పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశంలో పౌర విమానయాన రంగం అభివృద్ధి కోసం విమానయాన రంగంలోని భాగస్వాములందరితో ప్రభుత్వం నిర్మాణాత్మక సహకారిగా ఉండాలి: శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా
గత ఏడు సంవత్సరాలలో మారిన భారత పౌర విమానయాన రంగం ముఖచిత్రం:
శ్రీ సింధియా
అనేక పరీక్షలు, సమస్యలను అధిగమించి బలంగా, దృఢంగా , సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం గా ఉన్న భారత పౌర విమానయాన రంగం: శ్రీ సింధియా
వింగ్స్ ఇండియా-2022 ను లాంఛనంగా ప్రారంభించిన శ్రీ సింధియా
Posted On:
25 MAR 2022 4:15PM by PIB Hyderabad
విమానయాన రంగంలోని భాగస్వాములందరితో ప్రభుత్వం నిర్మాణాత్మక సహకారిగా ఉంటుందని , దేశంలో పౌర విమానయాన అభివృద్ధి కోసం వారితో కలిసి పనిచేస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా అన్నారు.ఈ రోజు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా -2022 ను లాంఛనంగా ప్రారంభించిన ఆయన, " స్క్వేర్ టేబుల్స్ ను మేము విశ్వసించడం లేదు, విమానయాన రంగ విజయాన్ని, దేశం విజయాన్ని నిర్ధారించడానికి మా మంత్రిత్వ శాఖ రౌండ్ టేబుల్స్ ను విశ్వసిస్తోంది‘‘ అని చెప్పారు.
వాణిజ్య, సాధారణ , వ్యాపార విమానయానం కోసం ఆసియాలో అతిపెద్ద ఈవెంట్ అయిన వింగ్స్ ఇండియా 2022, 'India@75: న్యూ హారిజన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ' అనే ప్రధాన ఇతివృత్తంతో జరుగుతోంది. నిన్న ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ,ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ప్రారంభ సమావేశం లో ప్రెంచ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రాన్స్ పోర్ట్ జీన్ బాప్టిస్ట్ జెబ్బరి, ఫ్రాన్స్ ఎకలాజికల్ ట్రాన్సిషన్ మంత్రి గంప్సంగ్ ముయోంగ్మానీ, లావోస్ పబ్లిక్ వర్క్స్ అన్ దరవ్యోల్బణానికి ట్రాన్స్ పోర్ట్ వైస్ మినిస్టర్ ప్రేమ్ బహదూర్ అలీ, తెలంగాణ గవర్నర్ , పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళ సై సొందర రాజన్, హర్యానా డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌతాలా , అరుణాచల్ ప్రదేశ్ పౌర విమాన యాన మంత్రి శ్రీ నకప్ నలో , కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సల్, భారత విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ సంజీవ్ కుమార్, ఎం ఓ సి ఏ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఉషా పాథి, ఫిక్కీ సివిల్ ఏవియేషన్ కమిటీ అధ్యక్షుడు, ఎయిర్ బస్ గ్రూప్ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రేమీ మైలార్డ్ వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి , వివిధ రాష్ట్రప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు, విమాన యాన రంగానికి చెందిన వివిధ కంపెనీల సీఈఓలు, ఇతర భాగ స్వాములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ సింధియా మాట్లాడుతూ, భారతీయ విమానయాన రంగం ఈ మహమ్మారి కాలంలో ఎన్నో ఇబ్బందులను కష్టాలను ఎదుర్కొందని, అయినా వాటిని అధిగమించి మరింత బలంగా, దృఢంగా, సవాళ్లను ఎదుర్కొనేందుకు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు.ఈ రంగం స్థితిస్థాపకతను కనబరిచిందని, వచ్చే సంవత్సరం నాటికి, కోవిడ్ కు ముందు నాటి దేశీయ ప్రయాణీకుల సంఖ్యను అధిగమిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో అంతర్జాతీయ విమానాలు పూర్తిగా పునఃప్రారంభం కాబోతున్నాయని, భారతదేశం నుండి అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతుందని చెప్పారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ వింగ్స్ ఇండియా -2022 నిర్వహణ ఒక గుణాత్మక క్షణం అని శ్రీ సింధియా అన్నారు. గౌరవ ప్రధాన మంత్రి ఇచ్చిన గతి శక్తి అజెండా, భారత దేశాన్ని సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్తుందని ఆయన అన్నారు. దేశానికి శక్తి ని ఇవ్వడానికి.భారత ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఒకే గొడుగు కింద ఏకమయ్యాయని అన్నారు.
భారతదేశం 75 నుండి 100 సంవత్సరాల వైపు పురోగమిస్తున్న వేళ.దృక్పథం మారినందున మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించడంతో కొత్త శక్తిగా ఆవిర్భవిస్తుందని అన్నారు. మౌలిక సదుపాయాల నిర్మాణం కేవలం ఆర్థిక కేంద్రాల కే పరిమితం కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలలో ప్రతి ఒక్కరికీ క ల్పించడం జరుగుతోందని ఆయన అన్నారు. దేశాభివృద్ధిలో పౌర విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు.
ఈ రంగం ఆర్థిక గుణకం 3.1, ఉపాధి గుణకం 6.1 అని ఆయన చెప్పారు. పౌర విమానయాన రంగంలో ఒక రూపాయి పెట్టుబడి దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు రూ. 3.1 జోడిస్తుందని, ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష ఉపాధి కోసం 6.1 పరోక్ష ఉద్యోగాలు కల్పీస్తుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి, ఉత్పాదక రంగాలలో పౌర విమాన యాన రంగం ఒకటని ఆయన అన్నారు.
గత ఏడు సంవత్సరాలలో భారత పౌర విమాన యాన రంగం లో మార్పు గురించి శ్రీ సింధియా ప్రస్తావిస్తూ, భారత దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమాన యాన మార్కెట్ అని అన్నారు.
2013-14లో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి దాదాపు 140కి (హెలిపోర్ట్స్, వాటర్ డోమ్ లతో సహా) పెరగడంతో ఈ రంగంలో స్పెక్ట్రమ్ అంతటా విస్తరణ జరిగింది. 2024-25 నాటికి ఈ సంఖ్య 220కి చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు దేశంలో 400 విమానాలు ఉండగా ఈ సంఖ్య ఏడు సంవత్సరాలలో 710 కి పెరిగింది.ప్రతి సంవత్సరం 100 కి పైగా విమానాలు చేరాలని ఉద్దేశించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీని కల్పించడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ అనేది ప్రభుత్వం దృష్టి అని ఆయన చెప్పారు. ఉడాన్ ప్రతి ఒక్క పౌరుడిని అనుసంధానించి, సామాన్యుడికి విమానాలను అందుబాటులోకి తెచ్చే మిషన్ అని మంత్రి అన్నారు. "హవాయి చప్పల్ పెహేనే వాలా భీ హవాయి జహాజ్ మెయిన్ ఉడ్ పాయే" అని ఆయన అన్నారు.
ఉడాన్ ప థకం కోసం గౌరవ ప్రధాన మంత్రి దార్శనిక త lను ప్రస్తావిస్తూ, ఈ పథకం కింద 409 కు పైగా మార్గాలను గుర్తించామ ని, 1.75 లక్షలకు పైగా విమాన ప్రయాణాలు జరిగాయని, 91 లక్షల మందికి పైగా ప్రయాణికులకు ప్ర యోజనం కలిగిందని ఆయన అన్నారు.
పౌర విమానయాన పర్యావరణ వ్యవస్థలో కార్గో, ఎంఆర్ఓలు, ఎఫ్టిఓలు, గ్రౌండ్ హ్యాండ్లర్లు, డ్రోన్లు వంటి ఇతర భాగాలు ఉన్నాయని, వీటన్నింటికీ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
ఎమ్ ఆర్ వోల కోసం కొత్త పాలసీని ప్రకటించారు. మరిన్ని శిక్షణా కేంద్రాలు జోడించబడుతున్నాయి, తద్వారా భారతీయ పైలట్లు దేశంలోనే శిక్షణ పొందుతారు. భారతీయ పైలట్లలో 15% మంది మహిళలు ఉన్నారని, ఇది ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ అని ఆయన తెలియజేశారు.
డ్రోన్ల కోసం, కొత్త విధానాన్ని , పిఎల్ఐ పథకాన్ని ప్రారంభించామని , తద్వారా భారతదేశాన్ని ఈ రంగంలో ప్రపంచ నాయకత్వ స్థాయికి మార్చాలనే ప్రధాన మంత్రి దార్శనికత సాకారం అవుతుందని చెప్పారు. కొత్త హెలికాప్టర్ విధానాన్ని కూడా ప్రకటించినట్లు మంత్రి తెలిపారు.
పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సాల్ మాట్లాడుతూ, భారతదేశ ఉడాన్ పథకం టైర్ 3 , 4 నగరాలకు చేరుకుంటోందని, ఇది పెద్ద సంఖ్యలో భారతీయులు ప్రయాణానికి గగనతలంలోకి రావడానికి దోహదపడుతుందని తెలియజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నాలెడ్జ్ పేపర్ ను కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), పవన్ హన్స్ లిమిటెడ్ (పీహెచ్ఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
చిన్న విమానాల ఉప పథకాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. చిన్న విమానాల (సీప్లేన్లతో సహా) ద్వారా కార్యకలాపాలపై ఒక నిర్దిష్ట దృష్టితో వృద్ధి-ఆధారిత ఫ్రేమ్ వర్క్ ను సృష్టించడం ద్వారా ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీని సులభతరం చేయడం ,ఉత్తేజపరచడం దీని ప్రాథమిక లక్ష్యం. రాష్ట్రాలు, విమానయాన సంస్థలు, విమానాశ్రయ ఆపరేటర్లు ,విధాన రూపకర్తలు వంటి సంబంధిత భాగస్వాములను ఈ చొరవ విజయం దిశగా సహకరించడానికి అవసరమైన ఫ్రేమ్ వర్క్ ను అందించడం ద్వారా దేశంలో చిన్న విమాన కార్యకలాపాల కోసం ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి ఈ పథకాన్ని ఉద్దేశించారు.
శ్రీ సింధియా చాలెట్ ను సందర్శించారు ఎయిర్ ఫోర్స్, సారంగ్ టీమ్ నిర్వహించిన ఏరోబాటిక్స్ డిస్ ప్లేను వీక్షించారు.
వైడ్ బాడీ ఎయిర్ బస్ 350 నుండి చిన్న విమానాలు , హెలికాప్టర్ల వరకు స్టాటిక్ డిస్ ప్లే ప్రాంతాన్ని కూడా మంత్రి చూశారు.
ఎయిర్ క్రాఫ్ట్ & హెలికాఫ్టర్ మాన్యుఫ్యాక్చరర్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్, ఎయిర్ క్రాఫ్ట్ మెషినరీ & ఎక్విప్ మెంట్ కంపెనీలు, ఎయిర్ పోర్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, డ్రోన్ లు, స్కిల్ డెవలప్ మెంట్, స్పేస్ ఇండస్ట్రీ, ఎయిర్ లైన్స్, ఎయిర్ లైన్ సర్వీసెస్ , కార్గో వంటి వాటితో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గ్లోబల్ సీఈఓల ఫోరమ్ లో కూడా పాల్గొన్నారు.
****
(Release ID: 1809783)
Visitor Counter : 267