ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ టీకాల లభ్యతపై తాజా సమాచారం
రాష్ట్రాలు, యూటీలకు అందిన 148.37 కోట్లకుపైగా డోసులు
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో 17.72 కోట్లకుపైగా నిల్వలు
Posted On:
27 DEC 2021 9:28AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా కొవిడ్-19 టీకాల వేగాన్ని మరింత పెంచడానికి పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొవిడ్ టీకాల సార్వత్రికీకరణ కొత్త దశ ఈ ఏడాది జూన్ 21 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాల లభ్యత, టీకాల లభ్యతపై దూరదృష్టిని పెట్టడం ద్వారా టీకా కార్యక్రమం వేగవంతమైంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చక్కటి ప్రణాళికతో పని చేయడానికి, టీకా సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడానికి దీనిని ప్రారంభించారు.
సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా కొవిడ్ టీకాలను అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోంది. టీకా సార్వత్రీకరణ కొత్త దశలో, దేశంలో తయారవుతున్న టీకాల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించి, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది.
టీకా డోసులు
|
(డిసెంబర్ 27, 2021 నాటికి)
|
పంపిణీ చేసినవి
|
1,48,37,98,635
|
అందుబాటులోని నిల్వలు
|
17,72,05,206
|
148.37 కోట్లకుపైగా ( 1,48,37,98,635 ) టీకా డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా (ఉచితంగా), ప్రత్యక్ష సేకరణ పద్ధతిలో ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందాయి.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 17.72 కోట్లకుపైగా ( 17,72,05,206 ) నిల్వలు, ఉపయోగించని డోసులు అందుబాటులో ఉన్నాయి.
****
(Release ID: 1785483)
Visitor Counter : 168