మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళలు, చిన్న పిల్లల అభివృద్ధికి సంబంధించిన పథకాలు
Posted On:
15 DEC 2021 2:39PM by PIB Hyderabad
మహిళల అభివృద్ధి, సాధికారత, చిన్న పిల్లల అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కింది విధంగా ఉన్నాయి.
అంగన్ వాడి సర్వీస్ : అంగన్ వాడి సర్వీసుల కింద, గర్భిణులకు పాలిచ్చేతల్లులకు, ఆరేళ్ల లోపు పిల్లలకు ఆరు రకాల సేవల పేకేజ్ అందుబాటులో ఉంటుంది. అవి, 1. అనుబంధ పౌష్టికాహారం(ఎస్.ఎన్.పి) 2. ప్రీ స్కూల్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, 3) పౌష్టికాహారం , ఆరోగ్యం గురించిన సమాచారం 4 టీకాల కార్యక్రమం. 5. ఆరోగ్య పరీక్షలు, 6. రెఫరల్ సర్వీసులు, ఇందులోని ఆరు సర్వీసులలో మూడు సర్వీసులు అంటే టీకా కార్యక్రమం, ఆరోగ్య పరీక్షలు, రెఫరల్ సర్వీసులు ఆరోగ్యానికి సంబంధించినవి. వీటిని ఎన్ ఆర్ హెచ్ ఎం, , ప్రజారోగ్య మౌలిక సదుపాయాల ద్వారా సమకూర్చడం జరుగుతుంది.
వన్ స్టాప్ సెంటర్, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఉమన్ హెల్ప్‌లైన్‌లు : మహిళా సంక్షేమ డివిజన్ నిర్భయ ఫండ్ నుంచి రెండు పథకాలను అమలు చేస్తున్నది. అవి వన్ స్టాప్ సెంటర్ అండ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఉమన్ హెల్ప్ లై్న్‌లు. వన్ స్టాప్ సెంటర్స్ (ఒఎస్‌సి)ను సఖీ సెంటర్లు అని అంటారు. ఇవి హింసకు గురైన మహిళలను ఆదుకునేందుకు సంబంధించినది. గృహ హింస కేసులకు కూడా ఇది వర్తిస్తుంది. దీనికింద పలు సమగ్ర సేవలు ఒకే గొడుగు కింద అందుబాటులో ఉన్నాయి. అవి, పోలీసులను సంప్రదించే సదుపాయం, వైద్యసహాయం, న్యాయ సహాయం, లీగల్ కౌన్సిలింగ్, సైకో సోషల్ కౌన్సిలింగ్, తాత్కాలిక షెల్టర్ వగైరా. మహిళా సహాయ పథకం 24 గంటలూ అత్యవసర,అత్యవసరేతర స్పందనను హింస ద్వారా ప్రభావితమైన మహిళలకు అందేట్టు చూస్తుంది. పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలలో వీరికి సంబంధిత అధికారులతో సహాయం లభిస్తుంది.
పోలీసులు,వన్‌స్టాప్ సెంటర్, హాస్పిటల్, లీగల్ సర్వీసులు తదితరాల నుంచి వీరికి సహాయం అందుతుంది. డబ్ల్యు హెచ్ ఎల్, ఇబ్బందులలో ఉన్న మహిళలకు వారిని ఆదుకునేందుకు వ్యాన్ సదుపాయం, కౌన్సిలింగ్ సేవలు అందుబాటులోకి తెస్తుంది. దీనితో పాటు మహిళలకు అందుబాటులోకి వచ్చే సంక్షేమ పథకాల గురించి వారికి తెలియజేస్తారు. మహిళలు 181 మహిళా హెల్ప్ లైన్ కు ఫోన్
చేసి సహాయం పొందవచ్చు.
3. స్వధార్ గృహ్ స్కీమ్ : స్వధార్ గృహ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం గా మహిళలకోసం అమలు చేస్తున్నారు. వివిధ సందర్భాలలో బాధితులైన మహిళల పునరావాసానికి సంస్థాగత ఏర్పాటు ఇది. దీనివల్ల వారు గౌరవ ప్రదమైన, ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని గడపడానికి వీలు కలుగుతుంది.
4. ఉజ్వల పథకం: ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం గా అమలు చేస్తున్నారు. మహిళల అక్రమ తరలింపు నిరోధం, వారిని కాపాడడం, పునరావాసం, తిరిగి వారిని మామూలు స్థాయికి తీసుకురావవవడం, బాధితులైన కమర్షియల్ సెక్స్ వర్కర్లను దానిని నుంచి బయటపడవేసి వారికి మామూలు జీవితాన్ని అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
5. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ : వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఉద్యోగస్తులైన మహిళలకు సురక్షితమైన వారికి సౌకర్యవంతమైన ప్రదేశంలో వసతిని అందుబాటులోకి తేవడం దీని ఉద్దేశం . నగరాలు, పట్టణ ప్రాంతాలలో, లేదా గ్రామీణ ప్రాంతాలలో సైతం వీలున్న చోట, మహిళలకు ఉపాధి అవకాశాలు ఉన్నచోట పిల్లలకు డే కేర్ సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది.
6. కౌమార బాలకల కోసం పథకం (ఎస్.ఎ.జి) : ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. 11 నుంచి 14 సంవత్సరాల మధ్యవయస్కులైన , పాఠశాల వెలుపల ఉన్న బాలికలకు పౌష్టికాహార మద్దతునిచ్చేందుకు, వారి ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు అలాగే పౌష్టికాహారాన్ని అందించి మరొవైపు వారిని పాఠాశాలకు వెళ్లేలా చేసేందుకు ప్రేరణ నివ్వడం దీని ఉద్దేశం. ఇది జీవన నైపుణ్యాల శిక్షణను అందించడం, మరో వైపు పౌష్టికాహారేతర కాంపొనెంట్ కింద ప్రజా సేవలు అందుబాటులోకి తేవడం దీని ఉద్దేశం.
.7. పోషణ్ అభియాన్ : పోషణ్ అభియాన్‌ను 2018 మార్చి 8 న ప్రారంభించారు. దేశవ్యాప్తంగ పౌష్టికాహార సమస్యలను ఐసిటి అప్లికేషన్, కన్వర్జెన్స్, కమ్యూనిటీ తోడ్పాటు, అలవాట్లలో మార్పు, జన్ ఆందోళన్, సామర్ధ్యాల నిర్మాణం, ప్రోత్సాహకాలు, అవార్డులు, ఆవిష్కరణల ద్వారా పౌష్టికాహారా లోప సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.
8. బేటి బచావో బేటీ పఢావో (బిబిబిపి) : బేటి బచావో బేటీ పఢావో (బిబిబిపి) పథకాన్ని 2015 జనవరి లో ప్రారంభించింది. బాల బాలికల శాతం మధ్య వ్యత్యాసాన్ని తొలగించేందుకు , బాలికల సాధికారతకు సంబంధించిన అంశాలను చూసేందుకు మహిళలకు సంబంధించి జీవన చక్రంలోని వివిధ అంశాలకు సంబంధించి ఈ పథకాన్ని తీసుకువచ్చారు. బాలబాలికల మధ్య వ్యత్యాసం చూపి బాలికా శిశువులను వదిలించుకునే ధోరణిని అరికట్టడం, బాలికల రక్షణకుపాటుపడడం, వారికి సరైన విద్యను అందిచడం, అన్ని రంగాలలో వారు పాల్గొనేట్టు ప్రొత్సహించడం, వంటివి ఇందులోని ముఖ్యాంశాలు. ఈ పథకానికి సంబంధించిన కీలక అంశాలను జాతీయ స్థాయి మీడియా ద్వారా ప్రచారం కల్పించడం, ఎంపిక చేసినజిల్లాలలో బహుళ రంగాలకు సంబంధించిన చర్యలు తీసుకోవడం ఇందులో ఉన్నాయి.
9. మహిళా శక్తి కేంద్ర (ఎం.ఎస్.కె) : మహిళా శక్తి కేంద్ర (ఎం.ఎస్.కె) పథకాన్ని 2017 నవంబర్ లో కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకంగా తీసుకువచ్చారు. గ్రామీణ ప్రాంత మహిళలకు కమ్యూనిటీ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ద్వారా సాధికారత కల్పించడం దీని ఉద్దేశం. వివిధ రంగాలకు చెందిన పథకాలను ,మహిళలకు సంబంధించిన పథకాలను సమ్మిళితం చేయడం దీని ఉద్దేశం. ఈ పథకాన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాల తోడ్పాటుతో అమలు చేస్తారు. ఇందుకు కేంద్రం 60 శాతం, ఈశాన్య ప్రాంతం, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాలు 40 శాతం వంతున ఖర్చు మొత్తాన్ని భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల విషయంలో నిధులు 90:10 శాతం వంతున ఖర్చు చేస్తారు. కేంద్రపాలిత ప్రాంతాలకు వందశాతం కేంద్రప్రభుత్వ నిధులు అందుతాయి.
10..బాలల సంరక్షణ పథకం: మిషన్ వాత్సల్య పథకం కింద మంత్రిత్వశాఖ ఈ పథకాన్ని2009-10 నుంచి . (పూర్వపు సమీకృత బాలల సంరక్షణ పథకం) అమలు చేస్తున్నది. క్లిష్ట పరిస్థితులలో ఉన్న బాలలకు మద్దతు నిచ్చేందుకు ఉద్దేశించినది. దీనిద్వారా వసతి, వయసుకు సరిపడిన వృత్తి నైపుణ్యశిక్షణ, వినోదం, ఆరోగ్యసేవలు, కౌన్సిలింగ్ తదితర సేవలు అందిస్తారు.
సంస్థాగతేతర సంరక్షణ కాంపొనెంట్ కింద, దత్తతకు మద్దతునివ్వడం, సంరక్షణ స్పాన్సర్‌షిప్, కి వీలు కల్పిస్తారు. సిపిఎస్ కింద 18 సంవత్సరాలు పైబడిన తర్వాత సంస్థాగత సేవలనుంచి స్వతంత్ర జీవనానికి అవసరమైన సహాయాన్ని అందిస్తారు. ఈ చట్టం అమలు బాధ్యత ప్రాథమికంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతలపై ఉంటుంది.
11. ప్రధాన మంత్రి మాతృవందన యోజన (పిఎంఎంవివై) : ఇది కేంద్ర ప్రాయోజిత కండిషనల్ కాష్ ట్రాన్స్‌ఫర్ పథకం. 01-01-2017 నుంచి అమలులో ఉంది. పిఎంఎంవివై పథకం గర్భిణులు, పాలిచ్చే తల్లులకు (పిడబ్ల్యు ఎల్ ఎం ) కు వర్తిస్తుంది. అయితే ఇది కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన రెగ్యులర్ ఉద్యోగంలో ఉన్న వారికి లేదా ఏ ఇతర చట్టం కింద అయినా ఇదే ప్రయోజనాలు పొందుతున్న వారికి ఇది వర్తించదు. ఈ పథకం కింద రూ 5000లను అర్హులైన లబ్ధిదారులకు మూడు వాయిదాలలో చెల్లిస్తారు. దీనిని వారు గర్భిణులుగా ఉన్నప్పుడు అలాగే పిల్లలకు పాలిచ్చే కాలంలో ఆరోగ్యపరమైన పౌష్టికాహారపరమైన స్థితిని బట్టి నిర్దేశిత విధానాలకు అనుగుణంగా దీనిని చెల్లిస్లారు. అర్హులైన లబ్ధిదారులు మిగిలిన నగదు మొత్తం ప్రోత్సాహకాన్ని ఆమోదిత నిబంధనలకు అనుగుణంగా జనని సురక్ష యోజన కింద మాతృత్వ ప్రయోజనం కింద దీనిని అందిస్తారు. దీనిద్వారా సగటున ఒక మహిళ రూ 6000 ల వరకు పొందుతుంది.
పైన పేర్కొన్న పథకాలకు సంబంధించిన నిధుల కేటాయింపు, విడుదల, వినియోగానికి సంబంధించిన వివరాలను గత 3 సంవత్సరాలకు సంబంధించి అనుబంధం-1 లో పొందుపరచడం జరిగింది.
ఈ సమాచారాన్ని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరాని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1782254)
Visitor Counter : 830