సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఎస్.ఎస్.సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి పరీక్ష, 2021


Posted On: 09 FEB 2022 2:51PM by PIB Hyderabad

విజయవాడ,

ఫిబ్రవరి 9, 2022.

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్.ఎస్.సి) భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/సంస్థల్లో ఉద్యోగాల నియామకం కోసం ‘‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్, 2021’’ కోసం 01.02 2022న నోటిఫికేషన్‌ వెలువరించడమైంది.

లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌ మెంట్లు/కార్యాలయాలు మరియు వివిధ రాజ్యాంగ సంస్థలు/చట్టబద్ధమైన సంస్థలు/ట్రిబ్యునల్‌ లు మొదలైన వాటికి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ ల పోస్టుల కోసం ఎంపిక చేయడం జరుగుతుంది.

పోస్టుల వివరాలు, వయో పరిమితి, అవసరమైన విద్యార్హతలు, చెల్లించాల్సిన రుసుము, పరీక్ష విధానం, ఎలా దరఖాస్తు చేయాలి వంటి వాటికి సంబంధించిన సమాచారం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ లో వివరంగా ఇవ్వబడింది. దరఖాస్తులను ఆన్‌ లైన్ మోడ్‌ లో మాత్రమే ssc.nic.in ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేది 07.03 2022, ఆన్‌ లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ 08.03.2022.

దక్షిణ ప్రాంతంలో టైర్-1 కేంద్రం కంప్యూటర్ ఆధారిత పరీక్షను 23 కేంద్రాలు/నగరాలలో - ఆంధ్ర ప్రదేశ్‌లో 11 కేంద్రాలు; తెలంగాణలో 3 కేంద్రాలు; తమిళనాడులో 8 కేంద్రాలు, పుదుచ్చేరిలో 1 ప్రాంతాలలో 2022 మే నెలలో నిర్వహించబడుతుంది.

***



(Release ID: 1796810) Visitor Counter : 110


Read this release in: English