గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు వ్యూహం
Posted On:
15 DEC 2021 4:04PM by PIB Hyderabad
గ్రామీణ పేదరికాన్ని పరిష్కరించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. జీవనోపాధి అవకాశాలను పెంపొందించడం, గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించడం, సామాజిక భద్రతను అందించడం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. గ్రామీణ యువత నైపుణ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భూ ఉత్పాదకతను పెంచడం మొదలైనవి గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాల ద్వారా.. అనగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్), దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం), దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ – గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై), ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (పీఎంఏవై-జీ), ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్ వై), శ్యామ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్ (ఎస్ పీఎంఆర్ఎం) మరియు జాతీయ సామాజిక సహాయ కార్యక్రం (ఎన్ఎస్ఏపీ) ), భూ వనరుల శాఖ కార్యక్రమాలు.. అంటే ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (డబ్ల్యూడీసీ-పీఎంకేఎస్ వై) యొక్క వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కాంపోనెంట్ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింది అన్ని గ్రామీణ అభివృద్ధి పథకాలు సరిగ్గా అమలయ్యేలా చూస్తుంది. కార్యక్రమ ప్రయోజనాలు గ్రామీణ పేదలకు చేరేలా చూసేందుకు పనితీరు సమీక్ష కమిటీ సమావేశాలు, జిల్లా అభివృద్ధి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశాలు, నేషనల్ లెవెల్ మానిటర్స్, ఏరియా ఆఫీసర్స్ స్కీమ్స్, కామన్ రివ్యూ మిషన్, కాంకరెంట్ ఎవాల్యువేషన్, ఇంపాక్ట్ అసెస్ మెంట్ స్టడీస్ వంటివి నిర్వహిస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ వంటి కొన్ని పథకాల ద్వారా సామాజిక ఆడిట్ కూడా నిర్వహిస్తారు. పథకాల మూడవ-పక్షం మూల్యాంకనం కూడా క్రమం తప్పకుండా నిర్వహించబడుతుంది. గుర్తించిన వాటిపై తగిన విధంగా చర్యలు తీసుకోబడతాయి. పైన పేర్కొన్న వాటికి అదనంగా, ఆస్తుల జియో-ట్యాగింగ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ , నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఆధార్ ఆధారిత ఎంఐఎస్ కోసం లావాదేవీ ఆధారిత ఐటీ వ్యవస్థలను ఉపయోగించి పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి కూడా చర్యలు తీసుకోబడ్డాయి. చెల్లింపు వ్యవస్థ , ఉపాధి కోసం గ్రామీణ రేట్లు ఉపయోగించి అంచనా గణన కోసం సాఫ్ట్‌వేర్ మరియు స్వతంత్ర సామాజిక ఆడిట్ యూనిట్ల ఏర్పాటు మరియు అంబుడ్స్‌మన్ నియామకం వంటి చర్యలు కూడా తీసుకున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్దిష్ట సమీక్షలు కూడా ఎప్పటికప్పుడు చేపట్టబడతాయి. అంతేకాకుండా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారాన్ని అలాగే పథకాల అమలు స్థితిపై మీడియాలో వచ్చే నివేదికలను మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది.
ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1781975)
Visitor Counter : 744