రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ.8000 కోట్లతో 12 జాతీయ రహదారి ప్రాజెక్టులు.. 460 కిలోమీటర్ల 7 సిఆర్ఐఎఫ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ


తెలంగాణ మీదుగా 5 హరిత క్షేత్ర కారిడార్లు; అంతర్రాష్ట్ర అనుసంధానానికి ఊపు

प्रविष्टि तिथि: 29 APR 2022 6:18PM by PIB Hyderabad

   దేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాల మ‌ధ్య‌ రూ.8000 కోట్లతో 12 జాతీయ రహదారి ప్రాజెక్టులు.. 460 కిలోమీటర్ల పొడవైన 7 కేంద్రీయ రహదారి మౌలిక సదుపాయాల నిధి (సిఆర్‌ఐఎఫ్‌) ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయడంతోపాటు వాటిని కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, కేంద్ర సహాయమంత్రి జనరల్ వి.కె.సింగ్‌లతో కలసి జాతికి అంకితం చేశారు. శంషాబాద్‌లోని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ వేముల ప్రశాంత్‌రెడ్డిసహా రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా శ్రీ గడ్కరీ మాట్లాడుతూ- ఈ జాతీయ రహదారులతో అంతర్రాష్ట్ర అనుసంధానానికి ఊపు లభిస్తుందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నిరంతర ప్రయాణ సదుపాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా జాతీయ రహదారుల అభివృద్ధి వేగవంతం కావడం ద్వారా ఈ ప్రాంతాల్లో వ్యాపార-వాణిజ్యాలకు ఉత్తేజం లభించడం సహా యువతకు సుస్థిర ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు.

   లోగడ 2014లో తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్రంలో 2,511 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, ప్రధానమంత్రి దార్శనికత, కేంద్ర రవాణాశాఖ మంత్రి చొరవ ఫలితంగా నేడు 4996 కిలోమీటర్ల స్థాయికి పెరిగిందని కేంద్ర సాంస్కృతిక-పర్యాటక.. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

   దీంతోపాటు రాష్ట్రంలో ప్రస్తుతం ప్రగతిలోగల ప్రాజెక్టుల గురించి శ్రీ కిషన్‌రెడ్డి వివరించారు. ఈ మేరకు జాతీయ రహదారి-44 పరిధిలో “కాళ్లకల్- గుండ్ల పోచంపల్లి; గుండ్ల పోచంపల్లి-బోవెన్‌పల్లి; తొండుపల్లి- కొత్తూరు మార్గాలను సర్వీస్ రోడ్లు, గ్రేడ్ సెపరేటర్లు 6 వరుసల రహదారులుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు భారతమాల-1 కింద జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ద్వారా రూ.44,658 కోట్లతో (1,314 కిలోమీటర్ల) జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అదేవిధంగా కేంద్ర రోడ్డు రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తన పరిధిలోని రోడ్లు- భవనాల (ఎన్‌హెచ్‌) విభాగం ద్వారా 2022-23 వార్షిక ప్రణాళిక అమలుకు రూ.9,147 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేసిన తర్వాత ఈ ప్రాజెక్టులు అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

   ఈ ప్రాజెక్టులన్నింటి నిర్మాణంతో దూరం తగ్గడం ద్వారా ఇంధనం, ప్రయాణ సమయం, రవాణా వ్యయం కలిసి రావడమేగాక ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

***


(रिलीज़ आईडी: 1821493) आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English