నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నైపుణ్య భార‌త్ కార్య‌క్రమం

Posted On: 20 DEC 2021 5:14PM by PIB Hyderabad

నైపుణ్య అభివృద్ధి, ఎంట‌ర్‌ప్రెన్యుయ‌ర్‌షిప్ మంత్రిత్వశాఖ (ఎంఎస్ డి ఇ) ఈ కింది నైపుణ్యఅభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను దేశ‌వ్యాప్తంగా గ‌ల యువ‌త నైపుణ్యాభివృద్ధి కోసం అమ‌లు చేయ‌డం జ‌రిగింది.
--------

క్ర‌మ‌
సంఖ్య‌

ప‌థ‌కం

ల‌క్ష్యం

1.

ప్ర‌ధాన‌మంత్రి
కౌశ‌ల్ వికాస్ యోజ‌న (పిఎంకెవివై)

ఎంఎస్‌డిఇ  ఫ్లాగ్‌షిప్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న‌ది

పిఎంకెవివై, ల‌క్ష్యం దేశ‌వ్యాప్తంగా గ‌ల అభ్య‌ర్థుల‌కు శిక్ష‌ణ నివ్వ‌డం.
పిఎంకెవివైలో రెండు శిక్ష‌ణ‌కార్య‌క్ర‌మాలు ఉన్నాయి. ఒక‌టి దీర్ఘ‌కాలిక శిక్ష‌ణ (ఎస్‌టిటి)

అభ్య‌స‌న‌కు ముందు గుర్తింపు (ఆర్‌పిఎల్‌).

2.

జ‌న్ శిక్ష‌న్ సంస్థాన్ (జెఎస్ఎస్) ప‌థ‌కం

ఈ ప‌థ‌కం నిర‌క్ష‌రాస్యులు,

15-45 సంవత్సరాల వయస్సులో  నిర‌క్ష‌రాస్యులు, త‌గిన వ‌య‌సులో విద్య‌కుదూర‌మైన వారు, 8వ తరగతి వరకు ప్రాథమిక స్థాయి విద్యను కలిగి ఉన్నవారు , 12వ త‌ర‌గ‌తిలోగా పాఠశాల మానేసిన వారికి వృత్తి నైపుణ్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగులు  సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాలు ప్రాధాన్యతా సమూహాలుగా ఉన్నాయి. జె ఎస్ ఎస్ లు కనీస మౌలిక సదుపాయాలు ,వనరులతో లబ్ధిదారుల ముంగిట‌కే అందుబాటులోకి వ‌స్తాయి..

3.

నేష‌న‌ల్ అప్రెంటిస్‌షిఫ్ ప్ర‌మోష‌న్ ప‌థ‌కం (ఎన్ ఎపి ఎస్‌)


ఈ ప‌థకం అప్రెంటిస్ షిప్ శిక్ష‌ణ‌ను ప్ర‌మోట్ చేసేందుకు ఉద్దేశించిన‌ది.  అప్రెంటిస్ షిప్ చ‌ట్టం 1961 కింద  పారిశ్రామిక సంస్థ‌ల‌కు ఆర్ధిక స‌హాయం ఇవ్వ‌డం ద్వారా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను పెంపొందించ‌డం.

4.

క్రాఫ్ట్స్‌మెన్ ట్ర‌యినింగ్ ప‌థ‌కం (సిటిఎస్‌)

143 ట్రేడ్‌ల‌లో 14,417 పారిశ్రామిక శిక్ష‌ణ సంస్థ‌లు (ఐటిఐ) ల‌ద్వారా దేశ‌వ్యాప్తంగా  దీర్ఘ‌కాలిక శిక్ష‌ణ ఇవ్వ‌డానికి ఈ ప‌థ‌కాన్ని నిర్దేశించారు.

 

దీనికితోడు, ఎం.ఎస్‌.డి.ఇ వివిధ స‌మ్మిళ‌క చ‌ర్య‌ల‌ను దేశ‌వ్యాప్త నైపుణ్య శిక్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో తీసుకువ‌చ్చింది. ఇందుకు సంబంధించి ఉమ్మ‌డి నిబంధ‌న‌లు , మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తీసుకురావ‌డం దీని ల‌క్ష్యం . త‌ద్వారా దేశ‌వ్యాప్తంగా నైపుణ్య శిక్ష‌ణ‌కు సంబంధించి వివిధ రంగాల విష‌యంలో ఎంఎస్ డిఇ కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది.

- ఉమ్మ‌డి ఖ‌ర్చు నిబంధ‌న‌లు
- జాతీయ నైపుణ్య అర్హ‌తా ఫ్రేమ్‌వ‌ర్క్ (ఎన్ ఎస్ క్యు ఎఫ్‌)
ప‌థ‌కం వారీగా, రాష్ట్రం వారీగా , జిల్లా వారీగా శిక్ష‌ణ పొందిన వారి స‌మాచారాన్ని అందించ‌డం చాలా పెద్ద‌ది క‌నుక , ఇందుకు సంబంధించిన వివ‌రాలు నైపుణ్య అభివృద్ధి, ఎంట‌ర్‌ప్రెన్యుయ‌ర్‌షిప్ మంత్రిత్వ‌శాఖ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌డం జరిగింది.
(Link:- www.msde.gov.in/en/useful-links/parl-ques/lok-sabha).
ప‌థ‌కం వారీగా ప్లేస్‌మెంట్ రికార్డులు కింది విధంగా ఉన్నాయి.

పిఎంకెవివై :  మూడు నెల‌ల ప్లేస్‌మెంట్‌, స్వ‌యం ఉపాధి ప‌ర్య‌వేక్ష‌ణ‌ను శిక్ష‌ణ‌నిచ్చే వారు ,డిఎస్‌సిలు, ఎస్ ఎస్్‌డిఎంలు క‌ల్పిస్తారు.  మ‌రే ఇత‌ర ప‌థ‌కం కింద ప్లేస్ మెంట్ రికార్డుల ట్రాకింత‌గ్ త‌ప్ప‌నిస‌రి కాదు. అందువ‌ల్ల ఇందుకు సంబంధించిన రికార్డులు నిర్వ‌హించ‌రు.
పిఎంకెవివై : ప‌ఇఎంకెవివై కింద అభ్య‌ర్థుల ప్లేస్‌మెంట్ వివ‌రాల‌ను అనుబంధం 1 లో పొందుప‌రుస్తారు. థ‌ర్డ్‌పార్టీ ప‌రిశీల‌న కింద  పిఎంకెవివై 2.0 (2016-20) , ఇది పిఎంకెవివై శిక్ష‌ణ‌పొందిన‌, స‌ర్టిఫికేట్ పొందిన వ్య‌క్తుల స‌గ‌టు నెల‌వారీ ఆదాయం, వీరితో పోలిక క‌లిగిన వ‌ర్గాల‌వారికంటే 15 శాతం ఎక్కువ‌గ ఉంది.
అలాగే, ఆర్‌పిఎల్ తీసుకున్న అభ్య‌ర్థుల‌కు, ఇత‌రుల‌కు సగటు నెలవారీ ఆదాయంలో గణనీయమైన 19% వ్యత్యాసం గమనించబడింది. అంతేకాకుండా, 76% మంది అభ్యర్థులు శిక్షణ తర్వాత, ఉపాధి పొందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంగీకరించారు.

.ఏ ఇత‌ర ప‌థ‌కంలో అయినా ఇలాంటి రికార్డులు నిర్వ‌హించ‌డం త‌ప్ప‌నిస‌రి కాదు.ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్య విష‌యాలు ఇలా ఉన్నాయి.
జె.ఎస్‌.ఎస్ :  జె.ఎస్‌.ఎస్ కింద శిక్ష‌ణ అందించ‌డం వెనుక ఉద్దేశం, ఆయా వ్య‌క్తుల‌ను లాభ‌దాయ‌క‌మైన ఉపాధిలో కుదురుకునేట్టు చేయ‌డం. ఆ ర‌కంగా వారి కుటుంబానికి అద‌న‌పు రాబ‌డిని స్వ‌యం ఉపాధి లేదా వేత‌న ఉపాధి ద్వారా అందేట్టు చూడ‌డం. ఉపాధి, ల‌బ్ధిదారులకు ప్లేస్‌మెంట్ జె.ఎస్‌.ఎస్ కింద త‌ప్ప‌నిస‌రి కాదు.  జె ఎస్ ఎస్ ప‌థ‌కం కింద ల‌బ్దిదారుల ఉపాధికి సంబంధించి , థ‌ర్డ్ పార్టీ ఎవాల్యుయేష‌న్ నివేదిను పొందుప‌ర‌చ‌డం జ‌రిగింది. జెఎస్ ఎస్  శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ప్ర‌భావం కింద స్వీయ‌, వేత‌న ఉపాధి ప్రైవేట్ ఉపాధి క‌నిపిస్తోంది. ఈ ప‌థ‌కం ఉప‌యోగం ఇంకా ఎలా స్ప‌ష్ట‌ప‌డుతున్న‌దంటే, ఈ నివేదిక ప్ర‌కారం 77.05శాతం మంది ల‌బ్ధిదారులు త‌మ త‌మ వృత్తుల‌ను మారారు. 2. ఈ ప‌థ‌కం కింద చేరిన ల‌బ్దిదారులు, శిఖ‌ణ పొందిన వారు 59.23 శాతం 2018-19లో పెరిగింది. ఈ వాస్త‌వం ల‌బ్ధిదారుల జీవ‌నోపాధి ప‌థ‌కంపై సానుకూల ప్ర‌భావాన్ని చూపుతుంది.

సిటిఎస్ :  ఐటిఐ గ్రాడ్యుయేట్ ట్రేస‌ర్ స్ట‌డీకిసంబంధించి తుది నివేదిక (నైపుణ్యాభివృద్ధి, ఎంట‌ర్ ప్రెన్యుయ‌ర్‌షిప్‌, భార‌త ప్ర‌భుత్వం 2018 జ‌న‌వ‌రిలో ప్ర‌చురించిన నివేదిక‌)  ఐటిఐ పాస్ అయిన వారిలో 63.5 శాతం మంది ఉపాధి పొందిన‌ట్టు ( వేత‌నంతో కూడిన ఉద్యోగం + స్వ‌యం ఉపాది. ఇందులో 6.7 శాతం స్వ‌యం ఉపాధి పొందిన వారు ) 36.4 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు.  మొద‌టి గ‌ణాంకాలు  పురుషుల గ‌ణాంకాలు 66.5 శాతంతో పోల్చిన‌పుడు మ‌హిళ‌ల విష‌యంలో త‌క్కువ‌గా 55.3 శాతం గా ఉన్నాయి. ఇదే వివ‌రాలు ఎస్‌సిల విష‌యంలో 65 శాతం, ఎస్‌టిల విషయంలో 69.8 శాతంగా ఉన్నాయి ఇవి వేత‌నం+ స్వ‌యం ఉపాధి పొందిన వారి కంటే ఎక్కువ శాతం క‌లిగి ఉన్నాయి,.
ఈ స‌మాచారాన్ని నైపుణ్యాభివృద్ధి, ఎంట‌ర్‌ప్రెన్యుయ‌ర్షిప్ శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ లోక్‌స‌భ‌కు ఇచ్చిన ఒక లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 1784553) Visitor Counter : 110


Read this release in: English