. భారతదేశంలో పెట్టుబడి సహాయాన్ని అందించడానికి డీఎఫ్‌సీ ద్వారా 4 బిలియన్ డాలర్లు విలువైన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ, హెల్త్‌కేర్ ఫైనాన్సింగ్, పునరుత్పాదక ఇంధనం, ఎస్ఎంఈ ఫైనాన్సింగ్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అభివృద్ధికి సంబంధించిన రంగాలలో డీఎఫ్‌సీ పెట్టుబడి మద్దతును అందించింది. ఐఐఏ సంతకం చేయడం వలన డీఎఫ్‌సీ నుండి మెరుగైన పెట్టుబడి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఇది భారతదేశ అభివృద్ధికి మరింత సహాయం చేస్తుంది.
****
(Release ID: 1827829)
Visitor Counter : 184