భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ఐ ఆర్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ లో 16.94% వరకు పెట్టుబడి వాటాల సేకరణకు బ్రిక్లెయెర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనుమతి ఇచ్చిన సీసీఐ

Posted On: 21 DEC 2021 12:03PM by PIB Hyderabad

ఐ ఆర్ బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్(ఐ ఆర్ బి/ టార్గెట్)  లో 16.94% వరకు పెట్టుబడి వాటాల సేకరణకు   బ్రిక్లెయెర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐసి ఇన్వెస్టర్/అక్వైరర్    )  కి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ ) కాంపిటీషన్ చట్టం 2002 లోని సెక్షన్ 31(1) కింద  అనుమతి ఇచ్చింది. 

ప్రైవేట్ లావాదేవీ ద్వారా ప్రాధాన్యత వాటాల జారీ ద్వారా పూర్తి లేదా పాక్షిక డైల్యూట్ విధానంలో టార్గెట్  పెట్టుబడిలో 16.94% వాటాను జీఐసి ఇన్వెస్టర్ సేకరించడానికి ఈ ప్రతిపాదిత కలయిక రూపొందింది. 

ప్రతిపాదిత కలయిక ఒక విధంగా వ్యాపార సముపార్జన కింద ఉండి కాంపిటీషన్ చట్టం 2002 లోని సెక్షన్ 5(1) పరిధిలోకి వస్తుంది. 

  జీఐసి ఇన్వెస్టర్

  జీఐసి ఇన్ఫ్రా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐసి ఇన్ఫ్రా) పూర్తి అనుబంధ సంస్థగా జీఐసి ఇన్వెస్టర్ పనిచేస్తుంది. ఇది ఒక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సంస్థ.  జీఐసి ఇన్ఫ్రా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై   జీఐసి ( వెంచర్స్) ప్రైవేట్ లిమిటెడ్ పూర్తి అనుబంధ యాజమాన్య అధికారాన్ని కలిగి ఉంది.  2019 మే 22న జీఐసి ఇన్వెస్టర్ నమోదయింది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న   జీఐసి స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో పనిచేస్తున్న హోల్డింగ్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలన్న లక్ష్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ గా జీఐసి ఇన్వెస్టర్ ఏర్పాటయింది. 

టార్గెట్:

ఐఆర్బీ గ్రూప్ కి చెందిన టార్గెట్ సంస్థ 1998 లో భారతదేశంలో పబ్లిక్ కంపెనీగా నమోదయింది. ఈ సంస్థ ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణ కాంట్రాక్టులు, రహదారులు, జాతీయ రహదారుల నిర్వహణ కార్యక్రమాలకు అవసరమైన సేవలు అందిస్తోంది. 

ఈ సంస్థ పవన విద్యుత్, రియల్ ఎస్టేట్ సేవలు, విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ రంగాలలో కూడా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 

సవివరణ సీసీఐ ఉత్తర్వులు త్వరలో జారీ అవుతాయి. 

***



(Release ID: 1783836) Visitor Counter : 114


Read this release in: English , Urdu , Hindi , Marathi