సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాలార్ జంగ్ మ్యూజియంలో మే 16 నుంచి 21 వరకు అంతర్జాతీయ మ్యూజియం వారోత్సవాలు
సందర్శకులకు ఉచిత ప్రవేశం
Posted On:
12 MAY 2022 6:28PM by PIB Hyderabad
హైదరాబాద్, 12 మే, 2022.
సాలార్ జంగ్ మ్యూజియంలో మే 16 నుంచి 21 వరకు అంతర్జాతీయ మ్యూజియం వారోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మ్యూజియంలో ' వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. . ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడిన సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు. “మ్యూజియంల ప్రాధాన్యత” అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్నినిర్వహిస్తామని అన్నారు. తెలియజేసారు. మ్యూజియంలు కేవలం సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనశాలలు మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు. గత చరిత్ర, సంస్కృతి మరియు సంప్రదాయాలపై సందర్శకులకు విజ్ఞానం అందించే విద్యా కేంద్రాలుగా మ్యూజియంలు పనిచేస్తాయని ఆయన అన్నారు.
అంతర్జాతీయ మ్యూజియం వారోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలను డాక్టర్ నాగేందర్ రెడ్డి వివరించారు. అంతర్జాతీయ మ్యూజియం వారోత్సవాల సందర్భంగా సాలార్ జంగ్ మ్యూజియంలో కింది కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు.
1. సమాచార పట్టికను ప్రారంభించడం
2. 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యాన్ని తెలియజేసే ఇంతవరకు ప్రదర్శించిన/ ఇంతవరకు ప్రదర్శించకుండా రిజర్వ్ లో ఉంచిన 75 వస్తువులతో ప్రదర్శన
3. కళలు, చేతిపనులు, డ్రాయింగ్ మొదలైన వాటిపై పాఠశాల పిల్లలకు శిక్షణ ఇవ్వడం
4. బిద్రి కళపై ఒక రోజు వర్క్‌షాప్/ప్రదర్శన మరియు ఉపన్యాసం
5. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి చెందిన 75 మంది కళాకారులచే ప్రత్యేక కళా ప్రదర్శన
6. భాగ్యనగర్ ఫోటో ఆర్ట్ క్లబ్‌తో కలిసి మ్యూజియం వస్తువులపై నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీ విజేతలకు నగదు బహుమతులు ప్రధానం
7. “యూరోపియన్ ఆర్ట్‌లో హాస్యం”పై ప్రత్యేక ఉపన్యాసం
8. “ప్రివెంటివ్ కన్జర్వేషన్”పై వెబినార్
9. ఐ లవ్ సాలార్ జంగ్ మ్యూజియం అంటూ రెండు ప్రాంతాలలో ఫోటో పాయింట్ / సెల్ఫీ పాయింట్ లను ప్రారంభించడం
10. మ్యూజియంను సందర్శించాలని దివ్యాంగులు మరియు అనాథ విద్యార్థులను ఆహ్వానించడం
11. తెలంగాణ జానపద కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు (ఐసీసీఆర్ కార్యక్రమ విభాగం ఆధ్వర్యంలో).
12. మ్యూజియంను సందర్శించాలని రాయబార కార్యాలయ అధికారులను ఆహ్వానించడం (ప్రత్యేక మ్యూజియం పర్యటన)
హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ రమణారెడ్డి, ఇంటాక్ హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్ శ్రీమతి అనురాధారెడ్డి కూడా విలేకరులతో మాట్లాడారు. ఫోటో క్లబ్ అధ్యక్షుడు శ్రీ జనార్ద రెడ్డి,క్యూరేటర్లు డాక్టర్ ఖుసుమ్, డా.నాయక్, సాలార్ జంగ్ మ్యూజియం సలహాదారుడు శ్రీ ఎం. వీరేంద్ర ఇతర అధికారులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1824823)
Visitor Counter : 154