జల శక్తి మంత్రిత్వ శాఖ
వికేంద్రీకరించినదేశీయ వ్యర్థ జలాల నిర్వహణ రంగం లో భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య ఒక మెమోరాండమ్ఆఫ్ కార్పొరేశన్ (ఎమ్ఒసి) పై సంతకాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
13 APR 2022 3:29PM by PIB Hyderabad
వికేంద్రీకరించిన దేశీయ వ్యర్థ జలాల నిర్వహణ రంగం లో జల వనరుల విభాగం, నదుల అభివృద్ధి మరియు గంగ శుద్ధి (డిఒడబ్ల్యుఆర్, ఆర్ డి&జిఆర్), జలశక్తి శాఖల కు మరియు జపాన్ కు చెందిన పర్యావరణ మంత్రిత్వ శాఖ కు మధ్య సంతకాలు జరిగిన ఒక సహకార ప్రధానమైన అవగాహన పత్రం (ఎమ్ఒసి కి) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు న ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
అమలు కు సంబంధించిన వ్యూహం మరియు లక్ష్యాలు:
ఈ ఎంఒసి ని అమలు పరచడం కోసం ఒక నిర్వహణ మండలి (ఎమ్ సి) ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సహకారాని కి సంబంధించిన కార్యకలాపాల వివరాల ను మరియు ఆ ప్రక్రియ పురోగతి ని పర్యవేక్షించడాని కి ఎమ్ సి బాధ్యత ను తీసుకొంటుంది.
ప్రధాన ప్రభావం:
ఎమ్ఒసి ద్వారా జపాన్ తో ఏర్పరచుకొనే సమన్వయం అనేది వికేంద్రీకరించిన దేశీయ వ్యర్థ జల నిర్వహణ మరియు శుద్ధి చేసిన వ్యర్థ జలాల ను తగు విధం గా తిరిగి ఉపయోగించడం వంటి రంగాల లో ఎంతగానో ఉపయోగపడనుంది. వ్యర్థ జలాల నిర్వహణ దిశ లో వికేంద్రీకరించినటువంటి జోహ్ కాసౌ సాంకేతికత జల్ జీవన్ మిశన్ లో భాగం అయిన ఆవాసాల నుంచి వెలువడే అపరిశుద్ధ జలాల నిర్వహణ పరమైన ఇబ్బందుల ను తొలగించగలుగుతుంది. అంతేకాకుండా, ఈ మిశన్ లో నమామి గంగే కార్యక్రమం లో తలెత్తే ఇదే విధమైన స్థితి ని పరిష్కరించడం లో ప్రభావాన్ని చూపనుంది. ఇది వ్యర్థ జలాల ను శుద్ధి చేసేందుకు సంబంధించిన జఠిలమైన సమస్య ను ఉత్తమమైన రీతి లో పరిష్కరించుకోవడాని కి యుఎల్ బి లకు సహాయకారి కానుంది.
ఖర్చు ను గురించి:
ఈ ఎమ్ఒసి లో భాగం గా ఉభయ పక్షాల కు ఎలాంటి ఆర్థిక పరమైన కర్తవ్యాలు అనేవి తటస్థించవు. ఈ ఎమ్ఒసి లో భాగం గా చేపట్టే కార్యకలాపాల కు మార్గాన్ని సుగమం చేయడం కోసం అంశాల వారీ దస్తావేజులు.. ఉదాహరణ కు సాధ్యాసాధ్యాల నివేదిక లు, సమగ్రమైన ప్రాజెక్టు రిపోర్టులు వంటి వాటిని సిద్ధం చేయడం జరుగుతుంది. అవసరం అయిన పక్షం లో ఆ తరహా నిర్ధిష్ట కార్యక్రమం మరియు ప్రాజెక్టుల తాలూకు ఆర్థిక సహాయ ఏర్పాటుల ను కూడా చేపడుతారు.
అంశం వారీగా వివరాలు:
మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేశన్ (ఎమ్ఒసి) పై జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగ శుద్ధి విభాగం (డిఒడబ్ల్యుఆర్, ఆర్&డి జిఆర్), జల శక్తి మంత్రిత్వ శాఖ (ఎమ్ఒజెఎస్), ఇంకా జపాన్ కు చెందిన పర్యావరణ మంత్రిత్వ శాఖ లు 2022వ సంవత్సరం మార్చి నెల 19వ తేదీ నాడు సంతకాలు చేశాయి. సార్వజనిక జల క్షేత్రాల లో నీటి కి సంబంధించిన పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, అలాగే సార్వజనిక ఆరోగ్యం మెరుగుదల కోసం సహకారాన్ని పెంపొందింప చేసుకొనేందుకు కుదుర్చుకోవడం జరిగింది. రెండు దేశాల మధ్య సమానత్వం మరియు పరస్పర ప్రయోజనం సిద్ధాంతాల ప్రాతిపదికన ఈ ఎమ్ఒసి రూపుదాల్చింది.
ఈ విషయం లో సహకారం తాలూకు పరిధి అనేది చాలా వరకు వికేంద్రీకరించిన దేశీయ వ్యర్థ జల నిర్వహణ మరియు శుద్ధి చేసిన వ్యర్థ జలాన్ని సముచిత రీతి లో తిరిగి వినియోగించడం అనే అంశాల పై శ్రద్ధ వహించనుంది. వికేంద్రీకరించిన దేశీయ వ్యర్థ జల నిర్వహణ సంబంధి ప్రావీణ్యం మరియు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం లో చర్చా సభలు, సమావేశాలు మరియు సామర్ధ్య నిర్మాణం అనే మార్గాల ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఉభయ పక్షాలు ఒక మేనేజ్ మెంట్ కౌన్సిల్ (ఎమ్ సి)ని ఏర్పాటు చేస్తాయి. ఎమ్ఒసి సహకారాని కి సంబంధించిన సమగ్ర కార్యకలాపాల ను రూపొందించి తత్సంబంధ పురోగతి ని పర్యవేక్షిస్తుంది.
పూర్వరంగం:
జల వనరుల ను అభివృద్ధి పరచడం లో, జల వనరుల నిర్వహణ లో సాంకేతిక ప్రావీణ్యాన్ని మరియు విధానాన్ని ఇతర దేశాల తో పంచుకోవడం, ట్రైనింగ్ కోర్సుల ను నిర్వహించడం, వర్కు షాపుల ను, విజ్ఞాన శాస్త్ర సంబంధమైన మరియు సాంకేతిక విజ్ఞాన సంబంధమైన చర్చా గోష్ఠుల ను నిర్వహించడం, నిపుణుల ను ఆయా దేశాల కు పంపించడం/ఆయా దేశాల నుంచి రప్పించుకోవడం, ఇంకా అధ్యయన యాత్రలు వంటి చొరవల ద్వారా ఇతర దేశాల తో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలి అని జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగ నది శుద్ధి మంత్రిత్వ శాఖ సంకల్పించింది. దీనిని దృష్టి లో పెట్టుకొని వికేంద్రీకృత శుద్ధి రంగం లో అనుభవాన్ని మరియు ప్రావీణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కోసం జపాన్ తో ఒక ఒప్పందాని కి రావాలి అని నిర్ణయించడమైంది.
***
(Release ID: 1816508)
Visitor Counter : 111